Begin typing your search above and press return to search.

మంత్రులకు బాబు ర్యాంకులు...లోకేష్ ప్లేస్ అదే !

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద మాస్టర్ గా ఉంటారన్నది అందరికీ తెలిసిందే. ఆయన పార్టీ అధినేతగా ఉంటూ నాయకుల పనితీరు మీద ఎప్పటికపుడు అధ్యయనం చేస్తారు.

By:  Satya P   |   23 Aug 2025 7:00 PM IST
మంత్రులకు బాబు ర్యాంకులు...లోకేష్ ప్లేస్ అదే !
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద మాస్టర్ గా ఉంటారన్నది అందరికీ తెలిసిందే. ఆయన పార్టీ అధినేతగా ఉంటూ నాయకుల పనితీరు మీద ఎప్పటికపుడు అధ్యయనం చేస్తారు. వారికి మార్కులు వేస్తారు. అలాగే బాబు ముఖ్యమంత్రిగా గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా కూడా తన మంత్రుల పనితీరుని అంచనా వేసి మార్కులు ఇచ్చేవారు ఇపుడు కూడా కూటమి మంత్రులకు ఆయన ర్యాంకులు ఇస్తూ వస్తున్నారు. లేటెస్ట్ గా బాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. అవి ఆస్కతికరంగా ఉన్నాయి.

లోకేష్ నంబర్ టూ :

మంత్రులు తమ ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో ఏ విధంగా వేగం చూపుతున్నారు అన్న దాని మీద బాబు ఈ ర్యాంకులు ఇచ్చారు అలా చూస్తే కనుక నిమ్మల రామానాయుడు మొదటి ప్లేస్ లోఉన్నారు. నారా లోకేష్ రెండవ ర్యాంక్ తో టాప్ లోనే ఉన్నారు మూడో ర్యాంక్ విషయానికి వస్తే వైద్య మంత్రి సత్యకుమార్, నాలుగవ ర్యాంక్ లో హోం మంత్రి అనిత ఉన్నారు. అయిదవ స్థానంలో పౌర సరఫరాలు శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నారు.

చివరి వరసలో వారే :

ఇక ఈ ర్యాంకులలో చివరి వరుసలో చూస్తే వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, అలాగే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు.వీరు తమ ఫైళ్ళను వేగంగా క్లియర్ చేయడం లేదు అని అంటున్నారు. ఇక మిగిలిన మంత్రులు అంతా మధ్యలో ఉన్నారు. మొత్తానికి టాప్ ఫైవ్ ర్యాంకర్ల పనితీరు బాగానే ఉన్నా మిగిలిన వారి విషయంలో బాబు దిశా నిర్దేశం చేస్తూనే ఉన్నారు పాలనలో వేగం పెరగాలి అంటే ఫైళ్ల క్లియరెన్స్ లో చురుకుగా ఉండాలని కోరుతున్నారు

పవన్ కి మినహాయింపు :

ఇదిలా ఉంటే గతసారి ఫైళ్ల క్లియరెన్స్ లో పవన్ కి పదవ స్థానం దక్కింది. దాని మీద విమర్శలు వచ్చాయి. పవన్ కంటే ముందు లోకేష్ మంచి ర్యాంకులో ఉన్నారు. దీంతో జనసైనికుల నుంచి అసంతృప్తి వ్యక్తం అయింది. దాంతో ఈసారి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కి ఈ ర్యాంకుల విషయంలో మినహాయింపు ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. ఇక గతంలో చంద్రబాబు తనకు కూడా ర్యాంక్ ఇచ్చుకున్నారు. ఈసారి తనతో పాటు పవన్ ని సైతం పక్కన పెట్టి మిగిలిన 23 మంది మంత్రులకే ర్యాంకులు ఇచ్చారని అంటున్నారు.

అసలైన ర్యాంకులు అపుడేనట :

ఇక ఈ ర్యాంకులు కేవలం ఫైళ్ల క్లియరెన్స్ కే అని చెబుతున్నారు. గత పదిహేను నెలలుగా మంత్రుల పనితీరు ఎలా ఉంది వారి నిర్ణయాలు వారు పర్యటనలు వారు ప్రజలతో మమేకం అవుతున్న తీరు వారి శాఖలలో అభివృద్ధి కొత్త కార్యక్రమాలు యాక్షన్ ప్లాన్స్ ఇత్యాది అంశాలు అన్నీ క్రోడీకరించి సెప్టెంబర్ లో జరిగే మంత్రి వర్గ సమావేశంలో మొత్తం మంత్రులు అందరి పనితీరు మీద సమగ్రమైన తీరులో నివేదిక ఉంటుందని అంటున్నారు. దాని ఆధారంగా ర్యాంకులను కూడా ముఖ్యమంత్రి ప్రకటిస్తారని చెబుతున్నారు. మరి టోటల్ పనితీరులో ఎవరికి టాప్ ర్యాంకులు ఎవరికి లస్ట్ ర్యాంకులు వస్తాయన్నది మాత్రం ఆసక్తిగానే ఉంది. చూడాలి ఏ విధంగా రిజల్ట్ ఉంటుందో.