Begin typing your search above and press return to search.

ఒకేసారి మూడు లక్షల గృహ ప్రవేశాలు ...కూటమి రికార్డు

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అతి పెద్ద కార్యక్రమం ఒకటి బుధవారం జరుగుతుంది.

By:  Satya P   |   12 Nov 2025 9:15 AM IST
ఒకేసారి మూడు లక్షల గృహ ప్రవేశాలు ...కూటమి రికార్డు
X

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అతి పెద్ద కార్యక్రమం ఒకటి బుధవారం జరుగుతుంది. లక్షల మందికి ఒకేసారి ఇంటి యజమానులుగా చేసే బృహత్తర కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుడుతున్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఒక పెద్ద హామీని నెరవేరుస్తోంది. అది కూడా అధికారంలోకి కేవలం 17 నెలల వ్యవధిలోనే ఈ విధంగా పేదలను సొంతింటి వారిని చేయడం వారి కలలను నెరవేర్చడం అన్నది ఒక రికార్డుగా చూస్తున్నారు.

వేగవంతంగా :

కూటమి ప్రభుత్వం పాలనా బాధ్యతాలు స్వీకరించిన తరువాత వేగంగా ఈ ప్రక్రియ ప్రారంభించింది. అందరికీ ఇళ్ళు అన్న పధకములో భాగంగా సొంత ఇల్లు లేని వారిని గుర్తించడమే కదు వారిని ఒక ఇంటి వారిని చేసేందుకు నిధులను సమకూర్చడంతో పాటు నిర్మాణం పనులు ఒక కాలపరిమితిలో పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకుంది. ఆవిధంగా రాష్ట్రవ్యాప్తంగా చూస్తే మూడు లక్షల ఇళ్ళు పూర్తి అయ్యాయి. దాంతో వాటిలో పేదలు అంతా ఒకే సారి గృహ ప్రవేశం చేయనున్నారు. అంతే కాదు అందరూ ఇక మీదట ఇంటి యజమానులు అవుతున్నారు. తమకు ఒక ధీమాగా ఇల్లు ఉందని వారు భావించేలా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చర్యలు దోహదపడుతున్నాయి.

అక్కడ నుంచే బాబు :

ఒకేసారి ఈ సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జరగనుంది. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం దేవగుడిపల్లి గ్రామంలో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో సీఎం చంద్రాబు పాల్గొనడంతో పాటు.రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. అదే విధంగా లబ్ధిదారులకు ఇంటి తాళాలు చంద్రబాబు స్వయంగా అందించనున్నారు.

పేదల కల సాకారం :

దశాబ్దాల పేదల కలని నెరవేర్చామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన బీఎల్సీ కింద నిర్మించిన రెండు లక్షల 28 వేల 34 ఇళ్లు అదే విధంగా పీఎంఏవై గ్రామీణ్ కింద 65 వేల292 ఇళ్లు పీఎంఏవై జన్మన్ పథకం కింద మరో 6 వేల 866 ఇళ్లలో లబ్దిదారులు అంతా కలసి ఒకేసారి గృహ ప్రవేశాలు చేయనున్నారు. మొత్తంగా మూడు లక్షల 192 ఇళ్లకు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఈ గృహ ప్రవేశాలు జరగనున్నాయి. ఒక విధంగా ఏపీ చరిత్రలో ఇది సువర్ణ అధ్యాయంగా చెబుతున్నారు మరో వైపు చూస్తే ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుక విధానం ద్వారా దాదాపు ఉచిత ఇసుక విధానంతో దాదాపు 20 టన్నుల ఇసుక ఉచితంగా పొందేందుకు పేదల ఇళ్ళకు ప్రభుత్వం వీలు కల్పించింది. ఆ విధంగా అన్ని రకలైన వెసులుబాటుతో ఇంత పెద్ద కార్యక్రమం సాగింది.