మరో మహమ్మారికి ప్రపంచం సిద్ధమవ్వాలి... తెరపైకి సంచలన విషయం!
దాదాపు ఏడాది తర్వాత తాజాగా మరో షాకింగ్ హెచ్చరిక తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... మానవ ఆధారిత పర్యావరణ విధ్వంసం వల్ల మరో మహమ్మారి ఎంట్రీ దాదాపు అనివార్యమైందని 'ది లాన్సెంట్' వైద్య పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్ డాక్టర్ రిచర్డ్ హోర్టన్ అన్నారు.
By: Raja Ch | 9 Feb 2026 12:03 PM ISTమహమ్మారి అనగానే ప్రపంచానికి కోవిడ్-19 గుర్తుకు రావడమే కాదు.. కాస్త వణుకు కూడా పుడుతుంది! కంటికి కనిపించని ఓ వైరస్ ప్రపంచం మొత్తాన్ని ఎంత వేగంగా చుట్టుముట్టగలదో కోవిడ్-19 చెప్పకనే చెప్పింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.ఓ) ప్రకారం.. డిసెంబర్ 2019 నుంచి దాదాపు 780 మిలియన్ల కోవిడ్ కేసులు నమోదవ్వగా.. 7.1 మిలియన్లకు పైగా మరణాలు అధికారికంగా నివేదించబడ్డాయి. అయితే.. ఈ లెక్కలు ఇంకా ఎక్కువ ఉంటాయని అంటున్న వేళ.. తాజాగా మరో మహమ్మారి విషయం తెరపైకి వచ్చింది.
అవును... రాబోయే కాలంలో సుమారు పాతిక మిలియన్లకు పైగా మరణాలకు కారణమయ్యే మహమ్మారికి దాదాపు 48% అవకాశం ఉందని.. వచ్చే 10ఏళ్లలో కోవిడ్ లాంటి వైరస్ వ్యాప్తికి సుమారు 23% అవకాశం ఉందని 'ది లాన్సెట్' నివేదిక అంచనా వేసిన దాదాపు ఏడాది తర్వాత తాజాగా మరో షాకింగ్ హెచ్చరిక తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... మానవ ఆధారిత పర్యావరణ విధ్వంసం వల్ల మరో మహమ్మారి ఎంట్రీ దాదాపు అనివార్యమైందని 'ది లాన్సెంట్' వైద్య పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్ డాక్టర్ రిచర్డ్ హోర్టన్ అన్నారు.
తాజాగా జాతీయ మీడియాతో మాట్లాడిన హోర్టన్... అడవుల విధ్వంసం, వేగవంతమైన పట్టణ విస్తరణ, నిర్విరామ వాతావరణ మార్పులు వెరసి రాబోయే 20 ఏళ్లలో మరో మహమ్మారికి పరిస్థితులను సృష్టించేంతగా భూమిని నాశనం చేస్తున్నాయని అన్నారు. ఇది దాదాపు అనివార్యం అంటూ తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ క్రమంలో వైరస్ ల వ్యాప్తికి ప్రధాన ప్రమాద కేంద్రాలుగా అసురక్షిత మాంసపు మార్కెట్లు, కబేళాలు నిలుస్తున్నాయని వెల్లడించారు.
ఇందులో భాగంగా... రద్దీగా ఉండే ప్రదేశాలలోనే జంతువులను చంపుతూ.. మాంసాన్ని కవర్ చేయకుండా అక్కడే వదిలేస్తున్నరని.. దానిపై ఈగలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయని.. అక్కడ నుంచి ఆ మాంసాన్ని వీధుల్లో ఎలాంటి రక్షణ లేకుండా స్వేచ్ఛగా అమ్ముతున్నారని.. వైరస్ లు జంతువుల నుంచి మానవునికి సంక్రమించే పరిస్థితులు స్పష్టంగా ఇవేనని చెప్పిన హోర్టన్... కోవిడ్ - 19 కి కారణమైన వైరస్ చైనాలోని వూహాన్ లోని దాదాపు ఇలాంటి మార్కెట్ నుంచే ఉద్భవించి ఉండొచ్చని నిరూపించబడిందనే వాదనలున్నాయని అన్నారు!
కాగా... 2022లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, మోడలింగ్ పద్ధతులను ఉపయోగించి భారత్ లో కోవిడ్-19 సంబంధిత మరణాలను సుమారు 47 లక్షలుగా అంచనావేయగా... వాషింగ్టన్ యూనివర్సిటీ నేతృత్వంలోని ఒక ప్రత్యేక అధ్యయనం 2020-21లో సుమారు 41 లక్షల అదనపు మరణాలను సూచించింది. ఈ క్రమంలో లాన్సెంట్ కూడా 40 లక్షల మరణాలను వెల్లడించింది! ఈ క్రమంలో రాబోయే సంవత్సరాల్లో మరో మహమ్మారికి అవకాశం ఉందని చెబుతూ.. అది కోవిడ్-19కు కారణమైన సార్స్ వైరస్ కావొచ్చు, మరొకటి కావొచ్చని తెలిపారు!
