ఆ ఇద్దరు: మంత్రివర్గంలో వెనుకబడ్డ అమాత్యులు ..!
కూటమి ప్రభుత్వం మంత్రులకు మరోసారి చంద్రబాబు మార్కులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
By: Garuda Media | 25 Jan 2026 9:30 AM ISTకూటమి ప్రభుత్వం మంత్రులకు మరోసారి చంద్రబాబు మార్కులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం ఏర్పడి 19 మాసాలు పూర్తయిన నేపథ్యంలో ఆయన మంత్రులకు తరచుగా మార్కులు వేస్తు న్నారు. వెనుకబడుతున్న వారిని అలెర్టు చేస్తున్నారు. ప్రజలతో కనెక్షన్ సరిగా లేని వారికి సూచనలు చే స్తున్నారు. ప్రజలతో మమేకమయ్యేలా వారిని ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా ఫైళ్ల క్లియరెన్స్ విధానంపై మరింత అప్రమత్తంగా ఉంటున్నారు.
దీంతో తొలి ఏడాది చాలా మంది మంత్రులు వెనుకబడినప్పటికీ.. తర్వాత కాలంలో పుంజుకున్నారు. రాను రాను వెనుకబడుతున్న వారి సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. అయితే..మరోసారి.. జరిపిన సమీక్ష లో ఇద్దరు మంత్రులు వెనుకబడినట్టు సీఎం చంద్రబాబు చెబుతున్నారు. తాజాగా శుక్రవారం అంతర్గ త సమావేశంలో మంత్రుల పనితీరును ఆయన మరోసారి అంచనా వేశారు. దీనిలో ఇద్దరు మంత్రులు ఒకింత పుంజుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
రెవెన్యూ: రెవెన్యూ శాఖ మంత్రిపై కొన్నాళ్లుగా సీఎం చంద్రబాబుఅసంతృప్తితో ఉంటున్నారు. ముఖ్యంగా రీసర్వే చేపట్టిన తర్వాత.. అనేక సమస్యలు తెరమీదికి వస్తున్నాయి. వాటిని పరిస్కరించేలేక పోతున్నారు . ఇక, క్షేత్రస్థాయిలో అవినీతి ఆరోపణలు కూడా ఈ శాఖపైనే ఉంటున్నాయి. దీంతో చంద్రబాబు మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు కొన్ని సూచనలు చేసినట్టు తెలిసింది. ముఖ్యంగా ప్రజల ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించే వ్యవస్థను తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు.
హొం శాఖ: హోంశాఖ విషయంలోనూ సీఎం చంద్రబాబు అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. రాష్ట్రంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేయడంలోనూ.. వైసీపీ కార్యకర్తల ఆగడాలను అరికట్టడంలోనూ విఫలమవుతున్నారన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఈ శాఖపై అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. అదేసమయంలో పోలీసులను సాధారణ ప్రజలకు మరింత చేరువ చేయాల్సిన అవసరం ఉందని.. ఫిర్యాదుల పరిష్కారంలో వెనుకబడుతున్నారని కూడా అభిప్రాయపడినట్టు తెలిసింది.
