Begin typing your search above and press return to search.

డీఏ-ఐఆర్‌-పీఆర్సీ: చంద్ర‌బాబుకు టెస్టులే!

ఏపీలో ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయులు రోడ్డెక్కుతున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు వేచి చూసిన వీరంతా ఇప్పుడు క‌దం తొక్కుతున్నాయి.

By:  Garuda Media   |   8 Oct 2025 11:36 AM IST
డీఏ-ఐఆర్‌-పీఆర్సీ: చంద్ర‌బాబుకు టెస్టులే!
X

ఏపీలో ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయులు రోడ్డెక్కుతున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు వేచి చూసిన వీరంతా ఇప్పుడు క‌దం తొక్కుతున్నాయి. ముఖ్యంగా భారీ సంఖ్య‌లో ఉన్న ఉపాధ్యాయులు కీల‌క‌మైన డిమాండ్ల‌పై గ‌ళం విప్పారు. వీరికి ఇప్పుడు ఉద్యోగ సంఘాల నాయ‌కులు కూడా తోడ‌య్యారు. దీంతో స‌ర్కారుకు వీరి స‌మ‌స్య‌లు అడ్ర‌స్ చేయ‌క‌త‌ప్ప‌ని స‌రి ప‌రిస్థితి ఏర్ప‌డింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఎలా గడిచిపోయినా.. ఇప్పుడు మాత్రం ఆయా స‌మస్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌క‌త‌ప్ప‌ద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

ఏంటీ డిమాండ్లు?

గ‌త వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలోను, ఇప్పుడు కూడా స‌ర్కారు చేతికి ఎముక లేకుండా సంక్షేమ కార్య‌క్ర మాల‌ను అమ‌లు చేస్తోంది. వేల కోట్ల రూపాయ‌ల‌ను సంక్షేమ ప‌థ‌కాల‌కు వెచ్చిస్తున్నారు. అయితే.. వంద ల కోట్ల రూపాయ‌లతో స‌రిపోయే... త‌మ డిమాండ్ల‌ను ఎందుకు ప‌రిష్క‌రించ‌డం లేద‌న్న‌ది ఉద్యోగులు చెబుతున్న మాట‌. వీరిలో ముఖ్యంగా ఉపాధ్యాయులు గ‌త వైసీపీ స‌ర్కారుపై ఏ విధంగా క‌దం తొక్కారో.. ఇప్పుడు కూడా అదే రేంజ్‌లో ఉద్య‌మిస్తున్నారు. దీంతో స‌ర్కారు ఎంత మౌనంగా ఉన్నా.. తప్పించుకోలే ని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ఏంటా డిమాండ్లు..

క‌రువుభ‌త్యం(డీఏ), మ‌ధ్యంత‌ర భృతి(ఐఆర్‌), పే రివిజ‌న్ క‌మిష‌న్‌(పీఆర్‌సీ).. ఈ మూడు కూడా ప్ర‌ధాన డిమాండ్లుగా ఉన్నాయి. వీటి కోసం.. గ‌త వైసీపీ స‌ర్కారుతోనూ ఉద్యోగులు పోరాటం చేశారు. త‌మ‌కు ఇవ్వా ల్సిన సొమ్ముల విష‌యంలో ఎందుకు తాత్సారం చేస్తున్నార‌న్న‌ది వారి ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఇక‌, డీఏ విష‌యానికి వ‌స్తే.. గ‌త ఏడాది.. ప్ర‌స్తుత ఏడాది క‌లిపి 4 బ‌కాయిలు చొప్పున ప్ర‌భుత్వం ఇవ్వాల్సి ఉంది. దీనికి గాను సుమారు వెయ్యి కోట్ల‌రూపాయ‌ల‌కుపైగానే వెచ్చించాలి.

ఇక‌, ఐఆర్ వ్య‌వ‌హారం కూడా అలానే ఉంది. ఇది.. 800 కోట్లుగా అంచ‌నావేశారు. వెర‌సి సుమారు 2000 కోట్ల రూపాయ‌ల‌ను ప్ర‌భుత్వం ఉద్యోగుల‌కు బ‌కాయి ప‌డింది. ఈ సొమ్ములు ఇవ్వాల‌న్న‌ది ప్ర‌స్తుతం ఉద్యోగులు, ఉపాధ్యాయ వ‌ర్గాలు చేస్తున్న డిమాండ్‌. అంతేకాదు.. ఈ నెల 15 నుంచి విధుల‌కు హాజ‌రు కాబోమ‌ని.. ఉపాధ్యాయులు, విద్యుత్‌, సాగునీటి రంగంలోని అధికారులు, సిబ్బంది తేల్చి చెప్పారు. ఇక‌, స‌చివాల‌య ఉద్యోగులు కూడా దాదాపు ఈ బాట‌లోనే ఉన్నారు. ఈ ప‌రిణామాల‌తో సీఎం చంద్ర‌బాబుకు పెద్ద స‌మ‌స్య వ‌చ్చింద‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.