Begin typing your search above and press return to search.

మాధవా...మన సంగతేంటి ?

ఇక బీజేపీలో చూస్తే అంతా ఒకటిగా కనిపిస్తున్నా వర్గ పోరు ఉందని అంటున్నారు. విశాఖ జిల్లా పార్టీలోనే అది కనిపిస్తోంది అని అంటున్నారు.

By:  Satya P   |   26 Jan 2026 1:00 PM IST
మాధవా...మన సంగతేంటి ?
X

బీజేపీకి ఏపీ అధ్యక్షులు ఏంటో అంత దూకుడుగా కనిపించకపోవడం రివాజుగా మారుతోంది అని అంటున్నారు పొత్తులతో అధికారంలో ఉంటే రిలాక్స్ మోడ్ లో ఉంటారు, విపక్షంలో ఒంటరిగా పోరాటం చేయాలనుకుంటే అపుడు ఫోకస్ అయ్యేది ఉండదు, ఈ విధంగా ఏపీ కమలం అయితే అయోమయంలోనే సాగుతోంది అని అంటున్నారు. ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా విశాఖ జిల్లాకు చెందిన బీసీ నేత పీవీఎన్ మాధవ్ కి పగ్గాలు అప్పగించారు. కానీ పార్టీ బండి మాత్రం సరైన ట్రాక్ లో నడవడం లేదని పార్టీలోనే అసంతృప్తులు ఉన్నాయని అంటున్నారు.

మొక్కుబడిగానే :

మొక్కుబడి కార్యక్రమాలతో లాగించేస్తున్నారు అన్న విమర్శలు వస్తున్నాయి. ఈ మధ్యన అటల్ బిహారీ వాజ్ పేయ్ విగ్రహాల ఆవిష్కరణ జరిగింది. అది బాగానే ఉంది అనుకున్నా పార్టీకి క్యాడర్ కి జోష్ ని తెచ్చే కార్యక్రమాలు కానీ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే విధంగా యాక్టివిటీస్ కానీ లేవని చర్చ సాగుతోంది. పార్టీ సమావేశాలు ఏర్పాటు చేయడం క్యాడర్ కి బాధ్యతలు పెంచడం, నిరంతరం జనంలో ఉండేలా ప్రోగ్రామ్స్ ని తీసుకోవడం చేయాల్సి ఉందని అంటున్నారు. కానీ అధ్యక్షుడు అయితే పెద్దగా వీటి మీద దృష్టి పెట్టడం లేదని అంటున్నారు.

వర్గ పోరు ఉందా :

ఇక బీజేపీలో చూస్తే అంతా ఒకటిగా కనిపిస్తున్నా వర్గ పోరు ఉందని అంటున్నారు. విశాఖ జిల్లా పార్టీలోనే అది కనిపిస్తోంది అని అంటున్నారు. అధ్యక్షుడు ఉన్నా మాజీ ఎంపీ అక్కడే ఉన్నా సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నా అంతా కలసి కార్యక్రమాలు నిర్వహించడం కనిపించడం లేదని అంటున్నారు. అదే విధంగా కార్యవర్గాన్ని నియమించారు కానీ వారు కూడా ఏమంత చురుకుగా లేరని చెబుతున్నారు. పార్టీలో ఎవరికి వారుగా ఉందని అంటున్నారు.

అజెండా ఏంటో అన్నది :

ఇక బీజేపీ కూటమితో ఉందని అధికారంలో ఉందని సర్దుకోవడమేనా లేక పార్టీ ఫిలాసఫీని జనంలో పెట్టి తమ అజెండాను గట్టిగా చాటుకునే ప్రయత్నాలు ఉన్నాయా అన్న చర్చ కూడా సాగుతోంది. అధికారంలో ఉన్నప్పుడే పార్టీని ప్రజలలోకి బలంగా తీసుకుపోగలమని అంటున్నారు. అలా కాకుండా అధికార పార్టీలో తామూ ఒకటిగా ఉంటూ అంతా బాగుంది అనుకుంటేనే ఇబ్బందులు వస్తాయని అంటున్నారు.

టీడీపీకి అనుబంధంగా :

ఈ విమర్శ కూడా పార్టీలో నుంచే వస్తోంది. ఎంతసేపూ టీడీపీకి అనుబంధంగా ఉండడానికే ప్రాధాన్యత ఇస్తూ పోతే పార్టీ గురించి జనాలకు తెలిసేది ఎలా అన్నది కూడా మధనంగా ఉంది. ఈ విషయంలో మాధవ్ అయితే చురుకుగా వ్యవహరించకలేకపోతున్నారు అని అంటున్నారు. ప్రజల పక్షాన నిలిచి నిర్మాణాత్మకంగా ఉంటేనే పార్టీ పట్ల జనంలో ఫోకస్ పెరుగుతుందని అంటున్నారు.

బీసీ ముద్ర ఏదీ :

బీసీ ముద్ర కోసమే మాధవ్ కి పార్టీ ఏరి కోరి బాధ్యతలు అప్పగించిందని గుర్తు చేస్తున్నారు. అయితే పార్టీకి ఆ బీసీ కలర్ కానీ బలమైన ఆకర్షణ కానీ తీసుకుని రావడంతో మాధవ్ విఫలం అవుతున్నారు అన్నది కూడా చర్చగా ఉందిట. బీసీల కోసం బీజేపీ అన్నది జనంలోకి తీసుకుని వెళ్తే ఆ వర్గంలో ఎంతో కొంత కాషాయం వైపు టర్న్ అయితే 2029 ఎన్నికల వేళకు ఇంతకంటే ఎక్కువగా సీట్లు తీసుకోవచ్చునని పార్టీ విస్తరణ కూడా జరుగుతుందని అంటున్నారు. ఇక నామినేటెడ్ పదవుల విషయంలో కూడా అర్హులైన వారికి అన్యాయం జరుగుతోందని దాని మీద కూడా గట్టిగా మాట్లాడాల్సి ఉన్నా మౌనంగా ఉండడంతో క్యాడర్ లో ద్వితీయ శ్రేణి నాయకులలో అసంతృప్తి ఉందని చెబుతున్నారు. మొత్తానికి మాధవ్ పార్టీ నాయకత్వానికి ఏడాది కాలం దగ్గరలో పూర్తి అవుతున్న వేళ ఆయన జోరు పెంచాలని అంతా కోరుకుంటున్నారు.