Begin typing your search above and press return to search.

ఏపీ మీద 61 తీవ్ర తుఫానుల పంజా

ఏపీ అన్న రాష్ట్రం సముద్రం తీర ప్రాంతాన ఉంది. ఉమ్మడి మద్రాస్ నుంచి విడిపోయినపుడు పదకొండు జిల్లాలతో ఏర్పాటు అయింది.

By:  Satya P   |   16 Nov 2025 6:00 AM IST
ఏపీ మీద 61 తీవ్ర తుఫానుల పంజా
X

ఏపీ అన్న రాష్ట్రం సముద్రం తీర ప్రాంతాన ఉంది. ఉమ్మడి మద్రాస్ నుంచి విడిపోయినపుడు పదకొండు జిల్లాలతో ఏర్పాటు అయింది. ఇక ఉమ్మడి ఏపీలో కూడా విలీనం అయినా లేక 2014 నుంచి విభజన ఏపీగా ఉన్నా ఉమ్మడి తొమ్మిది జిల్లాలు ఎపుడూ తీర ప్రాంతంలోనే ఉంటాయి. ఇది భౌగోళికంగా ఏపీకి ఒక విధంగా వరం అయితే మరో విధంగా శాపంగా చెప్పుకోవాల్సి ఉంది. అయితే ఏపీ ఎపుడూ తుఫానుల ప్రభావంతో నష్టపోతూ వస్తోంది. 1977లో నవంబర్ నెలలో దివిసీమ ఉప్పెన ఏపీలో ఒక చీకటి అధ్యాయం. అంతటి నష్టం ఏపీ ఇప్పటిదాకా ఎన్నడూ చూసి ఉండదు, అయితే ఆ తరువాత కూడా ప్రాణ నష్టం తగ్గినా ఆస్తి నష్టంలో అంతకు మించిన తుఫాన్లు తీవ్రై ఏపీ మీద పడగ విప్పాయి. అలా ఏపీకి తీర ప్రాంతం బ్లూ ఎకానమీకి ఎంతో దోహదపడుతోందో దానితో పాటుగా తీవ్ర నష్టాలు కూడా పొంచి ఉన్నాయని విశ్లేషణలు ఉన్నాయి.

పంజా విసిరిన వైనం :

ఇదిలా ఉంటే గత 55 సంవత్సరాలలో 61 తీవ్రమైన తఫానులు రాష్ట్రంపై ప్రభావం చూపించాయి అని వాతారణ పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఇక ఒక్క అక్టోబర్ మాసంలోనే ఏకంగా 16 తుఫానులు ఏపీ మీద ఎగిసిపడి ఇబ్బందులు సృష్టించాయని చెబుతున్నారు. ఆ సమయంలో వీచే గాలి వేగం వల్ల ఖరీఫ్ సీజన్ పంట అయిన వరికి ఎక్కువగా నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. ఇలా ప్రతీ ఏటా అక్టోబర్ నవంబర్ నెలలలో వచ్చే తుఫాన్ల మూలంగా పంటలు దెబ్బ తినడం కూడా జరుగుతోంది అని అంటున్నారు.

గాలి వేగమే ప్రమాదం :

సాధారణ తుఫానల్లో గాలి వేగం ఒకలా ఉంటే మోంథా లాంటి తీవ్ర తుఫాన్ల సమయంలో వేగం దానికి రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. అయితే గాలివేగం 25 కిలోమీటర్ల కన్నా తక్కువగా ఉంటే పంటపై ఎటువంటి నష్టం ఉండదని అదే సమయంలో గాలి వేగం 54 – 58 కిలోమీటర్ల మధ్య ఉంటే పంట పూర్గీఅ పడిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే విధంగా గత నెల వచ్చిన మొంథా తుఫాను తరువాత వరి పంటపై ఆకు ఎండు తెగులు, మానుకాయ తెగులు ఆశించాయని, ఈ తెగుళ్ళ వల్ల వరి పంటపై కలిగే నష్టం , నివారణ చర్యల గురించి వ్యవసాయ అధికారులను సమాయత్తం చేయవలసిన అవసరం శాస్త్రవేత్తలపై వాతావరణ శాఖ పరిశోధకులు చెబుతున్నారు.

తక్కువ నష్టంతో :

తుఫాన్లు చెప్పి రావు, అదే సమయంలో వచ్చిన తుఫాన్ల నుంచి రక్షించుకోవడం అన్నది అయితే ఉండదు, ప్రాణ నష్టం అయితే ఆధునాతన పద్ధతుల వల్ల తగ్గించుకోవడం ఇటీవల దశాబ్దాల కాలంలో జరుగుతోంది. కానీ పంట నష్టం కానీ ఇతర ఆస్తి నష్టం కానీ తప్పడం లేదు, అయితే వాతావరణ పరిశోధకులు అయితే తగినంత అప్రమత్తత గురించి రైతులకు అవగాహన కల్పిస్తే ఎంతో కొంత మేలు అని చెబుతున్నారు గాలి తీవ్రత తక్కువగా ఉన్న సమయాల్లో అది ఉపకరిస్తుంది అని అంటున్నారు.