Begin typing your search above and press return to search.

సచివాలయం కాదు-స్వర్ణ గ్రామం.. స్వర్ణ వార్డు

ఇదిలా ఉంటే ఇప్పటిదాకా గ్రామ, వార్డు సచివాలయాలుగా ఉన్న ఈ వ్యవస్థ పేరుని కూటమి ప్రభుత్వం మార్పు చేసింది.

By:  Satya P   |   5 March 2026 8:45 AM IST
సచివాలయం కాదు-స్వర్ణ గ్రామం.. స్వర్ణ వార్డు
X

ఏపీలో సచివాలయాలకు పేరు మార్చిన సంగతి తెలిసిందే. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులుగా వాటిని పిలుస్తున్నారు. ఆ మేరకు అసెంబ్లీలో తీర్మానం ఆమోదించారు. అలా మార్చిన తరువాత సిబ్బందికి నిజంగా మంచి వార్తనే ఏపీలోని కూటమి ప్రభుత్వం వినిపిస్తోంది. రానున్న రోజులలో స్వర్ణ గ్రామం, వార్డు కార్యాలయాల ఉద్యోగులందరికీ ప్రమోషన్లు కల్పిస్తామని ప్రభుత్వం చెబుతోంది. దాదాపుగా ఆరేళ్ళ నుంచి ఒకే పోస్టులో ఎదుగూ బొదుగూ లేని జీవితంతో గడుపుతున్న స్వర్ణ గ్రామం.. స్వర్ణ వార్డు సిబ్బందికి నిజంగా ఇది తీపి వార్త అని అంటున్నారు.

పనితీరు ప్రతిభతో :

స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాలలో పనిచే సిబ్బంది పనితీరు ప్రతిభను ఆధారంగా చేసుకుని ప్రమొషన్లు కల్పిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అంతే కాదు ఈ వ్యవస్థ ద్వారా మరింత చేరువగా ప్రజలకు సేవలు అందేలా చూస్తున్నామని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి చెప్పారు. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల ద్వారా స్వర్ణాంధ్ర సాధనకు కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు.

బిల్లుకు ఆమోదం :

ఇదిలా ఉంటే ఇప్పటిదాకా గ్రామ, వార్డు సచివాలయాలుగా ఉన్న ఈ వ్యవస్థ పేరుని కూటమి ప్రభుత్వం మార్పు చేసింది. దాంతో ఇక నుంచి స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాలుగా పిలవాలి. ఆ మేరకు పేరు మార్పు బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ఆమోదం సందర్భంగా శాసనమండలిలో మాట్లాడిన మంత్రి స్వామి స్వర్ణ గ్రామం, వార్డు కార్యాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని చెప్పారు. స్వర్ణ గ్రామం, వార్డు కార్యాలయాల్లో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

మూడంచెల వ్యవస్థగా :

అదే విధంగా స్వర్ణ గ్రామం, వార్డు కార్యాలయాలపై పర్యవేక్షణ కోసం మూడంచెల వ్యవస్థ తీసుకొచ్చామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో లోప భూయిష్టంగా ఉన్న వ్యవస్ధను కూటమి ప్రభత్వంలో పటిష్టంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి చెప్పడం విశేషం. అదే విధంగా కూటమి పాలనలో పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని అన్నారు. పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. అదే వైసిపి హయాంలో పంచాయతీ నిధులను దారిమల్లించారని విమర్శించారు.