ఏపీలో మహిళలకు ఉచిత బస్సు.. జీవో జారీ!
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ.. కూటమి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో ఏయే బస్సులు మహిళలకు కేటాయిస్తున్నదీ వివరించారు.
By: Garuda Media | 12 Aug 2025 12:05 AM ISTఏపీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ.. కూటమి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో ఏయే బస్సులు మహిళలకు కేటాయిస్తున్నదీ వివరించారు. అలానే.. ఏయే బస్సుల్లో మహిళలు ఎక్కాలి? ఏయే బస్సుల్లో ఎక్కకూడదు..? అనే విషయాలను కూడా స్పష్టం చేశారు. అదేవిధం గా బస్సుల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారన్న విషయాన్ని కూడా వివరించారు. బస్సుల అందుబా టు, డ్రైవర్లు, కండెక్టర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటివాటిని కూడా ఈ జీవోలో పేర్కొన్నారు.
ఇవీ .. నిబంధనలు
+ మొత్తం 5 రకాల బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు.
+ వీటిలో 1) పల్లె వెలుగు, 2) ఆల్ట్రా పల్లెవెలుగు, 3) సిటీ ఆర్డినరీ, 4) మెట్రో ఎక్స్‌ప్రెస్, 5) ఎక్స్‌ప్రెస్ బస్సులు ఉన్నాయి.
+ విద్యార్థినులు, మహిళా ఉద్యోగులు, సాధారణ మహిళలు, ట్రాన్స్ జెండర్లు ఆధార్, ఎన్నికల గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్సు వంటి మొత్తం 11 రకాల గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి చూపించాలి.
+ అదేవిధంగా తిరుమల-తిరుపతి మధ్య కొండపై తిరిగే సప్తగిరి బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు.
+ అలాగే.. నాన్ స్టాప్, పలు రాష్ట్రాల మధ్య తిరిగే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు.
+ సప్తగిరి ఎక్స్ ప్రెస్, ఆల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఏసీ, ఇంద్ర, అమరావతి వంటి లగ్జరీ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణాన్ని అనుమతించరు.
+ అన్ని ఉచిత బస్సుల్లో సీసీ కెమెరాలు, కండక్టర్లకు బాడీ ఓర్న్ కెమెరాలు ఉంటాయి.
+ ఎలాంటి ఘటన జరిగినా.. డ్రైవర్, కండెక్టర్లను బాధ్యులుగా పేర్కొన్నారు.
+ ప్రతి బస్సును అన్ని సాధారణ, ప్రధాన బస్టాండ్ల మీదుగా నడుపనున్నారు.
+ బస్సు సామర్థ్యాన్ని మించి మహిళలను అనుమతించరు.
+ ఉచితంగా కేటాయించిన బస్సుల్లో 85 శాతం సీట్లను కేవలం మహిళలకు కేటాయిస్తారు.
+ మహిళలు.. జీరో ఫేర్ టికెట్లను పొందాల్సి ఉంటుంది.
+ ఆగస్టు 15 నుంచి ఈ పథకం అందుబాటులోకి రానుంది.
