ఈసారి లండన్...బాబు టార్గెట్ క్లియర్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నవంబర్ 2 నుంచి మూడు రోజుల పర్యటన కోసం లండన్‌కు బయలుదేరుతారు, ఈ సందర్భంగా ఆయన అనేక మంది ప్రముఖ పారిశ్రామిక వేత్తలు అంతర్జాతీయ పెట్టుబడిదారులను కలుస్తారని అంటున్నారు.
By: Satya P | 31 Oct 2025 8:30 AM ISTఏపీ సీఎం చంద్రబాబు మరో విదేశీ యాత్రకు రెడీ అవుతున్నారా అంటే అవును అని అంటున్నారు. చంద్రబాబు నవంబర్ 2 నుంచి లండన్ టూర్ పెట్టుకున్నారు. దాని కోసం ఆయన ఒక కీలక అధికార బృందాన్ని వెంట పెట్టుకుని వెళ్తున్నారు. చంద్రబాబు లండన్ టూర్ ఎందుకు అంటే విశాఖలో ఈ నెల 14, 15 తేదీలలో జరిగే పెట్టుబడుల సదస్సులో పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి అని అంటున్నారు. ఇప్పటే అరబ్ దేశాలలో బాబు పర్యటించి వచ్చారు. మూడు రోజుల పాటు ఆయన అక్కడ కీలక భేటీలు వేసి బడా పారిశ్రామికవేత్తలను కలిసారు. ఏపీకి పెట్టుబడులు పెట్టాలని చాలామందిని స్వయంగా కలిసి ఆహ్వానించారు. ఇపుడు లండన్ టూర్ లక్ష్యం కూడా చాలానే ఉంది అని అంటున్నారు.
కీలక రంగాలలో :
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నవంబర్ 2 నుంచి మూడు రోజుల పర్యటన కోసం లండన్‌కు బయలుదేరుతారు, ఈ సందర్భంగా ఆయన అనేక మంది ప్రముఖ పారిశ్రామిక వేత్తలు అంతర్జాతీయ పెట్టుబడిదారులను కలుస్తారని అంటున్నారు. అధికారిక వర్గాల ప్రకారం చూస్తే కనుక చంద్రబాబు ఏపీలో పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం గురించి వారికి వివరిస్తారు అని అంటున్నారు. అంతే కాకుండా పెట్టుబడులకు తగిన విధంగా పారిశ్రామిక విధానాలు ఏపీలో అమలు చేస్తున్నది వారి దృష్టికి తెస్తారు. ఇక ఏపీలో ఏరోస్పేస్, తయారీ, ఐటీ గ్రీన్ ఎనర్జీ వంటి కీలక రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూల వాతావరణం ఉందని చెబుతారు. ఈ రంగాలలో ఏపీ అభివృద్ధి చెందుతున్న అవకాశాలను బాబు ఈ సందర్భంగా వారికి తెలియ చేస్తారు అని అంటున్నారు.
ప్రతిష్టాత్మకంగా :
ఇదిలా ఉంటే నవంబర్ 14, 15 తేదీలలో విశాఖలో జరిగే సీఐఐ శిఖరాగ్ర సదస్సుని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అని అంటున్నారు. ఈ పారిశ్రామిక సదస్సు ద్వారా ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులను తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం చాలా పట్టుదలగా ఉది. అందుకే బాబు యూరప్ యూకే నుంచి కీలక వ్యాపార దిగ్గజాలను ఈ సదస్సులో పాల్గొనమని వ్యక్తిగత హోదాలో కోరేందుకు లండన్ టూర్ పెట్టుకున్నారు అని అంటున్నారు. మూడు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో బాబు పెద్ద ఎత్తున పెట్టుబడులు ఏపీకి తెస్తారని కూటమి ప్రభుత్వం ఆశాభావంగా ఉంది. ఇవన్నీ పక్కన పెడితే విశాఖ సదస్సు అయితే మరో దావోస్ మాదిరిగా అతి పెద్ద బిజినెస్ ఫ్లాట్ ఫారం గా ఉంటుందని అంటున్నారు. మొత్తం మీద బాబు పడుతున్న కష్టం కానీ ఆయన చేస్తున్న పర్యటనకు కానీ చూస్తే ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తాయన్నది జనంలో కూడా ఒక భావనగా ఉంది.
