Begin typing your search above and press return to search.

ఒకటికే ఆగమాగం.. ఒకేసారి రెండు వాయుగుండాలా?

దగ్గర దగ్గర నెల క్రితం రెండు తెలుగు రాష్ట్రాలను తీవ్రంగా ప్రభావితం చేసిన మొంథా తుపాను నుంచి పలు కుటుంబాలు ఇప్పటికి తేరుకున్నది లేదు.

By:  Garuda Media   |   26 Nov 2025 3:44 PM IST
ఒకటికే ఆగమాగం.. ఒకేసారి రెండు వాయుగుండాలా?
X

దగ్గర దగ్గర నెల క్రితం రెండు తెలుగు రాష్ట్రాలను తీవ్రంగా ప్రభావితం చేసిన మొంథా తుపాను నుంచి పలు కుటుంబాలు ఇప్పటికి తేరుకున్నది లేదు. దాని ద్వారా ఎదురైన సమస్యలు ఒక కొలిక్కి రాకముందే.. మరో ఆపద ముంచుకొస్తోంది. ఒక వాయుగుండం తుపానుగా మారటం.. దాని దెబ్బకు అతలాకుతలం కావటం.. ఒక్కొక్క అడుగు సమీకరించుకొని ముందుకెళ్లటం తెలిసిందే. అలాంటిది ఒకేసారి రెండు వాయుగుండాలు ఇప్పుడు ఏపీకి మరో సవాలు విసురుతున్న పరిస్థితి.

ఒక వాయుగుండం తుపానుగా మారి.. రాష్ట్రాన్ని ఆగమాగం చేస్తున్న వేళ.. ఇప్పుడు రెండు వాయుగుండాలతో ఏర్పడే పరిస్థితులు ఎలా ఉంటాయన్నది టెన్షన్ తెప్పిస్తోంది. బంగాళాఖాతంలో ఒక వాయుగుండం సాగుతుండగా.. మరొకటి ఏర్పడిన వైనంతో ఇప్పుడు ఎలాంటి పరిస్థతులు ఏర్పడతాయన్నది ఆందోళన కలిగించే అంశంగా చెప్పాలి. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక - భూమధ్య రేఖకు సమీపంలో ఒక అల్పపీడనం ఏర్పడగా.. మలక్కా జలసంధి సమీపంలోని తీవ్ర అల్పపీడటం మరో వాయుగుండటంగా మారింది. రాబోయే రోజుల్లో ఇవి మరింత బలపడతాయని భావిస్తున్నారు.

రెండు రోజుల్లో వీటి గమనం.. తీవ్రత మీద స్పష్టత వస్తుందని చెబుతున్నారు. శనివారం లేదంటే ఆదివారం నాటికి తమిళనాడు.. ఏపీ తీరాల వైపునకు వస్తుందని కొందరు వాతావరణ నిఫుణులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు వాయుగుండాల ప్రభావం ఏపీ.. తమిళనాడు మీద ఉంటుందని చెబుతున్నారు. ఈ వాయుగుండాల ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో శనివారం తర్వాత వర్షాలు పడతాయని చెబుతున్నారు.

శనివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న జిల్లాలు..

- ప్రకాశం

- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

- వైఎస్సార్ కడప

- అన్నమయ్య

- తిరుపతి

- చిత్తూరు

భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న జిల్లాలు

- శ్రీ సత్యసాయి

- నంద్యాల

- బాపట్ల

- పల్నాడు

- గుంటూరు

- క్రిష్ణా

- ఎన్టీఆర్

- ఏలూరు

- పశ్చిమ గోదావరి

ఇక.. ఏపీలోని మిగిలిన జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సముద్రంలో అధిక వేగంతో గాలులు వీచి.. అలజడిగా మారనున్న నేపథ్యంలో గురువారం నుంచి మత్య్సకారులు వేటకు వెళ్లరాదని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది. ఈ రెండు వాయుగుండాల ప్రభావం తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉంటుందని.. వాతావరణ పరిస్థితుల్లో మార్పులు ఉంటాయని చెబుతున్నారు.