Begin typing your search above and press return to search.

మోడీజీ ఆల‌స్యం చేయొద్దు: మేధావుల లేఖ‌

ఈ నేప‌థ్యంలో ప‌లువురు మేధావులు ప్ర‌ధానికి లేఖ‌లు రాశారు. కొంద‌రు నేరుగా పీఎంవోకు పంపిస్తే.. మ‌రికొంద‌రు సోష‌ల్ మీడియా, ప్ర‌ధాన మీడియాల వేదిక‌గా .. త‌మ గ‌ళం వినిపించారు.

By:  Garuda Media   |   22 July 2026 11:00 PM IST
మోడీజీ ఆల‌స్యం చేయొద్దు:  మేధావుల లేఖ‌
X

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఇక ఎంత మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కోరుతూ.. ప్ర‌ముఖులు, మేధావులు, సామాజిక ఉద్య‌మ‌కారులు ఆయ‌న‌కు లేఖలు సంధించారు. వీరిలో ప్ర‌ముఖ సామాజిక వేత్త , మ‌హారాష్ట్ర‌కుచెందిన అన్నా హ‌జారే కూడా ఉన్నారు. త‌క్ష‌ణమే చ‌ర్య‌లు తీసుకుని మీ స‌చ్ఛీల‌త‌ను నిరూపించుకోవాల‌ని వారు ప్ర‌ధానికి విజ్ఞ‌ప్తి చేశారు. అంతేకాదు.. ఇలా చేయ‌డం వ‌ల్ల కేంద్రంలోని మోడీ స‌ర్కారుకు మ‌రింత విలువ పెరుగుతుంద‌ని.. మ‌రింత బ‌ల ప‌డుతుంద‌ని కూడా సూచించ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌స్తుతం విద్యార్థుల ఉద్య‌మాల‌తో ఢిల్లీ స‌హా.. గుజ‌రాత్‌, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు వంటి కీల‌క అతి పెద్ద రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. గుజ‌రాత్‌, మ‌హారాష్ట్ర‌లు మిన‌హా.. ప్రతిప‌క్షాలు, త‌ట‌స్థంగా ఉంటున్న పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల ప్ర‌భుత్వాలు సైతం ఈ నిర‌స‌న‌లో పాలుపంచుకుంటున్నాయి. క‌ర్ణాట‌క‌లో గురువారం విద్యాసంస్థ‌ల బంద్‌ను ప్ర‌క‌టించారు. త‌మిళ‌నాడులో కూడా ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. సీఎం విజ‌య్ ప్ర‌ధానికి లేఖ రాశారు. అలానే తెలంగాణ‌లోనూ విద్యార్థులు రాష్ట్ర‌వ్యాప్త ఉద్య‌మానికి తెర‌దీశారు.

ఇలా.. అన్ని రాష్ట్రాల్లోనూ నీట్‌ స‌మ‌స్య‌పై విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్య‌మిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌లువురు మేధావులు ప్ర‌ధానికి లేఖ‌లు రాశారు. కొంద‌రు నేరుగా పీఎంవోకు పంపిస్తే.. మ‌రికొంద‌రు సోష‌ల్ మీడియా, ప్ర‌ధాన మీడియాల వేదిక‌గా .. త‌మ గ‌ళం వినిపించారు. నీట్ ప‌రీక్ష‌పై రాజుకున్న ఈ వివాదాన్ని సాధ్య‌మైనంత వేగంగా ప‌రిష్క‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర‌ప్ర‌ధాన్‌తో రాజీనామా చేయించ‌డం అత్యంత అవ‌స‌రమ‌నిపేర్కొన్నారు. ఇదే జ‌రిగితే.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న నిర‌స‌న‌లు వాటంత‌ట అవే ఆగిపోతాయ‌ని పేర్కొన్నారు.

అంతేకాదు.. మోడీ ప్ర‌భుత్వం మ‌రింత బ‌ల‌ప‌డుతుందని అన్నాహ‌జారే సూచించారు. మ‌రికొంద‌రు ప్ర‌భుత్వంపై వ‌స్తున్న విమ ర్శ‌లు కూడా ఆగిపోతాయ‌ని.. ఒక్క మంత్రిని త‌ప్పించినంత మాత్రాన ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు రాద‌ని, ఆయ‌న‌ను వెనుకేసుకు వ‌చ్చేవారిపై ప్ర‌జ‌లు త‌మ ఆగ్ర‌హాన్ని ఎప్ప‌టికైనా తీర్చుకుంటార‌ని ప‌రోక్షంగా ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు. ఇలా.. దేశ‌వ్యాప్తంగా ప‌లువురు మేధావులు ప్ర‌ధానికి లేఖ రాయ‌డం సంచ‌ల‌నంగా మారింది. త‌క్ష‌ణ చ‌ర్య‌ల‌తో పార్ల‌మెంటులోనూ ర‌గ‌డ త‌ప్పుతుం దని మాజీ డీజీపీలు ఇద్ద‌రు సూచించారు. దీంతో స‌భ‌ను స‌జావుగా న‌డిపించేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని పేర్కొన్నారు.