ఫ్రీగా త్రీవీలర్స్...ఎవరు అర్హులంటే !
ఉచితంగా త్రీ వీలర్స్ ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది. అయితే ఇది అందరికీ కాదు సుమా. దివ్యాంగులకు మాత్రమే.
By: Satya P | 5 Nov 2025 8:00 AM ISTఉచితంగా త్రీ వీలర్స్ ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది. అయితే ఇది అందరికీ కాదు సుమా. దివ్యాంగులకు మాత్రమే. వారి సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఇది. దివ్యాంగులు కూడా సమాజంలో అందరి మాదిరిగా ఉండాలని వారు కూడా తమ వైకల్యం శాపంగా కాకుండా ముందుకు అడుగులు వేయాలని భావిస్తూ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఇది. అయితే ఈ కార్యక్రమం ద్వారా ఎవరు ఫ్రీగా త్రీ వీలర్స్ పొందేందుకు అర్హులు అంటే పూర్తి వివరాలు చూడాల్సిందే మరి.
రెట్రోపిట్టెడ్ త్రీవీలర్ మోటార్ సైకిళ్లు :
ఏపీలో దివ్యాంగుల కోసం ఉచితంగా రెట్రోపిట్టెడ్ త్రీవీలర్ మోటార్ సైకిళ్లు అందచేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్రంలోని దివ్యాంగులకు ఉచితంగా అందిస్తూ ఏకంగా 1750 రెట్రోపిట్టెడ్ త్రీవీలర్ మోటార్ సైకిళ్లు కూటమి ప్రభుత్వం అందచేయనుంది. అయితే దీనికి సంబంధించిన విధి విధానాలను రూపొందించారు. దివ్యాంగులలో కూడా అర్హులైన వారికే ఈ పధకం వర్తిస్తుంది అని అధికారులు చెబుతున్నారు.
వీరందరికీ మాత్రమే :
ఇక ఈ పధకం కింద ఉచితంగా త్రీ వీలర్స్ అందుకోవడానికి అర్హుల గురించి సమాచారం అయితే ఇలా ఉంది. రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ అర్హత కానీ ఆపై ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులు కానీ ఇక కనీసంగా 10 వతరగతి పాసై స్వయం ఉపాధితో జీవించే వారు కానీ ఈ పధకానికి అర్హులు. అంతే కాదు, వారు పద్దెనిమిది ఏళ్ళ నుంచి నలభై అయిదేళ్ళ లోపు వయసు కలిగి ఉండాలి. అంతే కాదు, డెబ్బై శాతం దాకా అంగవైకల్యం గలవారు అయి ఉండాలి, ఇక డ్రైవింగ్ లైసైన్స్ ఉన్న వారు అర్హులని అధికారులు చెబుతున్నారు ఈ పధకం కోసం మరిన్ని వివరాలకు www.apdascac.ap.gov.in వెబ్ సైట్ ని సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన వారు సద్విని యోగం చేసుకోవాలని కోరుతునారు. అంతే కాదు ఈ నెల 25 లోపు ఆన్ లైన్ లో ఈ పధకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మంచి అవకాశం :
ఈ పధకం అన్నది దివ్యాంగులకు మంచి అవకాశం. ఉచితంగా పెద్ద ఎత్తున అందచేస్తున్న త్రీ వీలర్ మోటార్ సైకిల్ వారి జీవితానికి వేగం పెంచుతుంది. ఎక్కడికి అయినా వారే స్వయంగా వెళ్ళేందుకు వారికి ఒక ఆత్మ విశ్వాసాన్ని కూడా అందిస్తుంది. అంతే కాదు తమ ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి మరింతగా అభివృద్ధి చెందడానికి ఈ పధకం పూర్తిగా వీలు కల్పిస్తుంది అని అంటున్నారు. మరి అర్హులంతా త్వరపడి సరైన ఫార్మెట్ లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంది.
