Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తికి మ‌రింత సొమ్ము.. ఎలాగంటే!

ఇప్పుడు తాజాగా మ‌రింత సొమ్ము కోసం చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించిన‌ట్టు సీఆర్‌డీఏ వ‌ర్గాలు చెబుతున్నాయి.

By:  Garuda Media   |   26 Jun 2026 4:00 AM IST
అమ‌రావ‌తికి మ‌రింత సొమ్ము.. ఎలాగంటే!
X

ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం వ‌డివ‌డిగా సాగుతోంది. దీనికి కేంద్రం స‌హ‌కారంతో ప్ర‌పంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ)లు చెరో 15 వేల కోట్ల రూపాయ లను రుణంగా అందిస్తున్నాయి. అయితే.. విస్త‌రిస్తున్న అమ‌రావ‌తి.. రోజు రోజుకు పెరుగుతున్న ప్ర‌ణాళిక లతో ఈ రుణం ఎక్క‌డా స‌రిపోయేలా లేదు. దీంతో ప్ర‌భుత్వం బ‌డ్జెట్ నుంచి కూడా ఇటీవ‌ల వెయ్యి కోట్లు కేటాయించింది.

ఇది కాకుండా అడ‌పా ద‌డ‌పా కూడా.. నాన్ ప్లాన్ నిధుల నుంచి కూడా రాజ‌ధానికి నిధులు ఇస్తున్నారు. ఇప్పుడు తాజాగా మ‌రింత సొమ్ము కోసం చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించిన‌ట్టు సీఆర్‌డీఏ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇటీవ‌ల ప్ర‌పంచ బ్యాంకు ప్ర‌తినిధులు అమ‌రావ‌తిని సంద‌ర్శించారు. తాము ఇచ్చిన రుణం తాలూ కు నిధుల‌ను ఏ విధంగా ఖ‌ర్చు చేస్తున్నార‌ని తెలుసుకున్నారు. జ‌రుగుతున్న ప‌నుల‌ను కూడా ప‌రిశీలిం చారు.

ఆయా ప‌నుల తీరుపై ప్ర‌పంచ బ్యాంకు ప్ర‌తినిధులు సంతృప్తి వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర స‌ర్కా రు మ‌రో 10 వేల కోట్ల మేర‌కు ప్ర‌పంచ బ్యాంకు నుంచి రుణం కోరింది. దీనిపై సీఆర్ డీఏ ప్ర‌తిపాద‌న‌లు కూడా చేసింది. దీనికి నేరుగా రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే హామీ ఉండ‌నుంద‌ని అధికారులు చెబుతున్నారు. ఇక‌, ఈ ప్ర‌తిపాద‌న‌కు ప్ర‌పంచ బ్యాంకు కూడా అంగీక‌రించిన‌ట్టు తెలిసింది. అదేస‌మ‌యంలో ప్ర‌స్తుతం ఇస్తున్న రుణాన్ని దీనికి అనుసంధానించ‌నున్న‌ట్టు పేర్కొంది.

ఈ సొమ్ముతో మౌలిక స‌దుపాయాల‌కు అవ‌స‌ర‌మైన నిధులు స‌మ‌కూరిన‌ట్టేన‌ని అధికారులు చెబుతున్నా రు. ప్ర‌స్తుతం కాల్వ‌లు, అంత‌ర్గ‌త ర‌హ‌దారుల నిర్మాణంపూర్తికావొచ్చింద‌ని తెలిపారు. ఇక‌, అండ‌ర్‌గ్రౌండ్ డ్రైనేజీ స‌హా.. ఇత‌ర స‌దుపాయాల‌కు 10 వేల కోట్ల సొమ్ము ఉప‌యోగప‌డుతుంద‌ని చెబుతున్నారు. దీనికి ప్ర‌పంచ బ్యాంకు ఆమోదం తెలిపింద‌ని.. దీంతో ప‌నులు వేగంగా చేప‌ట్టేందుకు మార్గం సుగ‌మం అయింద‌ని అంటున్నారు.