Begin typing your search above and press return to search.

బాబు మంత్రులకు కొత్త అనుభవం

చంద్రబాబు విషయం తీసుకుంటే ఆయన పనిమంతుడు. ఆయన తానుగా ఎంత పనిచేస్తారో అంతకు అంత తన మంత్రుల నుంచి ఆశిస్తారు.

By:  Satya P   |   11 Nov 2025 9:33 AM IST
బాబు  మంత్రులకు కొత్త అనుభవం
X

ఏపీలో గత ఏడాదిన్నర కాలంలో అనేక సార్లు మంత్రి వర్గ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే మంత్రి వర్గ భేటీలో మంత్రులకు బాబు క్లాస్ తీసుకున్నారనో లేక వారి మీద సీరియస్ అయ్యారనో లేక దిశా నిర్దేశం చేశారనో వార్తలు వస్తూ ఉండేవి. మంత్రులు మరింత చురుగ్గా పనిచేయాలని బాధ్యతగా మెలగాలని బాబు కోరినట్లుగా కూడా ప్రచారం జరిగేది. కానీ తాజా కేబినెట్ మీట్ మాత్రం మంత్రులకు కొత్త అనుభవం ఇచ్చింది అని అంటున్నారు.

భేష్ అన్న బాబు :

చంద్రబాబు విషయం తీసుకుంటే ఆయన పనిమంతుడు. ఆయన తానుగా ఎంత పనిచేస్తారో అంతకు అంత తన మంత్రుల నుంచి ఆశిస్తారు. అయితే గతంలో బాబు పలు మార్లు చెప్పడం వల్ల మంత్రులు అంతా జాగ్రత్త పడ్డారు. చాలా మంది ఫీల్డ్ లోకి దిగి మునుపటి కంటే సామర్థ్యాన్ని పెంచుకున్నారు. అంతే కాకుండా అనేక మంది తమ పనితీరుని మెరుగుపరచుకున్నారు. అదే ఈసారి బాబు నుంచి మెప్పు పొందడానికి ఉపకరించింది అని అంటున్నారు. మంత్రులు అందరినీ శభాష్ అని చంద్రబాబు మెచ్చుకోవడంతో అంతా ఫుల్ జోష్ లో ఉన్నారని అంటున్నారు.

మొంథా తుఫాన్ సమయంలో :

ఏపీని గత నేల చివరి వారం మొంథా తుఫాన్ పెద్ద ఎత్తున కమ్మేసింది. అంతే కాదు మరో హుదూద్ అని కూడా ప్రచారం సాగింది. ఎంత పెద్ద ప్రమాదమో ఎంత కష్టం నష్టమో అని అంతా తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేసిన నేపధ్యంలో ఉంది. అయితే చంద్రబాబు మంత్రులు అంతా తుఫాన్ విషయంలో ప్రజలకు తగిన జాగ్రత్తలు చెప్పి అప్రమత్తం చేయడమే కాకుండా తుఫాన్ అనంతరం కూడా ఫీల్డ్ లోకి దిగి పూర్తి కాలం పనిచేశారు. నిలువెత్తు లోతు నీళ్ళలోకి పంట పొలాల్లోకి పాడైన రోడ్ల వద్దకు కూడా చేరుకుని మరీ అక్కడే సమీక్షలు చేశారు. ప్రజలని కాపాడడమే కాకుండా రిలీఫ్ విషయంలో కూడా బాగానే చర్యలు తీసుకున్నారు. ఎక్కడా ఎలాంటి విమర్శలు రకౌండా సహాయ చర్యలు అందాయి. అంతా ఒక పద్ధతి ప్రకారం జరగడంతో మొంథా తుఫాన్ ప్రభావం బాగా తగ్గింది. అంతే కాకుండా ప్రజలకు కూడా కష్టం నష్టం బాగా తగ్గించారు అన్న పేరు వచ్చింది.

బాబు హ్యాపీయేనా :

తన కేబినెట్ సహచరుల నుంచి చంద్రబాబు ఇదే కోరుకుంటున్నారు అని అంటున్నారు. పై నుంచి దిగువ దాకా అంతా ఒక విధానంతో పనిచేయాలని ఆయన పదే పదే చెబుతున్నారు. ఆ టీం స్పిరిట్ అయితే ఇపుడు బాగా కనిపించింది అని అంటున్నారు ఒక పెద్ద ప్రకృతి విపత్తి సంభవించినపుడు కేబినెట్ అంతా ఏకమొత్తంగా రియాక్ట్ కావడం ఏ చిన్న ఇబ్బంది లేకుండా చూసుకోవడంతో బాబు సైతం ఫుల్ హ్యాపీ అని అంటున్నారు. అందుకే బాబు మెచ్చుకున్నారని చెబుతున్నారు. దీంతో మంత్రులు ఇదే స్పీడ్ తో ముందుకు సాగితే కూటమి సర్కార్ అభివృద్ధి విషయంలో కూడా పరుగులు పెడుతుందని అంటున్నారు.