ఢిల్లీలో ఏపీ భవన్ నిర్మాణం.. క్యాబినెట్ కీలక నిర్ణయం
ఇక, మునిసిపాలిటీలకు.. కీలకమైన ఆర్థిక వెసులుబాటు కల్పించే విషయంపైనా సీఎం చంద్రబాబు చర్చించారు.
By: Garuda Media | 1 May 2026 7:00 AM ISTదేశరాజధాని ఢిల్లీలో మరో ఏపీ భవన్ నిర్మాణానికి రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. దీనికి 125 కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న ఏపీభవన్ సరిపోవడం లేదని.. ఈ నేప థ్యంలో కొత్త ఏపీ భవన్‌ను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. సీఎం చంద్రబాబు మంత్రుల కు తెలిపారు. ఆయన అధ్యక్షతన జరిగిన తాజా మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకు న్నారు. దాదాపు 4 గంటల పాటు 20కి పైగా అంశాలపై చంద్రబాబు చర్చించారు.
అలానే.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపైనా మంత్రి వర్గం దృష్టి పెట్టింది. వాటి పరిష్కారానికి మం త్రులతో కమిటీ వేయాలని నిర్ణయించింది. ఆర్థిక పరమైన అంశాలపై కొంత గడువు తీసుకుని.. న్యాయం చేస్తామని నిర్ణయించారు. ఇప్పటికిప్పుడు పరిష్కారం అయ్యే ఆర్థికేతర సమస్యలపై చంద్రబాబు దృస్టి పెట్టారు. వాటిని తక్షణమే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. ముఖ్యంగా ఉద్యోగ సంఘాల నాయకులతో తరచుగా సమావేశం కావాలని.. తద్వారా వారికి ఉపశమనం లభిస్తుందన్నారు.
ఇక, మునిసిపాలిటీలకు.. కీలకమైన ఆర్థిక వెసులుబాటు కల్పించే విషయంపైనా సీఎం చంద్రబాబు చర్చించారు. ఆస్తుల లీజ్ రెన్యువల్, అద్దె నిర్ణయ విధానాల విషయంలో ఆయా మునిసిపాలిటీలకు స్వేచ్ఛను ఇవ్వాలని నిర్ణయించారు. తద్వారా మునిసిపాలిటీలు ఆర్థికంగా పుంజుకుంటాయని తెలిపారు. కార్పొరేషన్లలో మ్యుటేషన్ ఫీజులను ఒకే విధంగా అమలు చేసే చట్టసవరణ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కీలకమైన ఓడరేవు.. రామాయ పట్నంలో నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ పోర్టు పనులకు 354 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు మంత్రి వర్గం అనుమతి ఇచ్చింది.
అమరావతికి..
ముఖ్యంగా రాజధాని అమరావతిలో నిర్మించనున్న క్వాంటం వ్యాలీ జంట టవర్లకు.. 1200 కోట్ల రూపాయ లకు పైబడినిధులు ఖర్చు చేసే ప్రతిపాదనకు కూడా చంద్రబాబు నేతృత్వంలోని మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. న్యాయ శాఖలో ఉద్యోగాల కల్పన, భర్తీకి కూడా రాష్ట్ర మంత్రి వర్గం పచ్చజెండా ఊపింది.
