Begin typing your search above and press return to search.

కేంద్ర మంత్రులకు క‌ష్టాలు: ప‌ర్స‌నల్ ఇమేజే సేఫ్‌.. ?

రాష్ట్రంలో కేంద్ర మంత్రులుగా ఉన్న ముగ్గురు.. ఏం చేస్తున్నారు? కేంద్రం నుంచి ఎంత మేర‌కు నిధులు తీసుకువ‌చ్చారు? అనే విష‌యాల‌ను ప‌రిశీలిస్తే.. కొంత ఇబ్బందిక‌ర ప‌రిస్థితే క‌నిపిస్తోంది.

By:  Garuda Media   |   28 Aug 2025 1:00 PM IST
కేంద్ర మంత్రులకు క‌ష్టాలు: ప‌ర్స‌నల్ ఇమేజే సేఫ్‌.. ?
X

రాష్ట్రంలో కేంద్ర మంత్రులుగా ఉన్న ముగ్గురు.. ఏం చేస్తున్నారు? కేంద్రం నుంచి ఎంత మేర‌కు నిధులు తీసుకువ‌చ్చారు? అనే విష‌యాల‌ను ప‌రిశీలిస్తే.. కొంత ఇబ్బందిక‌ర ప‌రిస్థితే క‌నిపిస్తోంది. త‌మ్ముడు తనో డే అయినా.. నిజం చెప్పాలంటే.. కేంద్ర మంత్రులుగా ప్ర‌త్యేకంగా సాధించింది ఏమీ క‌నిపించ‌డం లేదు. కూట‌మి స‌ర్కారులో చంద్ర‌బాబు నేరుగా నిధులు తెచ్చుకుంటున్నారు. దీనికి మించి.. కేంద్ర మంత్రులు గా ఇది తెచ్చాం.. అనే మాట చెప్పే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. అయితే.. వ్య‌క్తిగ‌తంగా వారి ఇమేజే వారిని కాపాడుతోంది.

బీజేపీకి సంబంధించిన భూప‌తిరాజు శ్రీనివాస‌వ‌ర్మ‌ను ప‌క్క‌న పెడితే.. ఉత్త‌రాంధ్ర‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ట్టుగా ప్ర‌చారంలో ఉన్న శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహ‌న్‌నాయుడు వ్య‌క్తిగ‌తంగా త‌న ఇమేజ్‌ను కాపాడుకుంటున్నారు. కానీ, కీల‌క‌మైన విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ వ్య‌వ‌హారంపై ఆయ‌న ఇబ్బందులు వ‌స్తున్నాయి. దీనిని ప్రైవేటు ప‌రం కాకుండా చూడాల‌న్న డిమాండ్లు ఇప్ప‌టికీ ఉన్న విష‌యం తెలిసిందే. అంతేకాదు. కేంద్రంలో మంత్రిగా ఉన్న ఉత్త‌రాంధ్ర నేత దీనిని కాపాడాల‌న్న డిమాండ్లు తెర‌మీదికి వ‌స్తు న్నాయి.

కానీ, దీనికి రామ్మోహ‌న్ నాయుడు ఏమీ చేయ‌లేని ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు. భోగాపురం విమానాశ్ర య నిర్మాణానికి మాత్రం ఆయ‌న ప్రాధాన్యం ఇస్తూ.. కొంత మేర‌కు ఇమేజ్ త‌గ్గ‌కుండా చూసుకుంటున్నా రు. ఇక‌, గుంటూరు ఎంపీ పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ కూడా ఇదే విధంగా కొంత ఇబ్బంది ఫీల‌వుతున్నారు. గుంటూరు మిర్చి యార్డుకు సంబంధించి, ప‌త్తి రైతుల‌కు సంబంధించి కూడా ఆయ‌న కేంద్రం నుంచి అనుకున్న‌ది సాధించ‌లేక పోయార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. అయితే.. ఆయ‌న కూడా వ్య‌క్తిగ‌తంగా ఇమేజ్ ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు.

గుంటూరు ప‌రిధిలో త‌ర‌చుగా ప‌ర్య‌టిస్తూ.. కూట‌మి నాయ‌కుల‌తో భేటీలు నిర్వ‌హిస్తున్నారు. ఇదే స‌మ‌యం లో కేంద్ర‌ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను కూడా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తున్నారు. ఇంత‌వ‌ర‌కు బాగా నే ఉన్న‌ప్ప‌టికీ.. కేంద్ర మంత్రులుగా వారు మ‌రింత దూకుడుగా వ్య‌వ‌హ‌రించాల‌న్న‌దిస్థానికంగా వినిపిస్తున్న మాట‌. కానీ, ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు సాగుతున్నా.. అనుకున్న విధంగా కేంద్రంలోనే స‌హ‌కారం ల‌భించ‌డం లేద‌న్న‌ది రాజ‌కీయ వ‌ర్గాల మాట‌. ఎలా చూసుకున్నా.. వ్య‌క్తిగ‌త ఇమేజే రాజ‌కీయాల్లో కీల‌కం కాబ‌ట్టి.. కేంద్ర మంత్రుల‌కు అదే క‌లిసి వ‌స్తోంది.