గిరిజన ఓట్లు: టీడీపీ వర్సెస్ జనసేన ..!
రాష్ట్రంలో గిరిజన ఓటు బ్యాంకు 10-12 శాతం ఉంది. వాస్తవానికి పెద్దపార్టీలకు ఇది లెక్కలోకి రాదు.
By: Garuda Media | 11 Aug 2025 4:00 AM ISTరాష్ట్రంలో గిరిజన ఓటు బ్యాంకు 10-12 శాతం ఉంది. వాస్తవానికి పెద్దపార్టీలకు ఇది లెక్కలోకి రాదు. అయితే.. గిరిజనులు.. ప్రభావితమవుతారు. కేవలం గిరిజన ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లోనే కాకుండా.. ఇత ర జనరల్ నియోజకవర్గాల్లో ఉన్న ఎస్టీలు.. కూడా ప్రభావితం అవుతున్నారు. దీంతో వీరి ఓటు బ్యాంకును సొంతం చేసుకునేందుకు.. పార్టీలు, నాయకులు పోటీ పడుతున్నారు. నిన్నమొన్నటి వరకు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఈ ఓటు బ్యాంకును వైసీపీ దక్కించుకుంది.
గిరిజన నియోజకవర్గాల్లో వైసీపీ తమ పట్టును భారీగా పెంచుకుంది. 2014, 2019 ఎన్నికల్లో గిరిజన నియోజ కవర్గాల్లో వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించడానికి ఇదే కారణం. 2024లో కూటమి పార్టీల దూకుడుతో కొంత మేరకు ఈ హవా తగ్గింది. అయినప్పటికీ.. వైసీపీకి అనుకూలంగానే గిరిజన ప్రాంతాలు, నియోజ కవర్గాల్లో రాజకీయాలు సాగుతున్నాయి. దీనిని అడ్డుకునేందుకు కూటమి పార్టీల్లోని జనసేన వ్యూహాత్మకం గా అడుగులు వేసింది. మన్యం సహా.. పోలవరం వంటి గిరిజన నియోజవకర్గాలు, ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చింది.
మరీ ముఖ్యంగా గిరిజనులను తమవైపు తిప్పుకొనేందుకు.. పవన్ కల్యాణ్.. వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. వారికి చెప్పులు, మామిడికాయలు, చీరలు పంచడంతోపాటు.. నియోజకవర్గాల్లో రహదారులు కూడా నిర్మిస్తున్నారు. దీంతో జనసేన వైపు దాదాపు.. గిరిజన ఓటు బ్యాంకు మళ్లుతోందన్న చర్చ తెరమీదికి వచ్చింది. అయితే.. ఈ విషయంలో అలెర్ట్ కావాల్సినవైసీపీ మౌనంగా ఉంటే.. టీడీపీ పుంజుకునే ప్రయ త్నం చేస్తోంది. ఎంత కలివిడిగా ఉన్నా.. ఎంతగా కూటమిలో ఉన్నా.. ఎవరి రాజకీయం వారిదే. ఇప్పుడు అదే జరుగుతోందన్న చర్చ సాగుతోంది.
మన్యం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు.. గిరిజనులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం.. పార్టీ నాయకులతో ఆయన మాట్లాడుతూ.. పార్టీ పరంగా చేపడుతున్న కార్యక్రమాలను తెలుసుకున్నారు. వైసీపీ దూకుడుకు ఏమేరకు అడ్డుకట్ట వేస్తున్నారని ప్రశ్నించారు. అంతేకాదు.. ఎమ్మెల్యేను ఎందుకు ప్రశ్నించ లేక పోయారంటూ.. క్లాస్ ఇచ్చారు. ఈ పరిణామాలతో టీడీపీ నాయకులు అవాక్కయ్యారు. జనసేన నాయకులు తిరుగుతున్నారని చెప్పగా.. వారితోపాటు మీరు కూడా తిరగాలని.. చంద్రబాబు చెప్పారు. వారికి సమాంతరంగా రాజకీయాలు చేయాలని.. ఎక్కడా వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదన్నారు. సో.. దీంతో గిరిజనులపై అటు జనసేన, ఇటు టీడీపీ కూడా.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయని అర్ధమవుతోంది.
