Begin typing your search above and press return to search.

భువనేశ్వరితో అన్నా లెజినోవా...ఫోకస్ అటే !

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా గవర్నర్ రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

By:  Satya P   |   16 Aug 2025 1:27 AM IST
భువనేశ్వరితో అన్నా లెజినోవా...ఫోకస్ అటే !
X

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా గవర్నర్ రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి ఎట్ హోం మి సతీ సమేతంగా పవన్ కళ్యాణ్ వచ్చారు. ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తరువాత అధికారిక కార్యక్రమంలో పెద్దగా ఆయన సతీమణి అన్నా లెజినోవా కనిపించినది లేదు. కానీ ఈసారి మాత్రం వెరీ స్పెషల్ గానే ఉంది. దాంతో తన భార్యను వెంటబెట్టుకుని రాజ్ భవన్ కి పవన్ రావడం జరిగింది.

ఇద్దరూ ముచ్చట్లు :

ఇక పవన్ సతీమణితో ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ముచ్చట్లు ఆడడం కూడా కెమెరా ఫోకస్ చేసింది. ఇద్దరూ పక్క పక్కనే కూర్చుని నవ్వుతూ అనేక విషయాలను మాట్లాడుకుంటూ కనిపించారు. ఇక రాజ్ భవన్ లో జరిగిన ఎట్ హోం లో గవర్నర్ అబ్దుల్ నజీర్ పక్కన చంద్రబాబు ఆయన పక్కన పవన్ కళ్యాణ్ కూర్చున్నారు. అలా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఒక వైపు ఉంటే వారిది ఎదురుగా రౌండ్ టేబిల్ వద్ద భువనేశ్వరి అన్నా లెజినోవా ఉండడం విశేషం. పవన్ పక్కన మంత్రి నారా లోకేష్ కూర్చున్నారు. మొత్తానికి ఎట్ హోం లో పవన్ సతీమణి అన్నా లెజినోవా హైలెట్ గా నిలిచారు అని చెప్పాలి.

పిఠాపురంలో సైతం :

ఇక దీనికంటే ముందు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అక్కడ కూడా తన సతీమణిని ఆయన తీసుకుని రావడం జరిగింది. దాంతో పవన్ తో కలసి ఈ విధంగా ఆమె అధికార కార్యక్రమాలలో ఆమె పాల్గొనడం పట్ల జనసేన వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇక తాజాగా ఎట్ హోం లో కూడా ఆమె కనిపించడం మరింత విశేషంగా చెబుతున్నారు

నారా కొణిదెల బంధం :

స్వాతంత్ర్య దినోత్సవ వేళ రోజంతా చంద్రబాబు పవన్ ఇద్దరూ కలసి సమావేశాలలో పాల్గొంటూ కనిపించారు. విజయవాడ బస్ స్టేషన్ లో మహిళలకు ఉచిత బస్సుని ప్రారంభించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కలసి పాల్గొన్నారు ఇద్దరూ ఫ్రీ బస్సుని ఎక్కి కొంత దూరం ప్రయాణించారు. ఆ తర్వాత జరిగిన సభలో ప్రసంగించారు. మరో వైపు చూస్తే చంద్రబాబు పవన్ బంధం కూటమిలో మరింత గట్టిగా పెనవేసుకుంటోంది అని అంటున్నారు. తమ కూటమి ప్రభుత్వం ఏపీలో మరో పదిహేనేళ్ల పాటు కొనసాగాలని పవన్ మరోసారి కోరుకున్నారు. దాంతో టీడీపీ కూటమి పటిష్టంగా ఉందన్న సందేశాన్ని ఎప్పటికపుడు జనంలోకి పంపిస్తున్నారు అని అంటున్నారు. ఈ బంధం ఎప్పటికీ వీడేది కాదని కూడా బలంగా చాటి చెబుతున్నారు అని అంటున్నారు.