గొప్ప మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్ భార్య.. తన పుట్టినరోజు సందర్భంగా?
సినీ హీరోగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు.. మరొకవైపు రాజకీయాలంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
By: Madhu Reddy | 1 Aug 2026 10:42 AM ISTసినీ హీరోగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు.. మరొకవైపు రాజకీయాలంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే ఆయన బాటలోనే ఆయన భార్య అన్నా కొణిదెల కూడా గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకుంటూ పలువురికి సహాయపడుతూ ఆదర్శంగా నిలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా ఆమె తీసుకున్న నిర్ణయానికి అభిమానులు ఫిదా అవుతున్నారు.
గొప్ప మనసు చాటుకున్న అన్నా కొణిదెల..
ఇటీవలే అన్నా లెజినోవాగా ఉన్న తన పేరును అన్నా కొణిదెలగా మార్చుకొని ఇకపై అందరూ తనను ఇలాగే పిలవాలి అంటూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసిన ఈమె ..తన పుట్టినరోజు కొన్ని రోజుల ముందే ఈ విషయాన్ని ప్రకటిస్తున్నాను.. ఎప్పుడో ఈ విషయాన్ని చెప్పాలనుకున్నాను కానీ ఇదే సరైన సమయం అని ఇప్పుడు చెబుతున్నాను అంటూ తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా చెప్పుకొచ్చింది. ఇకపోతే ఇప్పుడు తన పుట్టినరోజు సందర్భంగా గొప్ప మనసు చాటుకుంది. ఏకంగా ఆసియా ఏనుగు, ఒక బెంగాల్ టైగర్ ను దత్తత తీసుకుంది అన్నా కొణిదెల.
రెండు వన్యప్రాణులను దత్తత తీసుకున్న అన్నా కొణిదెల..
అసలు విషయంలోకి వెళ్తే.. విశాఖపట్నం లోని ఇందిరాగాంధీ జూ పార్క్ లో ఉన్న రాయల్ బెంగాల్ టైగర్ తో పాటు ఆసియా ఏనుగుని ఆమె దత్తత తీసుకున్నారు.. పైగా ఈ రెండు జంతువుల కోసం ఏడాది సంరక్షణకు, పోషకాహారానికి, వైద్య అవసరాల నిమిత్తం ఏకంగా 6.30 లక్షల విరాళాన్ని అందజేశారు. ఈ నిధులను జంతువుల సంక్షేమం సంరక్షణ కార్యక్రమాలకు వినియోగిస్తామని జూ అధికారులు కూడా తెలిపారు. వన్యప్రాణుల పరిరక్షణ పై అవగాహన పెంచే లక్ష్యంతోనే అన్నా కొణిదెల ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో అభిమానులు ,సినీ సెలబ్రిటీలు పవన్ కళ్యాణ్ -అన్నా కొణిదెల దంపతులపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ సినిమాలు..
పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే.. ఒకవైపు హీరోగా పలు సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ కి ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన నటించిన చిత్రం హరిహర వీరమల్లు . ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది. ఆ తర్వాత ప్రముఖ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ఓజి సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. పవన్ కళ్యాణ్ ఇందులో క్లాసిక్ గ్యాంగ్ స్టర్ లుక్కులో కనిపించి అభిమానులను మెస్మరైజ్ చేశారు. ఆ తర్వాత గతంలో గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో అదే జోష్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేశారు. కానీ ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇప్పుడు ప్రముఖ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మరొకవైపు ఓజీ 2 సినిమా షూటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ త్వరలో పాల్గొనబోతున్నట్లు సమాచారం.
