Begin typing your search above and press return to search.

గ్రౌండ్ లోకి దిగిపోతున్న బాబు

ఇక ఏపీలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు చూస్తే 2029 మేలో జరుగుతాయి. అంతవరకూ హ్యాపీగా పై స్థాయిలో పాలన చూసుకోవచ్చు.

By:  Satya P   |   16 Oct 2025 8:15 AM IST
గ్రౌండ్ లోకి దిగిపోతున్న బాబు
X

ఏపీ సీఎం చంద్రబాబు ఓపికకు మెచ్చుకుని తీరాల్సిందే. ఆయన వయసు యాభై లోపు కాదు, ఆయన తొలిసారి సీఎం అంతకంటే కాదు, కానీ ఆయన అలాగే కష్టపడుతున్నారు. తనకు దక్కిన మొదటి చాన్స్ గానే తీసుకుని కష్టపడుతున్నారు. నిజానికి చూస్తే కనుక 2024లో ఏపీ ప్రజలు కూటమికి కనీ వినీ ఎరగని మెజారిటీని కట్టబెట్టారు. మొత్తం సీట్లన్నీ కూటమికే దక్కాయి. ఆ ఒక్క పదకొండు తప్ప. అందులోనూ టీడీపీకి అయితే 135 సీట్లు స్వయంగా లభించాయి.

బాబులో దూకుడు :

వాస్తవంగా చూస్తే ఈ సీట్లను చూసుకుంటే కళ్ళు మూసుకుని అయిదేళ్ళూ ఎవరైనా పాలిస్తారు. ఎందుకంటే చంద్రబాబు అంతకు ముందు అయిదేళ్ళూ ప్రజలలోనే ఉన్నారు. ఆయన తిరగని ఊరు లేదు, వెళ్ళని చోటు లేదు, అంతలా ప్రచారం చేసి మరీ జనంలో చైతన్యం తీసుకుని వచ్చారు. ఎన్నికల ప్రచారమే తీసుకుంటే కనుక మే నెల ఎండలలో యాభై డిగ్రీల సెల్సియస్ తో ప్రకాశం జిల్లాలో మిట్ట మధ్యాహ్నం ఒంటికి చమటతో షర్ట్ అంతా అతుక్కుపోతూ బాబు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా గంటకు పైగా ఎర్రటి ఎండలో ప్రసంగించారు అంటే బాబు సామాన్యుడు కాదు అని ఆనాడే అనుకున్నారు. ఆయన కష్టం ఫలించింది టీడీపీ బంపర్ విక్టరీ కొట్టింది. అయినా సరే బాబులో దూకుడు ఎక్కడా తగ్గకపోవడమే విశేషం.

ఎన్నికలు రేపేనంటూ :

ఇక ఏపీలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు చూస్తే 2029 మేలో జరుగుతాయి. అంతవరకూ హ్యాపీగా పై స్థాయిలో పాలన చూసుకోవచ్చు. కానీ బాబు సీఎం గా నాలుగవసారి ప్రమాణం చేసిన మరుసటి రోజు నుంచే జనాల్లోకి వచ్చేశారు. ఆయన నాటి నుండి నేటి వరకూ ఏ రోజూ రెస్ట్ తీసుకోలేదు, రేపే ఎన్నికలు జరుగుతాయి అన్నట్లుగా బాబు కష్టపడుతున్నారు. ఆ హడావుడిని చూస్తే అదే అంతా అనుకునేలా ఆయన తీరు ఉందని అంటారు. ఇక బాబు ప్రతీ నెలా సామాజిక పెన్షన్లు పంచుతారు, దాని కోసం ఒక్కో జిల్లాకు వెళ్ళి అక్కడ లబ్దిదారులతో భేటీ అవుతున్నారు. అంతే కాదు ఏ పధకం అయినా కార్యక్రమం అయినా జనం మధ్యనే చేస్తున్నారు. జనాలకు ఎంతగానో చేరువ కావాలన్న తపన అయితే ఆయన అడుగడుగునా కనిపిస్తోంది.

క్షేత్ర స్థాయిలోకి :

ఇక తాజాగా చూస్తే బాబు ఒక కీలక ప్రకటన చేశారు. నవంబర్ నెల నుంచి తాను క్షేత్ర స్థాయిలో పర్యటిస్తాను అని. ప్రజల వద్దకే వెళ్ళి పధకాల అమలు గురించి తెలుసుకుంటాను అని ఆయన చెబుతున్నారు. అంటే బాబు నేరుగా గ్రౌండ్ లోకి దిగిపోతున్నారు అన్న మాట. బాబు కనుక అలా నిర్ణయించుకుని జిల్లాలకు వస్తే కనుక మరింత ఎఫెక్టివ్ గా పధకాలు అమలు అవుతాయి. లోటు పాట్లు ఉన్నా అవి తెలిసి సరిదిద్దుకునే చాన్స్ ఉంది.

జనం నాడి కోసం :

ఇక బాబు అంటేనే అనేక రకాలుగా ప్రజల నాడిని పసిగడతారు అని చెబుతారు. ఎప్పటికప్పుడు ఆయన సర్వేలు చేయిస్తారు అని అంటారు. అయితే వీటి అన్నింటికీ మించి ఫస్ట్ రిపోర్టు మాదిరిగా జనాల నుంచే తెలుసుకునే అవకాశం ఈ క్షేస్త్ర స్థాయి పర్యటనల ద్వారా వస్తుంది అని చెప్పాలి. అందుకే బాబు దీనిని ఎంచుకున్నారు. ఇక 2029 ఎన్నికల్లో కూడా ఇదే తీరున అద్భుతమైన విజయం సాధించాలంటే ఏమి చేయాలో ఇప్పటి నుంచే బాబు ప్రిపేర్ అవుతున్నారు. అందుకే ఆయన గ్రౌండ్ లోకి దిగుతున్నారు అని అంటున్నారు విపక్షం అయితే ఇంకా పెద్దగా టచ్ చేయని చోట బాబు దిగితే వారు వన్ సైడ్ అవుతుందా అలా చేయడానికేనా ఈ ప్లాన్ అన్నది కూడా చర్చగా ఉంది మరి.