Begin typing your search above and press return to search.

ఏపీ కాంగ్రెస్ కు కొత్త ఇంచార్జి....మారనున్న సమీకరణలు

ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను చూసేందుకు కొత్త ఇన్‌ఛార్జ్‌గా పీవీ మోహన్ ని ఆ పార్టీ అధినాయకత్వం తాజాగా నియమించింది.

By:  Satya P   |   8 Sept 2026 9:01 AM IST
ఏపీ కాంగ్రెస్ కు  కొత్త ఇంచార్జి....మారనున్న సమీకరణలు
X

ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను చూసేందుకు కొత్త ఇన్‌ఛార్జ్‌గా పీవీ మోహన్ ని ఆ పార్టీ అధినాయకత్వం తాజాగా నియమించింది. దాంతో ఏపీ మీద కాంగ్రెస్ అగ్ర నాయకత్వం దృష్టి పెట్టింది అన్న సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. ఏపీలో కాంగ్రెస్ 2014 తరువాత కుదేల్ అయిపోయింది. వరసగా మూడు అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతు అయి చావు దెబ్బ తగిలింది. అదే సమయంలో ఏపీలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కూడా రెండు శాతం లోపునకు పడిపోయింది. మొత్తం ఓటు అంతా వైసీపీకి బదిలీ అయిపోయింది. దాంతో ఏపీలో హస్తం పరిస్థితి రాజకీయంగా చిందర వందర అయింది. కాంగ్రెస్ నుంచి అనేక మంది నేతలు వైసీపీ టీడీపీలలో చేరిపోయారు. అయితే ఇంకా కొంతమంది కరడు కట్టిన నేతలు సీనియర్లు అట్లే పెట్టుకుని అలాగే ఉన్నారు. ఇక 2024 జనవరిలో కాంగ్రెస్ ఏపీ నాయకత్వం బాధ్యతలను వైఎస్సార్ తనయ వైఎస్ షర్మిలకు అప్పగించారు. ఆమె కాంగ్రెస్ ని గెలిపించలేకపోయినా వైసీపీని ఓడించి కొంత సంతృప్తిని కాంగ్రెస్ కి మిగిలించారు. ఇప్పుడు ఆ మిగిలిన కార్యాన్ని పూర్తి చేయడానికే ఈ సంస్థాగతమైన మార్పు అని అంటున్నారు.

కర్ణాటక నుంచే ఫోకస్ :

ఏపీ కాంగ్రెస్ కొత్త ఇంచార్జి కర్ణాటక నుంచి వచ్చారు. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, డీకే శివ కుమార్ సీఎం గా ఉన్నారు. ఆయన ట్రబుల్ షూటర్ అన్నది తెలిసిందే. ఆయన తెలంగాణాలో కాంగ్రెస్ గెలుపునకు కారణంగా నిలిచారు. కేరళంలో కూడా కాంగ్రెస్ విజయం వెనక కొంత కృషి చేశారు అని అంటున్నారు ఇపుడు టఫ్ టాస్క్ గా ఏపీ కాంగ్రెస్ ని ఆయనకే అప్పగించారు అని చెబుతున్నారు. ఇప్పటిదాకా ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్ గా మాణికం ఠాగూర్ ఉండేవారు. ఆయన ప్లేస్ లోకి కర్ణాటకకు చెందిన ఎమ్మెల్సీ పీవీ మోహన్‌ను అధిష్ఠానం నియమించింది. దాంతో ఏపీ కాంగ్రెస్ లో కొత్త రిపేర్లకు ఆస్కారం ఉందని అంటున్నారు.

క్షేత్ర స్థాయి నుంచే :

రానున్న మూడేళ్ళలో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. అలాగే లోక్ సభకు కూడా అదే సమయంలో జరగనున్నాయి. దాంతో కాంగ్రెస్ తన బలం అంతా దక్షిణాది నుంచి కూడగట్టుకోవాలని అనుకుంటోంది. పాతిక ఎంపీ సీట్లు ఉన్న ఏపీ నుంచి ఎంతో కొంత బలం పెంచుకోవడమే కాదు కొత్త మిత్రులను కూడా వెతుక్కునే పనిలో పడుతుందని అంటున్నారు. ఇక క్షేత్ర ష్తాయిలో నీరసించి ఉన్న పార్టీని బలోపేతం చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటారని అంటున్నారు. ముఖ్యంగా దిగువ స్థాయి నుంచి క్యాడర్ లో నూతన ఉత్తేజం తీసుకుని రావడానికి చూస్తారు అని అంటున్నారు.

షర్మిలతో కలసి :

పీసీసీ చీఫ్ గా షర్మిల స్థానం పదిలమే అని అంటున్నారు. ఆమెతో కలిసి కొత్త ఇంచార్జి మోహన్ పార్టీ వ్యూహాలను రూపొందిస్తారు అని అంటున్నారు. ముఖ్యంగా రెండేళ్ల పై దాటిన కూటమి పాలనను ఎండగడుతూ భారీ కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు అని తెలుస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ని తిరిగి తెచ్చుకోవడం మీద కూడా ఫోకస్ పెడతారు అని అంటున్నారు. కాంగ్రెస్ ని వీడిపోయిన చాలా మంది నాయకులను తిరిగి సొంత గూటికి రప్పించే కార్యక్రమం సాగుతుందని అంటున్నారు. అలా వైసీపీలో ఉన్నా లేనట్లుగా కనిపించే సీనియర్ నాయకులను వెనక్కి రప్పిస్తారని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ అన్నది కాంగ్రెస్ కి ముందు ఉన్న సవాల్ గా చెబుతున్నారు. ఈ విషయంలో కొత్త ఇంచార్జి మోహన్ ఏమి చేస్తారు అన్నది అంతా చూస్తున్నారు. ఇక్కడ ఎంతో కొంత ఉనికి చాటుకుంటే రానున్న ఎన్నికలకు అది బాటలు వేస్తుంది అని అంటున్నారు.