Begin typing your search above and press return to search.

కూటమి నుంచి వారికీ చాలా మంచి న్యూస్

ఏపీలో ఉన్న దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం శుభవార్తనే వినిపించింది. వారికి ఇక మీదట ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణ సదుపాయం కలిపించడానికి నిర్ణయించింది.

By:  Satya P   |   11 Dec 2025 9:31 AM IST
కూటమి నుంచి వారికీ చాలా మంచి న్యూస్
X

ఏపీలో ఉన్న దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం శుభవార్తనే వినిపించింది. వారికి ఇక మీదట ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణ సదుపాయం కలిపించడానికి నిర్ణయించింది. దీంతో వారికి ఇంకా జీవితంలో వేగవంతమైన ప్రయాణాన్ని అందుకోవడం సాధ్యమవుతుందని కూటమి పాలకులు భావిస్తున్నారు. ఇప్పటికే దివ్యాంగులకు పెన్షన్ విషయంలో మొత్తాన్ని పెంచిన సంగతి తెలిసిందే.

తొందరలోనే గైడ్ లైన్స్ :

ఏపీలో దివ్యాంగుల సంఖ్య చూస్తే సుమారుగా ఏడున్నర లక్షల మంది దాకా ఉన్నా కూడా ప్రతీ రోజూ ఆర్టీసీ బస్సులలో ప్రయాణిస్తూంటారు అని అంచనాగా ఉంది. వీరందరికీ ప్రభుత్వం పధకాలను అమలు చేస్తోంది. ఇపుడు మరింత అండగా నిలించేందుకు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణ సదుపాయం కల్పిస్తోంది. దీనికి సంబంధించి గైడ్ లైన్స్ ని రూపొందించే పనిలో ప్రభుత్వ ఉన్నత అధికారులు ఉన్నారు. ఇక ఆర్టీసీ బస్సులలో వీరికి ఉచిత ప్రయాణంతో పాటు వారు కూర్చుకేందుకు వీలుగ ప్రత్యేకంగా సీట్లను కూడా రిజర్వ్ చేస్తారు అని అంటున్నారు.

ఆర్టీసీకి భారమైనా :

ఇక దివ్యాంగులకు ఉచితంగా బస్సు సదుపాయం కల్పించడం అన్నది ఆర్టీసీకి ఒక విధంగా భారమే అని అంటున్నారు. ఇప్పటికే ఏపీలోని మహిళకు అందరికీ ఉచితంగా బస్సు సదుపాయం కల్పిస్తున్నారు. దాని వల్ల కూడా ప్రభుత్వానికి అదనంగా భారం పడుతోంది. ఇపుడు దివ్యాంగుల విషయం తీసుకుంటే పురుషులు కూడా ఉంటారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే దివ్యాంగులకు యాభై శాతం రాయితీని ఇప్పటిదాక ఇస్తూ వస్తున్నారు. దానిని నూరు శాతం చేయడం అంటే ఖర్చు కూడా పెరుగుతుందని అంటున్నాఉర్.

ఏడాదికి 188 కోట్లు :

యాభై శాతం రాయితీ అంటేనే ఆర్టీసీకి ప్రతీ ఏటా దాదాపుగా 188 కోట్ల రూపాయల దాకా భారం అవుతోంది. ఇపుడు దానిని రెట్టింపు చేయాల్సి ఉంది. ఇక ఇందులో మహిళలకు ఎటూ ఉచిత బస్సు సదుపాయం ఉంది కానీ వారు నలభై శాతం మాత్రమే ఉంటారని అంచనా. అంటే మిగిలిన అరవై శాతం పురుషుల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. దాంతో భారం ఏ మేరకు ఉంటుంది అన్నది అధికారులు లెక్కలు చూసే పనిలో ఉన్నారు.

వీరందరికీ మేలుగా :

ఏపీలో చూస్తే మొత్తం 7.68 లక్షల మంది దాకా వికలాంగులు ప్రభుత్వం అందించే సామాజిక పెన్షన్ ని అందుకుంటున్నారు. వీరిలోనే రెండు లక్షల మంది దాకా ప్రతీ రోజూ ఆర్టీసీ బస్సులలో ప్రయాణిస్తున్నారు ఇపుడు పూర్తిగా ఉచితం బస్సు అంటే ఈ సంఖ్య మరింతగా పెరుగుతుంది అని అధికారులు భావిస్తున్నారు. ఇక దివ్యాంగులకు ఆర్టీసీ లోని ఎక్స్ ప్రెస్, అలాగే ఆల్ట్రా డీలక్స్, పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు వంటి సర్వీసులలో ఉచితంగా ప్రయాణం కల్పిస్తారు అని అంటున్నారు. ఈ మేరకు తొందరలోనే మార్గదర్శకాలు రెడీ చేసి శుభవార్తను దివ్యాంగులకు అందించాలని ప్రభుత్వం ఉంది అని అంటున్నారు. ఉచిత బస్సు పధకం ద్వారా మహిళల అభిమానం చూరగొన్న కూటమి ప్రభుత్వం దివ్యాంగుల విషయంలో తీసుకున్న ఈ నిర్ణయంతో మరింతగా వారి అభిమానం అందుకుంటుందని అంటున్నారు.