Begin typing your search above and press return to search.

రోడ్డు లేదన్న పోస్టుకు పవన్ రియాక్షన్.. తాజాగా మరోసారి!

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తనదైన శైలిలో స్పందిస్తున్న తీరు అందరి మనసుల్ని దోచుకునేలా చేస్తోంది.

By:  Garuda Media   |   8 Feb 2026 9:56 AM IST
రోడ్డు లేదన్న పోస్టుకు పవన్ రియాక్షన్.. తాజాగా మరోసారి!
X

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తనదైన శైలిలో స్పందిస్తున్న తీరు అందరి మనసుల్ని దోచుకునేలా చేస్తోంది. ఏపీ వ్యాప్తంగా ఎవరైనా సరే.. రోడ్డు లేదని.. తమకు రహదారి సదుపాయం కల్పించాలని అడిగినా.. రోడ్డు లేని కారణంగా వారు పడే సమస్యల్ని ఆయన వరకు తీసుకెళితే.. యుద్ధ ప్రాతిపదికన స్పందించటమే కాదు.. రోడ్లు వేయిస్తున్న వైనం అందరిని ఆకట్టుకుంటోంది. అధికారుల చుట్టూ తిరుగుతూ.. రోడ్డు కోసం పాట్లు పడే కన్నా.. రోడ్డు లేని కారణంగా ఎదురవుతున్న సమస్యలు.. ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని పోస్టుగా మార్చి పవన్ కు చేరేలా చేస్తే.. రోడ్డు శాంక్షన్ కావటమే కాదు.. సూపర్ స్పీడ్ తో రోడ్లు వేయిస్తున్న వైనం ఇటీవల కాలంలో ఎక్కువైంది.

తాజాగా అలాంటి ఉదంతమే మరొకటి చోటు చేసుకుంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిధిలోని చల్లగిరిగెలా గ్రామానికి చెందిన విద్యార్థులు తమ ఊరి నుంచి మూడు కి.మీ. దూరంలో ఉన్న గజ్జలవారిపల్లె గ్రామంలోని సర్కారీ స్కూల్ కు వెళ్లేందుకు ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన ఆటోలో వెళుతుంటారు. అయితే.. రోడ్డుసరిగా లేకపోవటం.. వర్షం వస్తే.. మట్టిలో ఆటో కూరుకుపోవటం లాంటి సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. వారు ప్రయాణించే మార్గంలో రోడ్డు లేని కారణంగా తీవ్ర అవస్థలకు గురయ్యే దుస్థితి.

ఈ అంశానికి సంబంధించి పలుమార్లు గ్రామస్తులు సంబంధిత అధికారులకు విన్నవించినప్పటికి ఎలాంటి ప్రయోజనం లేని పరిస్థితి. ఇలాంటి వేళ.. తమకు ఎదురవుతున్న సమస్యతో పాటు.. స్కూల్ కు వెళ్లే విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని హైలెట్ చేస్తూ.. ఒక పోస్టును సోషల్ మీడియాలో పెట్టారు. ఈ పోస్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. సమస్య పరిష్కారానికి వీలుగా రూ.86 లక్షలతో నిర్మించే రోడ్డు ప్రతిపాదనకు ఓకే చెప్పేసి.. రోడ్డు పనులు తక్షణమే మొదలు పెట్టాల్సిందిగా ఆదేశించిన తీరు చూస్తే.. ఏపీలో ఏ మూల అయినా సరే రోడ్డు అవసరమైతే.. డిప్యూటీ సీఎం పవన్ కు పోస్టు చేస్తే సరి అన్నట్లుగా పరిస్థితి ఉందన్న మాట వినిపిస్తోంది.