Begin typing your search above and press return to search.

లాస్ట్ లో విశాఖ....బాబు దిశా నిర్దేశం

సంతానోత్పత్తిలో ఏపీ వెనుకబడి ఉందని గణాంకాలు తెలియచేస్తున్నాయి. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుదల మీద ఉన్నారు.

By:  Satya P   |   23 April 2026 8:15 AM IST
లాస్ట్ లో విశాఖ....బాబు దిశా నిర్దేశం
X

సంతానోత్పత్తిలో ఏపీ వెనుకబడి ఉందని గణాంకాలు తెలియచేస్తున్నాయి. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుదల మీద ఉన్నారు. సరైన యాక్షన్ ప్లాన్ తో ముందుకు సాగాలని ఆయన అధికారులకు దిశా నిర్దేశం చేశారు. లేకపోతే ఏపీలో టోటల్ ఫెర్టిలిటీ రేటు దారుణంగా పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాపులేషన్ మేనేజ్మెంట్ విధానం అమలుపై చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి.

కడప ఫస్ట్ ప్లేస్ లో :

ఇక జిల్లాల వారీగా ఫెర్టిలిటీ రేట్ వివరాలను అధికారులు తెలియచేశారు. దాంట్లో కనుక చూస్తే ఫెర్టిలిటీ రేటులో ఏపీలో అత్యధికంగా కడపలో 1.99 శాతంగా నమోదు అయింది. అదే సమయంలో అత్యల్పంగా విశాఖలో 1.32 శాతంగా టోటల్ ఫెర్టిలిటీ రేటు ఉంది. ఇక రాష్ట్రంలో 1.5 సగటుతో టోటల్ ఫెర్టిలిటీ రేటు నమోదు అయినట్టుగా అధికారులు వెల్లడించారు. అయితే టోటల్ ఫెర్టిలిటీ రేటుని 2.1కి పెంచడానికి తగిన కార్యాచరణ చేపట్టాలని చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు.

జనాభా సంరక్షణ నినాదం :

ఇక నాడు జనాభా నియంత్రణ ఎంతటి బలమైన నినాదంగా ఉందో ఇపుడు జనాభా సంరక్షణ అంతకంటే బలమైన నినాదం కావాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని ఆయన చెపుకొచ్చరు. ఏపీలో టోటల్ ఫెర్టిలిటీ రేటు ప్రస్తుతం చూస్తే ఏపీలో లక్ష్యం కన్నా ఆరు శాతం తక్కువలో ఉందని బాబు విశ్లేషించారు. తల్లికి వందనం పాపులేషన్ మేనేజ్మెంట్‌ కార్యక్రమంలో భాగమేనని ఆయన స్పష్టం చేశారు. భారతదేశంలో కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉందని దానిని కాపాడుకునేందుకు మైక్రో ఫ్యామిలీ సంస్కృతి విస్తరించకుండా చూడాలని బాబు అధికారులని కోరారు. ఉమ్మడి అలాగే పెద్ద కుటుంబాలకు అధిక ప్రోత్సాహకాలు ప్రణాళిక రూపాందించాలని సూచించారు.

ప్రజలలో అవగాహన :

జనాభా సంరక్షణ వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలలో అవగాహన కల్పించాలని ఆయన కోరారు. జనాభా నిర్వహణ అంశాన్ని కూడా ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళ్లాలని చంద్రబాబు చెప్పారు. పాపులేషన్ మేనేజ్మెంట్‌తో పాటుగానే ప్రజారోగ్య రక్షణకు కార్యాచరణ చేపట్టాలని కూడా బాబు స్పష్టం చేశారు. అదే విధంగా సమతుల్య ఆహారం తీసుకోకపోవడం వల్ల ఎక్కువ మంది అనారోగ్యం పాలవుతున్నారని సీఎం అధికారులకు గుర్తు చేశారు. పోషకాహారం ప్రివెంటివ్ హెల్త్‌పైన అంతా దృష్టి పెట్టేలా చూడాలని అన్నారు ఇక ఆయుర్వేదంతో పాటుగా నేచురోపతి చికిత్సా విధానాలను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని బాబు కోరారు. ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేలా చూడాలని, అదే సమయంలో ఆస్పత్రులకు వచ్చిన రోగులకు వారి రికార్డుల ఆధారంగా డైట్ ప్యాట్రన్ పోషకాహారం అందించాల్సి ఉందని చెప్పారు. మొత్తం మీద ఏపీలో జనాభా సంరక్షణ విషయంలో ప్రభుత్వం సీరియస్ గానే అడుగులు వేస్తోంది. చూడాలి మరి వీటి ఫలితాలు ఎలా వస్తాయన్నది.