Begin typing your search above and press return to search.

మ‌హిళా రిజ‌ర్వేష‌న్‌ ఎలా నిర్ణ‌యిస్తారో తెలుసా ..!

రాష్ట్రంలో 2029 ఎన్నిక‌ల నాటికి అసెంబ్లీ, పార్ల‌మెంటు స్థానాలు పెర‌గ‌నున్నాయి. అదేస‌మ‌యంలో మ‌హిళ‌ల‌కు కూడా రిజ‌ర్వేష‌న్ ఫ‌లాలు ద‌క్క‌నున్నాయ‌న్న చ‌ర్చ సాగుతోంది.

By:  Garuda Media   |   27 March 2026 11:00 PM IST
మ‌హిళా రిజ‌ర్వేష‌న్‌ ఎలా నిర్ణ‌యిస్తారో తెలుసా ..!
X

రాష్ట్రంలో 2029 ఎన్నిక‌ల నాటికి అసెంబ్లీ, పార్ల‌మెంటు స్థానాలు పెర‌గ‌నున్నాయి. అదేస‌మ‌యంలో మ‌హిళ‌ల‌కు కూడా రిజ‌ర్వేష‌న్ ఫ‌లాలు ద‌క్క‌నున్నాయ‌న్న చ‌ర్చ సాగుతోంది. ప్ర‌స్తుతం లేదా.. వ‌చ్చే పార్ల‌మెంటు స‌మావేశాల్లోనే దీనికి సంబంధించిన చ‌ర్చ‌సాగ‌నుంది. ఇదే జ‌రిగితే.. దేశ‌వ్యాప్తంగా సుమారు 250 మంది మ‌హిళా పార్ల‌మెంటు స‌భ్యులు అందుబాటులోకి వ‌స్తారు. వారికి హ‌క్కుగా కూడా ప‌రిణామాలు మార‌నున్నాయి.

ఇక‌, ఏపీ అసెంబ్లీ విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల మేర‌కు 175 నుంచి 263 స్థానాలు పెర‌గ నున్నాయి. వీటిలో పెర‌గ‌నున్న 88 అసెంబ్లీ స్థానాలలో 87 స్థానాలు మ‌హిళ‌ల‌కే కేటాయించ‌నున్నారు. త‌ద్వారా మ‌హిళ‌లప్రాతినిధ్యం మ‌రింత‌గా అసెంబ్లీలో పెరుగుతుంది. అయితే.. మ‌హిళ‌ల‌కు ఏప్రాతిప‌దిక‌న నియోజ‌క‌వ‌ర్గాల కేటాయింపు ఉంటుంది? అనేది ప్ర‌స్తుతం జ‌రుగుతున్న చ‌ర్చ‌. దీనిపై సోష‌ల్ మీడియాలో అనేక వార్త‌లు వ‌స్తున్నాయి.

మంగ‌ళ‌గిరి నుంచి అనంత‌పురం వ‌ర‌కు.. విజ‌య‌వాడ నుంచి ఉత్త‌రాంధ్ర వ‌ర‌కు కూడా.. ఈ నియోజ‌క వ‌ర్గాలు మ‌హిళ‌ల‌కు కేటాయిస్తార‌ని చెబుతున్నారు. కానీ.. అవి వాస్త‌వం కాదు. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ క‌ల్పించేందుకు.. ఇప్పుడున్న నియోజ‌క‌వ‌ర్గాల‌ను ప్రాతిప‌దిక‌గా తీసుకోరు. కానీ, ప్ర‌స్తుతం వ‌స్తున్న వార్త‌ల‌న్నీ.. ప్ర‌స్తుతం ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల‌ను ప్రాతిప‌దిక‌గా తీసుకున్న‌వే. అయితే.. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న డీలిమిటేష‌న్ ఆధారంగా.. ఏర్ప‌డే నియోజ‌క‌వ‌ర్గాలనే మ‌హిళ‌ల‌కు ప్రాతిప‌దిక‌గా తీసుకుంటారు.

కొత్తగా ఏర్ప‌డే నియోజ‌క‌వ‌ర్గాల‌తో పాటు.. పాత నియోజ‌క‌వ‌ర్గాల‌ను కూడా క‌లిపి.. మ‌హిళా జ‌నాభాను అంచనా వేస్తారు. అయితే.. ఇదొక్క‌టే ప్రాతిప‌దిక కూడా కాదు. మ‌హిళా ఓట‌ర్ల‌ను ప్రాతిప‌దిక‌గా తీసుకుంటారు. వ‌చ్చే 10 సంవ‌త్స‌రాల్లో ఓట‌ర్లుగా మార‌నున్న మ‌హిళ‌ల‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని.. త‌ద్వారా.. ఏ నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్కువ మంది మ‌హిళా ఓట‌ర్లు ఉన్నార‌న్న విష‌యాన్ని చూస్తారు. ఉదాహ‌ర‌ణ‌కు.. విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌లో ప్ర‌స్తుతం మ‌హిళ‌లు ఉన్నారు.

కానీ, రేపు ఈ నియోజ‌క‌వ‌ర్గం విభ‌జ‌న జ‌రిగితే.. విజ‌య‌వాడ రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం(గ‌న్న‌వ‌రంలో కొంత భాగాన్ని క‌లుపుతారు) వ‌స్తుంది. దీంతో విజ‌య‌వాడ సెంట్ర‌ల్ కంటే.. రూర‌ల్‌లో మ‌హిళా ఓట‌ర్లు ఎక్కువ‌గా ఉంటారు కాబ‌ట్టి.. దానిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు. ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్ప‌డే కొత్త‌, పాత‌న నియోజ‌క‌వ‌ర్గాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని.. మ‌హిళా ఓట‌ర్లు ఎక్కువ‌గా ఉన్న(క‌నీసం 10 శాతం) వాటినే మ‌హిళ‌ల‌కు కేటాయిస్తారు. దీనికి రిజ‌ర్వ్‌డ్ నియోజ‌వ‌ర్గాలే ఉదాహ‌ర‌ణ‌.