Begin typing your search above and press return to search.

ఇల్లు లేని వారి కోసం కూటమి గుడ్ న్యూస్

ఇల్లు లేని వారు ఎంతో మంది ఉన్నారు. ఎన్ని పధకాలు వచ్చినా ఎంతమందికి ఇళ్ళు కట్టించినా ఇంకా గూడు లేని వారు పొట్ట కూడు కోసం పాట్లు పడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు.

By:  Satya P   |   25 Jan 2026 9:29 AM IST
ఇల్లు లేని వారి కోసం  కూటమి  గుడ్ న్యూస్
X

ఇల్లు లేని వారు ఎంతో మంది ఉన్నారు. ఎన్ని పధకాలు వచ్చినా ఎంతమందికి ఇళ్ళు కట్టించినా ఇంకా గూడు లేని వారు పొట్ట కూడు కోసం పాట్లు పడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే వారికి మేలు చేస్తామని చెప్పింది. అలా గతంలో కొంత మందికి న్యాయం చేసింది. అయితే ఈసారి మాత్రం పెద్ద ఎత్తున పేదలకు గుడ్ న్యూస్ చెప్పాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏమిటి అంటే మ్యాటర్ చాలా స్వీట్ గానే ఉంది మరి.

ఏకంగా అయిదు లక్షల ఇళ్ళు :

ఏపీలో ఏకంగా ఒకేసారి అయిదు లక్షల మందికి ఇళ్ళను కట్టించే పనిలో ఉంది. ఆ ఇళ్ళను ఉగాది పండుగ వేళకు గృహ ప్రవేశం చేయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏపీ ప్రభుత్వం ఆర్ధిక ప్రోత్సాహంతో ప్రస్తుతం ఏపీలో పెద్ద ఎత్తున గృహ నిర్మాణం జోరుగా సాగుతోంది. తుది దశకు చేరుకున్న ఈ వ్యవహారం చూస్తే కనుక ఇళ్ళు లేని వారికి తొందరలోనే ఇళ్ళు అందించే శుభ వార్త చెప్పబోతున్నారు అని అంటున్నారు.

ఉగాది పండుగ వేళ :

ఉగాది కి ముందే ఈ అయిదు లక్షల ఇళ్ళు అన్నీ పూర్తి కావాలని కూటమి ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. చురుకుగా వాటి నిర్మాణం పనులు అయితే సాగుతున్నాయి. అంతే కాదు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి కూడా ఈ ఇళ్ల నిర్మాణం మీద తరచుగా సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన నిర్వహించిన సమావేశంలో ఉగాది నాటికి ఇళ్ళ నిర్మాణం కంప్లీట్ చేయాలని ఆదేశించారు.

ఒకేసారి లక్షలలో :

దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి లక్షలలో గృహ ప్రవేశాలు చేయించాలని కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అంటే ఉగాది వేళ సొంత ఇంటికి పేదలు వెళ్ళి అక్కడ పండుగ జరుపుకోవడం అంటే నిజంగా అదే కదా అసలైన ఉదాగి. సరిగ్గా ఈ ఆలోచనతోనే ప్రభుత్వం ఉగాది ముహూర్తాన్ని ఎంచుకుంది అని అంటున్నారు. ఎప్పటికప్పుడు అధికారులు ఈ గృహ నిర్మాణాలకు సంబంధించి పురోగతిని సమీక్షిస్తూ పూర్తి అయ్యేలా చూడాలని కూడా ప్రభుత్వం ఆదేశిస్తోంది. అలగే పేదలకు ఇళ్ళు నిర్మించి ఇవ్వడమే కాదు, మౌలిక సదుపాయాలను ఇతర వసతులను ఏర్పాటు చేయడం కూడా శరవేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తోంది.

మూకుమ్మడిగానే :

లక్షలలో మూకుమ్మడిగా గృహ ప్రవేశాలు చేయించి పేదలకు సొంతింటి కలను నెరవేర్చాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. పీఎం ఆవాస్ యోజన ఎన్టీఆర్ పధకం ఈ రెండూ కలసి ఈ ఇళ్ళ నిర్మాణం రూపొందుతోంది. ఈ పధకం కింద కొత్తగా దరఖాస్తులను కూడా స్వీకరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో అయితే ఒక లక్షా 59 వేల రూపాయలను ప్రభుత్వం ఆర్ధిక సాయంగా అందిస్తోంది. పట్నాలలో అయితే 2.50 లక్షల రూపాయలు అందిస్తోంది. మొత్తం మీద ఏపీలో పేదలకు శాశ్వత గూడు అందించేందుకు కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.