Begin typing your search above and press return to search.

గుండె కాయ లాంటి రెండు కార్పోరేషన్లు...కూటమి లెక్క తేలాల్సిందే !

ఏపీలో పదిహేడు కార్పొరేషన్లు ఉన్నాయి. అయితే అందులో రెండంటే రెండు అందరికీ ఆకర్షిస్తున్నాయి.

By:  Satya P   |   9 Oct 2026 1:00 AM IST
గుండె కాయ లాంటి రెండు కార్పోరేషన్లు...కూటమి లెక్క తేలాల్సిందే !
X

ఏపీలో పదిహేడు కార్పొరేషన్లు ఉన్నాయి. అయితే అందులో రెండంటే రెండు అందరికీ ఆకర్షిస్తున్నాయి. అందులో ఒకటి ఏపీలోనే పెద్దది అయిన విశాఖపట్నం అయితే రెండవది విజయవాడ కార్పొరేషన్. రాజకీయ రాజధానిగా విజయవాడకు పేరు. పైగా అమరావతి రాజధాని పక్కనే ఉంది. దాంతో విజయవాడ కార్పొరేషన్ తమకు దక్కాలని ప్రతీ రాజకీయ పార్టీకి ఉంటుంది. అలాగే ఉత్తరాంధ్రకు గేట్ వే ఏపీలో ప్రస్తుతం అభివృద్ధికి చిరునామాగా ఉన్న విశాఖ మీద కూడా కచ్చితంగా ఫోకస్ ఉంటుంది. దాంతో ఈ రెండు కార్పోరేషన్ల లెక్క కూటమి పార్టీల్లో తేలాల్సి ఉంది. అదే కనుక జరిగితే మిగిలిన సర్దుబాట్లు ఈజీగానే సెట్ అవుతాయని అంటున్నారు.

విజయవాడ కోసం :

తమకు విశాఖ అయినా విజయవాడ అయినా కార్పొరేషన్ ఇవ్వాలని జనసేన కోరుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. విశాఖ ఎటూ టీడీపీ పోటీకి సిద్ధంగా ఉంది కాబట్టి విజయవాడ తమకు కేటాయించాలని జనసేన పట్టు పడుతోందని భోగట్టా. అలా అయితే కూటమిలో మిత్ర పార్టీలకు సమ న్యాయం దక్కినట్లుగా ఉంటుందని అంటున్నారు. పైగా సామాజిక సమీకరణలు కూడా తమకు అనుకూలిస్తాయని జనసేన విజయవాడ విషయంలో ఆశలు పెట్టుకుందని అంటున్నారు. విజయవాడతో పాటు ఏలూరు, ఒంగోలు, కాకినాడ, మచిలీపట్నం కార్పోరేషన్ల మీద జనసేన చూపు ఉందని చెబుతున్నారు. ఇక ఉత్తరాంధ్రాలో విజయనగరం కోరుతున్నట్లుగా చెబుతున్నారు.

టీడీపీ అస్థిత్వంగా :

అయితే విజయవాడ తీరు వేరు. టీడీపీకి అది అస్తిత్వం గా అభివర్ణిస్తారు. ఏపీలో 2019 ఎన్నికల్లో అంతటా ఎంపీలు ఓటమి పాలు అయితే విజయవాడలో గెలిచారు అంటే టీడీపీకి ఉన్న ట్రెడిషనల్ స్ట్రెంగ్త్ అని చెబుతారు. పైగా సంప్రదాయ ఓటింగ్ కూడా టీడీపీకి ఉంది. సెంటిమెంట్ ప్రాంతంగా అలాగే టీడీపీ పరంగా చూసినా సామాజిక పరమైన అనుకూలతలు అభిమనాలు విజయవాడ చుట్టూ అల్లుకుని ఉన్నాయని అంటున్నారు. అందువల్ల జనసేనకు విజయవాడ కార్పోరేషన్ ని అప్పగిస్తారా అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు. ఒక ఒంగోలు విషయంలో అయితే అక్కడ టీడీపీ నేతలు పట్టు మీద ఉన్నారు. దాంతో కాకినాడ, ఏలూరు, మచిలీపట్నం లకు అభ్యంతరం లేకపోవచ్చు అని అంటున్నారు.

సీటు ముడిగానే :

సీట్ల సర్దుబాటే పీట ముడిగా మారుతాయా అన్న చర్చ కూడా వస్తోంది. జనసేన అయితే ఏపీలో తాము స్థానిక సంస్థల ఎన్నికల రూపేణా బలపడాలని చూస్తున్నాయి. జనసేన లెక్కలు చూస్తే ఉత్తరాంధ్రాలో ఉభయ గోదావరి జిల్లాలలో బలం ఉంది. కోస్తాలో కూడా ధీటుగా నిలవాలి అంటే విజయవాడ కేంద్రంగా సరికొత్త రాజకీయ బలాన్ని సంతరించుకోవాలని చూస్తున్నట్లుగా చెబుతున్నారు. అందుకే విజయవాడ మీద ఫోకస్ పెట్టారని అంటున్నారు. నిజానికి విశాఖ మేయర్ సీటునే తీసుకోవాలని జనసేనకు ఉన్నా అక్కడ మరో మిత్ర పక్షం బీజేపీ కూడా కోరుతొంది. దాంతో టీడీపీ వర్సెస్ బీజేపీగా అక్కడ ఉంది. దాంతో జనసేన విజయవాడని తీసుకోవాలని అన్ని రకాల సమీకరణలను దృష్టిలో ఉంచుకుని భావిస్తోంది అని అంటున్నారు. విజయవాడ కనుక జనసేనకు దక్కితే మాత్రం రాజకీయంగా గుండే కాయ లాంటి ప్రాంతంలో గాజు గ్లాస్ కి పట్టు చిక్కినట్లే అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.