Begin typing your search above and press return to search.

ఉప రాష్ట్రపతి ఏపీకి...మోడీ ప్లాన్ అదుర్స్ !

ఈ క్రమంలో కొత్త ఉప రాష్ట్రపతి ఏపీ నుంచే వస్తారని మరో సరికొత్త ప్రచారానికి తెర లేస్తోంది.

By:  Satya P   |   7 Aug 2025 11:43 AM IST
ఉప రాష్ట్రపతి ఏపీకి...మోడీ ప్లాన్ అదుర్స్ !
X

దేశంలో ఉప రాష్ట్రపతి ఎన్నికలు సెప్టెంబర్ లో జరగనున్నాయి. రెండేళ్ళ కాలపరిమితికి సంబంధించి జరిగే ఈ ఎన్నికల్లో అధికార ఎన్డీయే విపక్ష ఇండియా కూటమి తలపడడం తధ్యంగా కనిపిస్తోంది. ఎలక్ట్రోల్ కాలేజీలో ఎన్డీయేకు ఉప రాష్ట్రపతిని గెలిపించుకునేంత మెజారిటీ ఉంది. అయితే ఉప రాష్ట్రపతి అభ్యర్ధి ఎంపిక విషయంలో ఎన్డీయే ప్రభుత్వం అన్నీ జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ఆచీ తూచీ వ్యవహరిస్తోంది. రానున్న బీహార్ పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కొత్త ఉప రాష్ట్రపతి అభ్యర్ధిని ఎంపిక చేయాలని అలోచిస్తోంది.

ఎన్నో లెక్కలతో :

ఉప రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఉత్తరాది నుంచా లేక దక్షిణాది నుంచా అన్నది ఒక చర్చ అయితే ఏ సామాజిక వర్గం అన్నది మరో చర్చ. ఇక ఇండియా కూటమి తన అభ్యర్థిని నిలబెట్టే సాహసం చేయకుండా అన్నీ ఆలోచించి అభ్యర్ధిని రంగంలోకి దించాలని కూటమి ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో అనేక పేర్లు తెర ముందుకు వచ్చాయి. బీహార్ ఎన్నికలు కాబట్టి ఏకంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నే ఎందుకు ఉప రాష్ట్రపతిగా చేయకూడదు అన్నది కూడా చర్చగా వచ్చింది. అయితే నితీష్ ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో జేడీయూకే ఎవరో ఒకరికి అవకాశం ఇద్దామని అనుకున్నారని ప్రచారం జరిగింది. మొత్తంగా బీహార్ నుంచే అభ్యర్థి వస్తారని కూడా అనుకున్నారు.

బీసీ నినాదంతో :

ఇక చూస్తే కనుక రాజీనామా చేసిన ఉప రాష్ట్రపతి జగదీప్ ధంఖర్ బీసీ అయినందువల్ల ఆయన ప్లేస్ లో వచ్చేవారు ఆ సామాజిక వర్గానికి చెందిన వారికే ఇస్తే బాగుంటుంది అన్నది మరో ఆలోచన. ఇక ఈసారి దక్షిణాదికే అవకాశం ఇవ్వాలని మరో వ్యూహం ఉందని అంటున్నారు. దాంతో హర్యానా రాష్ట్ర గవర్నర్ గా పనిచేసి ఇటీవలనే పదవీ విరమణ చేసిన బండారు దత్తాత్రేయకు ఈ పదవి ఇస్తారని కూడా అనుకున్నారు. ఆయన ద్వారా తెలంగాణా నుంచి దక్షిణాది బీసీకి చాన్స్ ఇచ్చినట్లు అవుతుందని కూడా ఆలోచించారని చెప్పుకున్నారు.

ఏపీ వైపు తిరిగిన తీరు :

ఈ క్రమంలో కొత్త ఉప రాష్ట్రపతి ఏపీ నుంచే వస్తారని మరో సరికొత్త ప్రచారానికి తెర లేస్తోంది. ఆయన ఎవరు అంటే ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అని అంటున్నారు. ఆయన సీనియర్ న్యాయమూర్తి గా సుప్రీం కోర్టులో పనిచేసి పదవీ విరమణ చేశారు. అయోధ్య రామ మందిరం మీద ఇచ్చిన తీర్పులో ధర్మాసనంలో ఆయన కూడా ఒకరిగా ఉన్నారు. న్యాయ వ్యవస్థ మీద పూర్తి అవగాహన ఉన్న వారు. ఆయనను అందుకే బీజేపీ ఏరి కోరి ఏపీకి గవర్నర్ గా పంపినింది. ఆయన 2023 ఫిబ్రవరిలో ఏపీ గవర్నర్ గా నియమితులయ్యారు. ఇప్పటికి రెండున్నరేళుగా ఆయన ఈ కీలక పదవిలో ఉన్నారు.

ఇండియా కూటమికి దెబ్బ :

మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన దక్షిణాది వారికి ఈ పదవి ఇవ్వడం ద్వారా ఇండియా కూటమికి దెబ్బ తీయాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది అని అంటున్నారు. ఈ విధంగా చేస్తే ప్రత్యర్ధులు ఖంగు తింటారు అని ఆలోచిస్తోంది. అంతే కాదు రానున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీహార్ ఎన్నికల్లో బీజేపీకి ఎన్డీయేకు ఈ పరిణామం రాజకీయంగా అనుకూలంగా మారుతుందని లెక్క వేసుకుంటోంది పైగా దక్షిణాదికి చెందిన వారికి ఈ అవకాశం ఇచ్చామని చెప్పుకోవడానికి వీలు అవుతుందని ఆ విధగా సౌత్ వైపు బీజేపీ మరింత ఫోకస్ పెట్టేందుకు వీలు అవుతుందని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీ గవర్నర్ ఈ కీలక పదవి దక్కితే మాత్రం అది రాజకీయంగా సంచలనమే అవుతుంది అని అంటున్నారు.