నెల్లిమర్ల గల్లంతు...భోగాపురం ఫిక్స్ ?
అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ విభజన అన్నది ఈ టెర్మ్ లోనే జరుగుతుందని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఉన్న రూపుతో ఇదే షేపులో ఏ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం ఉండదని అంటున్నారు.
By: Satya P | 22 Jun 2026 1:00 PM ISTఅసెంబ్లీ నియోజకవర్గాల పునర్ విభజన అన్నది ఈ టెర్మ్ లోనే జరుగుతుందని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఉన్న రూపుతో ఇదే షేపులో ఏ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం ఉండదని అంటున్నారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ సమయం ఉంది కాబట్టి కచ్చితంగా ప్రస్తుతం ఉన్న 175 సీట్లు భారీగా పెరుగుతాయని కూటమిలో చర్చ సాగుతోంది. అదే సమయంలో అనేక అసెంబ్లీ నియోజకవర్గాల రూపు రేఖలు మారిపోతాయని అంటున్నారు. దాంతో పాటు కొత్త పేర్ల్తో కొత్తగా మారుతాయని కూడా చెబుతున్నారు.
నెల్లిమర్ల మీద చర్చ :
ఈ నేపధ్యంలో విజయనగరం జిల్లాలో ఉన్న నెల్లిమర్ల నియోజకవర్గం మీద ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఈ సీటు గల్లంతు అవుతుందని అంటున్నారు. నెల్లిమర్ల 2009లో ఏర్పాటు అయింది. అందులో అత్యధిక ప్రాంతాలు పాత భోగాపురం నుంచి తీసుకున్నారు. మరికొన్ని వేరే నియోజకవర్గం నుంచి కలిపారు. అలా ఇప్పటికి నాలుగు ఎన్నికలను నెల్లిమర్ల చూసింది. 2009లో కాంగ్రెస్ గెలిస్తే 2014లో టీడీపీ, 2019లో వైసీపీ 2024లో జనసేన ఇక్కడ నుంచి గెలిచాయి. అయితే 2029 నాటికి నెల్లిమర్ల ఉండదని గట్టిగానే వినిపిస్తోంది.
భోగాపురంగానే :
నెల్లిమర్లను తిరిగి భోగాపురంగానే మారుస్తారు అని అంటున్నారు. 2004 వరకూ ఉన్న భోగాపురం అసెంబ్లీలా అయితే ఉండదని కొన్ని కొత్తవి చేరుతాయి, మరి కొన్ని వేరేగా మారుతాయని అంటున్నారు. ఈ విధంగా మార్పులు చేసి భోగాపురం అసెంబ్లీ సీటుని 2029 నాటికి రెడీ చేస్తారు అని అంటున్నారు. ఇక భోగాపురం అంటే ఇపుడు ఎంతో మోజు ఉన్న సీటుగా అవుతుందని చెబుతున్నారు. ఎందుకంటే అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వచ్చింది. దానిని చుట్టూ ఆనుకుని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంతే కాదు రిలయెన్స్ వారి డేటా సెంటర్ లక్షల కోట్లతో ఇదే నియోజకవర్గంలో వస్తోంది. దాంతో రేపటి రోజున ఈ సీటు మరో జూబ్లీ హిల్స్ మాదిరిగా మారుతుందని అంటున్నారు.
పోటీకి రెడీనా :
ఇక భోగాపురం సీటు అయితే పోటీ చేసేందుకు కూటమిలోని పాటీలు పోటీ పడడం ఖాయమంగా కనిపిస్తోంది. నెల్లిమర్ల జనసేన సిట్టింగ్ సీటు కాబట్టి ఒకవేళ భోగాపురంగా మారిగా కోరుతామని అంటున్నారు. టీడీపీ అయితే మొదటి నుంచి భోగాపురం సీటులో తమకు పట్టు ఉందని అనేక ఎన్నికలు గెలిచామని గుర్తు చేస్తున్నారు. పైగా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు రావడంతో ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేకు ఎంతో విలువ గౌరవం ఉంటుందని రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా ఊపందుకుంటుందని లెక్కలు వేస్తున్నారు. మరో వైపు వైసీపీ నేతలు కూడా భోగాపురం సీటు మీద కన్ను వేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు వైసీపీ ఇంచార్జిగా ఉన్నారు. అయితే ఆయనతో పాటు మరింత మంది పోటీకి రెడీ అవుతారని ఫ్యాన్ పార్టీలో వినిపిస్తున్న మాటగా ఉంది.
