Begin typing your search above and press return to search.

ఉచిత బస్సుకి అందమైన పేరు....కండిషన్లు మీద కొత్త అప్డేట్ !

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి కౌంట్ డౌన్ ప్రారంభం అయింది.

By:  Satya P   |   30 July 2025 2:00 AM IST
ఉచిత బస్సుకి అందమైన పేరు....కండిషన్లు మీద కొత్త అప్డేట్ !
X

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి కౌంట్ డౌన్ ప్రారంభం అయింది. ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించేలా ప్రభుత్వం ఈ పధకాన్ని అమలు చేయబోతోంది. దీనిని సంబంధించి రవాణా మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ కీలక అప్డేట్ నే చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగష్టు 15వతేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని మంత్రి స్పష్టంగా చెబుతున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు :

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కేవలం జిల్లాలకే పరిమితం చేస్తారు అని ఇటీవల దాకా వినిపించింది. అయితే ఇపుడు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణానికి అవకాశం ఇస్తారు అని అంటున్నారు. ఉమ్మడి పాత జిల్లాలకు ఈ పధకం వర్తింపచేస్తారు అన్న ప్రచారం కూడా వచ్చింది. అయితే తెలంగాణా కర్ణాటకలో మాదిరిగానే ఈ పధకం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తేనే తగిన ఫలితం వస్తుందని అంటున్నారు. దాంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తే కనుక కచ్చితంగా ఈ పధకం సక్సెస్ అవుతుందని అంటున్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం తెలంగాణ కర్ణాటక, తమిళనాడులలో ఎలా అమలవుతోందో అదే విధంగానే ఏపీలోనూ అమలు చేయనున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అంటున్నారు.

ప్రత్యేక బస్సులు ఉంటాయా :

ఈ ఉచిత బస్సులను ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న బస్సులతో నడుపుతారా లేక కొత్త బస్సులు తీసుకుని వస్తారా అన్నది కూడా చర్చగా ఉంది మహిళలకు ప్రత్యేకంగా బస్సులు ఇవ్వాలంటే ఇబ్బంది అవుతుందని అంటున్నారు. బస్సుల కొరత సిబ్బంది కొరత ఉందని చెబుతున్నారు దాంతో పాటు ఉచిత బస్సులు అంటే రెగ్యులర్ గా ప్రయాణం చేసే వారికి అసౌకర్యం ఏర్పడుతుందని అంటున్నారు. దాంతో ప్రత్యేకంగా బస్సులు తీసుకుని రావాలని ఆలోచనలు ప్రభుత్వానికి ఉన్నాయని చెబుతున్నారు

ఎలక్ర్టిక్ బస్సులతో శ్రీకారం :

ఏపీలో కూటమి ప్రభుత్వం మహిళల కోసం కొత్త బస్సులనే తీసుకుని రాబోతోంది. అవి ఎలక్ర్టిక్ బస్సులుగా ఉంటాయని అంటున్నారు. దీని వల్ల ఆర్టీసీకి ఇంధన సమస్యలు లేకుండా ఉంటుందని అలాగే ఆర్ధిక భారం పడదని ఆలోచిస్తోంది. దాంతో 1400లకు పైగా కొత్త ఎలక్ర్టిక్ బస్సులను కొనుగోలు చేయనున్నట్లుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆగస్టు 15 అంటే ఎంతో దూరం లేదు. మరి కొత్త బస్సులు ఈలోగానే వస్తాయా అన్న చర్చ కూడా సాగుతోంది.

మాట నిలబెట్టుకోవడానికేనా :

రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఇస్తామని కూటమి ఎన్నికల వేళ తన మేనిఫేస్టోలో ప్రకటించింది. అయితే జిల్లా వరకే దానిని పరిమితం చేస్తారని వార్తలు రావడంతో మహిళలలో అసంతృప్తి అయితే ఉంది. దాంతో ప్రభుత్వం పునరాలోచన చేస్తోంది అని చెబుతున్నారు పైగా కర్ణాటక తెలంగాణాలలో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణం అందిస్తున్నారు. ఆ పోలిక కూడా ఉండడంతో ఏపీలో కూడా అదే విధానం అమలు చేయాలని చూస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి కూటమి కనుక ఈ హామీని తీరిస్తే ప్రభుత్వం పట్ల మహిళాలోకం లో సానుకూలత బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అన్ని పథకాల కంటే ఎక్కువ మంది లబ్ధిదారులు ఉచిత బస్సు పథకానికి ఉంటారని ఇది సూపర్ హిట్ అవుతుందని కూడా కూటమి బలంగా నమ్ముతోంది. అంతే కాదు తొందరలోనే మహిళలకు ఉచిత బస్సు పథకానికి మంచి పేరు పెట్టనున్నట్లుగా చెబుతున్నారు. మరి ఆ పేరు ఎలా ఉంటుందో కూడా ఆసక్తి నెలకొంది.