Begin typing your search above and press return to search.

సీఎం సార్ ప్ర‌సంగం విన్నారా: విద్యార్థుల‌తో ప‌వ‌న్ ముచ్చ‌ట్లు

అసెంబ్లీ స‌మావేశాల‌ను గ్యాల‌రీలో కూర్చుని వీక్షించారు. అనంత‌రం.. విద్యార్థులు.. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌హా.. ఇత‌ర మంత్రుల‌ను క‌లుసుకున్నారు.

By:  Garuda Media   |   25 Feb 2026 9:15 AM IST
సీఎం సార్ ప్ర‌సంగం విన్నారా: విద్యార్థుల‌తో ప‌వ‌న్ ముచ్చ‌ట్లు
X

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా.. చ‌ర్చ‌ల‌ను వీక్షించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల విద్యార్థుల‌ను అనుమ‌తిస్తున్న విష‌యం తెలిసిందే. ప‌లు పాఠ‌శాల‌ల విద్యార్థుల‌ను విడ‌త‌ల వారీగా స‌భ‌కు అనుమ‌తిస్తున్నారు. 25-40 నిమిషాల వ‌ర‌కు స‌భా కార్య‌క‌లాపాల‌ను వీక్షించేందుకు.. విద్యా ర్థుల‌ను అనుమ‌తిస్తున్నారు. ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృత లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు వ‌చ్చారు.

అసెంబ్లీ స‌మావేశాల‌ను గ్యాల‌రీలో కూర్చుని వీక్షించారు. అనంత‌రం.. విద్యార్థులు.. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌హా.. ఇత‌ర మంత్రుల‌ను క‌లుసుకున్నారు. వారితో ఫొటోలు దిగారు. అనంత‌రం.. ప‌వ‌న్ క‌ల్యాణ్ విద్యార్థుల‌తో కొద్దిసేపు ముచ్చ‌టించారు. ''సీఎం సార్ ప్ర‌సంగం విన్నారా'' అంటూ.. ప‌లువురు విద్యార్థుల ను ప్ర‌శ్నించారు. సీఎం చంద్ర‌బాబుకు సుదీర్ఘ అనుభ‌వం ఉంద‌ని.. ఆయ‌న పాల‌నా ద‌క్షుడ‌ని విద్యార్థుల కు తెలిపారు. ఆయ‌న ప్రంగాన్ని వినే అవ‌కాశం రావ‌డం అదృష్ట‌మ‌ని పేర్కొన్నారు.

ఈ సంద‌ర్భంగా తాను విద్యార్థిగా ఉన్న‌ప్పుడు.. అసెంబ్లీ స‌మావేశాల‌ను వీక్షించే అవ‌కాశం రాలేద‌ని.. ప‌వ న్ క‌ల్యాణ్ తెలిపారు. పుస్త‌కాల్లో చ‌దువుకున్నాన‌ని చెప్పారు. బ‌ల‌మైన నాయ‌కులుగా ఎద‌గాలంటే నిరం త‌రం అధ్య‌య‌నం చేయాల‌ని, చ‌రిత్ర‌ను తెలుసుకోవాల‌ని సూచించారు. త‌ర‌చుగా గ్రంధాల‌యాల‌కు వెళ్లాల‌ని.. మ‌హ‌నీయుల జీవిత విశేషాల‌ను తెలుసుకోవాల‌ని తెలిపారు. అధ్య‌య‌నంతోనే అన్నీ అల‌వ‌డు తాయ‌ని చెప్పారు. ప్ర‌తి విష‌యాన్నీ నిశితంగా గ‌మ‌నించాల‌ని సూచించారు.

అనంత‌రం.. విద్యార్థులు.. స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడిని క‌లుసుకున్నారు. ఆయ‌న సైతం విద్యార్థుల ను ప‌లు ప్ర‌శ్న‌లు అడిగారు. స‌భ‌లో జ‌రిగే చ‌ర్చ‌లు ఎలా ఉన్నాయ‌ని.. వీటిపై ఆస‌క్తి ఉందా? అని ప్ర‌శ్నించా రు. పాఠ‌శాల‌ల్లోనూ మాక్ అసెంబ్లీలు నిర్వ‌హించాల‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధానోపాధ్యాయుల‌కు స్పీక‌ర్ సూచించారు. త‌ద్వారా చ‌ట్ట స‌భ‌ల వ్య‌వ‌హారంపై విద్యార్థులకు అవ‌గాహ‌న ఏర్ప‌డుతుంద‌ని చెప్పారు.