Begin typing your search above and press return to search.

శాంతియుత న్యూజిలాండ్ లోనూ భారతీయులపై అసహనం ఎందుకు మొదలైంది?

హాకా అనేది న్యూజిలాండ్ కు చెందిన మావోరీ తెగల సంప్రదాయ నృత్యం. ఇందులో శక్తివంతమైన శరీర కదలికలు.. ముఖ కవళికలు ఉంటాయి.

By:  A.N.Kumar   |   23 Dec 2025 6:17 PM IST
శాంతియుత న్యూజిలాండ్ లోనూ భారతీయులపై అసహనం ఎందుకు మొదలైంది?
X

ఇప్పటికే అమెరికాలో భారతీయులను సాగనంపుతున్నారు. బ్రిటన్ లోనూ వలసదారులు ముఖ్యంగా భారతీయుల ఆధిపత్యంపై అట్టుడుకుతున్నారు. కెనడాలోనూ భారతీయుల ఆధిపత్యాన్ని సవాల్ చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో అయితే ఏకంగా భారతీయులపై దాడులు కూడా మొదలయ్యాయి. ఇప్పుడు అదే కోవలో మరో శాంతి కాముక దేశంలో భారతీయులపై అసహనం షురూ అయ్యింది.

ప్రపంచవ్యాప్తంగా శాంతియుత దేశంగా పేరున్న న్యూజిలాండ్ లో తాజాగా చోటు చేసుకున్న ఘటన భారతీయ సమాజాన్ని ఆందోళనకు గురిచేసింది. డిసెంబర్ 21న అక్లాండ్ నగరంలో జరిగిన సిక్కుల పవిత్ర ఊరేగింపు ‘నాగర్ కీర్తన్’ సందర్భంగా కొందరు స్థానిక యువకులు నిరసన చేపట్టడం సంచలనంగా మారింది.

అసలు వివాదానికి కారణమేంటంటే?

డిసెంబర్ 21న సౌత్ అక్లాండ్ లోని గురుద్వారా నానక్సర్ తత్ ఇషార్ దర్భార్ మనురివా నుంచి ప్రారంభమైన నాగర్ కీర్తన్ తిరిగి గురుద్వారాకు చేరుకుంటున్న సమయంలో సుమారు 30-35 మంది స్థానిక యువకులు ముందుకు వచ్చి అడ్డుకున్నారు. వారు మావోరీల సంప్రదాయ నృత్యమైన ‘హాకా డ్యాన్స్’ చేస్తూ ‘ఇది న్యూజిలాండ్.. ఇండియా కాదు’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో వెంటనే పోలీసులు జోక్యం చేసుకొని ఉద్రిక్తత పెంచకండా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నార. భద్రతా కారణాల దృష్ట్యా ఊరేగింపు తిరిగి గురుద్వారాకు చేరింది. స్థానిక సిక్కు నాయకులు, సంఘం పెద్దలు పరిస్థితిని శాంతియుతంగా నియంత్రించడంలో కీలక పాత్ర పోషించారు.

హాకా డ్యాన్స్ అంటే ఏమిటి?

హాకా అనేది న్యూజిలాండ్ కు చెందిన మావోరీ తెగల సంప్రదాయ నృత్యం. ఇందులో శక్తివంతమైన శరీర కదలికలు.. ముఖ కవళికలు ఉంటాయి. నాలుక బయటపెడుతూ భూమిని బలంగా తన్నుతూ భీకర డ్యాన్స్ చేస్తారు. ఈ నృత్యాన్ని సాధారణంగా స్వాగతానికి.. ప్రత్యేక సందర్భాలకు.. లేదా యుద్ధానికి ముందు యోధులను ఉత్సాహపరిచేందుకు చేస్తారు. ఇది మావోరీ సంస్కృతిలో గర్వం, ఐక్యత, శక్తికి ప్రతీక.

ఎందుకు వివాదం?

ఇటీవలి కాలంలో హాకా నృత్యాన్ని రాజకీయ, సామాజిక నిరసనలకు కూడా వినియోగిస్తారు. ఇటీవలే ఒక మావోరీ మహిళా ఎంపీ ప్రభుత్వ బిల్లుకు వ్యతిరేకంగా ‘న్యూజిలాండ్ పార్లమెంట్’లోనే హాకా ప్రదర్శించడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇప్పుడు అదే ‘హాకా’న మతపరమైన ఊరేగింపును అడ్డుకునేందుకు ఉపయోగించడం వలసదారులపై ముఖ్యంగా భారతీయులపై పెరుగుతున్న అసహనానికి సంకేతంగా విశ్లేషఖులు చెబుతున్నారు.

భారతీయ సమాజంపై ప్రభావం?

ఈ సంఘటనతో న్యూజిలాండ్ లో నివసిస్తున్న భారతీయలు, ముఖ్యంగా సిక్కు సమాజం భద్రత, సామరస్యం విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది గత కొద్ది నెలల్లో జరిగిన మూడో ఇలాంటి సంఘటనగా పేర్కొనడం గమనార్హం.

భారతీయులకు ఇదో గుణపాఠం

విదేశాల్లో నివసిస్తున్నప్పుడ స్థానిక సంస్కృతికి గౌరవం ఇవ్వాలి. సామాజిక సామరస్యం పాటించాలి. మత స్వేచ్ఛకు పరస్పర గౌరవం ఇవ్వా లనే విషయం ఎంత కీలకమో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.

శాంతియుత పరిష్కారమే ఏ సమాజానికైనా మార్గమని.. భిన్న సంస్కృతలు కలిసి జీవించడమే నిజమైన అభివృద్ధి అని ఈ సంఘటన బలంగా చెప్పింది.