టీడీపీ వర్సెస్ వైసీపీ... బీసీల పేరుతో బిగ్ సౌండ్ !
ఏపీలో బీసీల చుట్టూ రాజకీయం సాగుతోంది. మొత్తం జనాభాలో సగానికి పైగా బీసీలు ఉన్నారు.
By: Satya P | 9 Oct 2026 5:07 AM ISTఏపీలో బీసీల చుట్టూ రాజకీయం సాగుతోంది. మొత్తం జనాభాలో సగానికి పైగా బీసీలు ఉన్నారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అని టీడీపీ అధికారికంగా ప్రకటించడమే కాదు ఉత్త్వరులను కూడా విడుదల చేసింది. అయితే న్యాయ స్థానంలో మాత్రం కొంత ఇబ్బంది ఎదురవుతోంది. అయితే కోర్టు తీర్పులు ఎలా ఉన్నా బీసీలకు ఎక్కువ సీట్లనే పార్టీ పరంగా ఇవ్వడానికి టీడీపీ సిద్ధంగా ఉంది. వైసీపీ కూడా పార్టీ పరంగా తాము ఎక్కువ సీట్లే ఇస్తామని చెబుతోంది.
మద్దతు కోసమే :
ఈ విధంగా బీసీల మద్దతు కోసం రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి. అంతే కాదు బీసీలకు తాము ఎక్కువ మేలు చేశామని చెప్పుకుంటూ క్రెడిట్ వార్ కి తెర తీశాయి. బీసీలను ఆకట్టుకోవడానికి పార్టీ పరంగా సభలు నిర్వహిస్తున్నాయి. టీడీపీ గత నెలలో అయితే నర్శీపట్నం వేదికగా బీసీ జయభేరీ పేరుతో ఒక భరీ సభను నిర్వహించింది. రాజ్యసభ ఎంపీ అయిన చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహించి బీసీలంతా మా వైపే అని సంకేతాలు ఇచ్చారు. ఇపుడు వైసీపీ వంతు వచ్చింది అని అంటున్నారు. తాజాగా ఆ పార్టీకి చెందిన బీసీ నేతలు అంతా విశాఖలో కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఉత్తరాంధ్రా స్థాయిలో పెద్ద ఎత్తున బీసీల సభ నిర్వహించాలని నిర్ణయించారు. దానికి బీసీ గర్జన పేరుని కూడా ఖరారు చెశారు.
సెంటిమెంట్ సైతం :
బీసీ గర్జనలను 2019 ఎన్నికలకు ముందు వైసీపీ ఏపీవ్యాప్తంగా నిర్వహించింది దాంతో మంచి స్పందన రావడమే కాదు ఆ ఎన్నికల్లో బీసీలు వెన్నంటి నిలిచారు. దాంతో ఉత్తరాంధ్రా జిల్లాలో నూటికి ఎనభై శాతం పైగా సీటు షేర్ ని వైసీపీ దక్కించుకుంది. ఈసారి కూడా అదే సెంటిమెంట్ ని పార్టీ నమ్ముకుంది అని అంటున్నారు. బీసీ గర్జనని విశాఖ వేదికగా నిర్వహించేందుకు వైసీపీ సన్నాహాలు చేస్తోంది. ఉత్తరాంధ్రాలోని మూడు ఉమ్మడి జిల్లాలలో బీసీలు నూటికి ఎనభై శాతానికి పైగా ఉన్నారు. దాంతో బీసీలను ఆకట్టుకోవడానికి వైసీపీ చూస్తోంది అని అంటున్నారు. ఈ సభ ద్వారా వైసీపీ హయాంలో తాము ఏమి చేశామన్నది చెప్పడమే కాదు రెండేళ్ల కూటమి పాలనలో పెద్దగా చేసింది ఏమీ లేదని వైసీపీ నేతలు చెప్పదలచుకున్నారు అని అంటున్నరు.
బీసీలు ఎటు వైపు :
ఏపీలో బీసీ ఓట్లు ఏ పార్టీకి గుత్త మొత్తంగా ఎపుడూ పడిన దాఖలాలు లేవు, కాంగ్రెస్ టీడీపీ మధ్య రాజకీయ పోరాటం సాగినపుడు కూడా రెండు పార్టీల వైపుగానే చీలిపోతూ వచ్చారు. అయితే ఏపీ రాజకీయ చరిత్ర తీసుకుంటే బీసీలు అత్యధిక సార్లు ఎక్కువ శాతం టీడీపీ వైపే నిలబడ్డారు. బీసీల పార్టీగా అందుకే ఆ పార్టీ క్లెయిం చేసుకుంటూ ఉంటుంది. టీడీపీలో అనేక పదవులలో ప్రముఖ బీసీ నాయకులు ఫోర్ ఫ్రంట్ లో ఉండడం కూడా బీసీలను ఆకర్షిస్తోంది. ఇక బీసీల గొంతుక టీడీపీలో బలంగానే వినిపిస్తోంది. ఇపుడు వైసీపీ కూడా అదే స్ట్రాటజీని అమలు చేస్తోంది. తమ పార్టీలో కూడా బీసీ నాయకులు సొంత గొంతుకను గట్టిగా వినిపించాలని ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రా బీసీ గర్జనను నిర్వహిస్తున్నారు. మరి బీసీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు వైపు మెజారిటీ ఉంటారు అన్నది చూడాల్సి ఉనిద్.
