Begin typing your search above and press return to search.

పొలిటిక‌ల్ గతాలు.. మంచివేనా.. ?

ఈ క్ర‌మంలో ఉమ్మ‌డి అనంత‌పురంతోపాటు చిత్తూరు, క‌ర్నూలు జిల్లాలు ముందున్నాయ‌న్న‌ది టీడీపీ వ‌ర్గాలే చెబుతున్నాయి.

By:  Garuda Media   |   1 July 2026 5:00 PM IST
పొలిటిక‌ల్ గతాలు.. మంచివేనా.. ?
X

రాష్ట్రంలో కూట‌మి స‌ర్కారు ఏర్ప‌డి రెండు సంవ‌త్స‌రాలు పూర్త‌య్యాయి. ఈ రెండేళ్ల‌లో ప్ర‌భుత్వం అమ‌లు చేసిన సంక్షేమ కార్య‌క్ర‌మాలు, అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు, తీసుకువ‌స్తున్న పెట్టుబ‌డుల‌పై ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని సీఎం చంద్ర‌బాబు చెబుతున్నారు. ముఖ్యంగా టీడీపీ రేటింగ్‌ను పెంచుకునేందుకు ఇవి దోహ‌ద‌ప‌డ‌తాయ‌ని కూడా ఆయన వివ‌రిస్తున్నారు. అయితే.. కొంద‌రు నాయ‌కులు ఈ ప‌నిని వ‌దిలేశారు. దీనికి బ‌దులుగా గ‌తాన్ని త‌వ్వే ప‌నిలో ప‌డ్డారు. వైసీపీ హ‌యాంలో తాము న‌ష్ట‌పోయామ‌ని.. ఇప్పుడు అంత‌కు అంత చెల్లిస్తామ‌ని అంటున్నారు.

ఈ క్ర‌మంలో ఉమ్మ‌డి అనంత‌పురంతోపాటు చిత్తూరు, క‌ర్నూలు జిల్లాలు ముందున్నాయ‌న్న‌ది టీడీపీ వ‌ర్గాలే చెబుతున్నాయి. అనంత‌పురంలో తాడిప‌త్రి, పెనుకొండ, ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాల్లో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు కామ‌న్ గా మారాయి. తాడిప‌త్రిలో అయితే.. వీధి పోరాటాలు జ‌రుగుతూనే ఉన్నాయి. ఇక‌, ధ‌ర్మ‌వ‌రంలో మంత్రి స‌త్య‌కుమార్‌ కు సొంత పార్టీ నేత‌లే.. ఎగ‌స్పార్టీగా మారుతున్నార‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. దీనికి కార‌ణం వైసీపీ నుంచి తెచ్చుకు న్న నాయ‌కుల‌నే వాద‌న ఉంది.

ఇక‌, ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని చంద్ర‌గిరి హాట్ హాట్‌గా మారింది. ఇక్క‌డ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి అంతు చూస్తానంటూ.. సిట్టింగ్ ఎమ్మెల్యే పుల‌వ‌ర్తి నాని బాహాటంగానే చెబుతున్నారు. తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గంలో భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి, ఆయ‌న కుమారుడి వ్య‌వ‌హారంపై జ‌న‌సేన ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని టీడీపీ నేత‌లు వ్యాఖ్య‌లు చేస్తున్నారు. అయితే.. అంత‌ర్గ‌తంగా మాత్రం.. భూమ‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నా.. కేసులు నమోదు చేయ‌డం లేదని అంటున్నారు.

క‌ర్నూలు జిల్లాలోని ప‌త్తికొండ‌, ఆళ్ల‌గ‌డ్డ‌, నంద్యాల, క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పాత సంగ‌తులు త‌వ్వి తీస్తున్నా రు. ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేల మ‌ధ్య ఈ వివాదాలు కొన‌సాగుతున్నాయి. అయితే.. పార్టీ అధికారంలోకి వ‌చ్చి రెండేళ్లు గ‌డిచిన త‌ర్వాత‌.. ఇంకా పాత సంగ‌తులు త‌వ్వి తీస్తూ.. ఆధిపత్య రాజ‌కీయాల కోసం ప్ర‌య‌త్నాలు చేయ డం స్థానికంగా విమ‌ర్శ‌ల‌కు దారితీస్తోంది. ఇక‌, అయింది అయిపోయింది.. అభివృద్ధిపై దృష్టిపెట్టాల‌ని ప్ర‌భుత్వం చెబుతున్నా.. పార్టీ చెబుతున్నా.. కొంద‌రు నాయ‌కులు మాత్రం వినిపించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇదే కొన‌సాగితే అటు వారికి, ఇటు పార్టీకి కూడా ఇబ్బందేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.