Begin typing your search above and press return to search.

కూటమి సంచలనం : బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు

ఏపీలోని కూటమి ప్రభుత్వం వెనుకబడిన వర్గాల కోసం సంచలన నిర్ణయం తీసుకుంది. బీసీలకు రాజకీయంగా మేలు చేయాలని ప్రభుత్వం ఒక నిబద్ధతతో అడుగులు వేస్తోంది.

By:  Satya P   |   20 Feb 2026 4:00 AM IST
కూటమి సంచలనం : బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు
X

ఏపీలోని కూటమి ప్రభుత్వం వెనుకబడిన వర్గాల కోసం సంచలన నిర్ణయం తీసుకుంది. బీసీలకు రాజకీయంగా మేలు చేయాలని ప్రభుత్వం ఒక నిబద్ధతతో అడుగులు వేస్తోంది. వారి పట్ల తమ అంకితభావాన్ని చాటుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో స్థానిక సంస్థల ద్వారా ప్రజా ప్రతినిధులుగా ఎన్నిక అయ్యేవారి లో బీసీల కోసం ఏకంగా 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో చర్యలు తీసుకుంటోంది.

ఏక సభ్య కమిషన్ నియామకం :

బీసీలకు స్థానిక సంస్థలలో 34 శాతం రిజర్వేషన్ల కోసం మాజీ ఐఎఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏక సభ్య డెడికేటెడ్ కమిషన్ ని ప్రభుత్వం నియమించింది. ఈ కమిషన్ పూర్తిగా అధ్యయనం చేసి తన నివేదికను ప్రభుత్వానికి ఇస్తుంది. 45 రోజూల్లో నివేదికను ఇవ్వాలని కాల పరిమితిని కూడా విధించారు. ఆ మీదట నివేదికను అనుసరించి ప్రభుత్వం అమలు చేసేందుకు చర్యలకు దిగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ శాఖ మంత్రి ఎస్.సవిత ఈ సందర్భంగా చెబుతున్నారు.

వైసీపీ హయాంలో అలా :

ఇదిలా ఉంటే గత వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 24 శాతానికే పరిమితం చేశారు అని మంత్రి విమర్శించారు. దీనివల్ల బీసీలు ఎన్నో పదవులు కోల్పోయారని అన్నారు అయితే కూటమి ప్రభుత్వం మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఎన్నికలలో బీసీలకు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి కృత నిశ్చయంతో ఉందని ఆమె స్పష్టం చేశారు. దీనిలో భాగంగానే మాజీ ఐఎఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏక సభ్య డెడికేటెడ్ కమిషన్ నియమించినట్లుగా చెప్పారు.

బీసీ పక్షపాతిగా :

ఇదిలా ఉంటే చంద్రబాబుని బీసీ పక్షపాతిగా టీడీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ బీసీల గొంతు కోసేల 24 శాతమే వారికి అమలు చేస్తే టీడీపీ మాత్రం మరో పది శాతం తో ముందుకు వస్తోంది అని గుర్తు చేస్తున్నారు సమాజంలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు రాజ్యాధికారాన్ని చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అందించేలా సాగుతోందని చెబుతున్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లు అందజేస్తామని అప్పట్లోనే బాబు హామీ ఇచ్చారన్నారు. ఆ మేరకే రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏక సభ్య డెడికేటెడ్ కమిషన్ ను నియమించారని చెబుతున్నారు.

కూటమికే అడ్వాంటేజ్ :

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించిన తరువాత స్థానిక ఎన్నికలకు వెళ్ళాలని టీడీపీ కూటమి ప్రభుత్వం భావిస్తోంది. బీసీలకు మేలు చేసి ఎన్నికలకు వెళ్తే అది భారీ అడ్వాంటేజ్ గా ఉంటుందని కూడా ఆలోచిస్తోంది. నిజానికి స్థానిక ఎన్నికల్లో ఎటూ అధికార పార్టీకే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇపుడు బీసీలకు రిజర్వేషన్లు పెంపు ట్రంప్ కార్డుగా మారనుంది అని అంటున్నారు. దీని మీద వైసీపీ ఏ విధంగా వ్యూహరచన చేస్తుందో చూడాల్సి ఉంది.