Begin typing your search above and press return to search.

రేపు అన్ని స్కూళ్లకు సెలవు.. ఆంధ్రప్రదేశ్ లో ఈ జిల్లాల్లో హాలిడే ప్రకటించిన ప్రభుత్వం..!

ఆగస్టు నెల నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఏదో ఒక కారణం వల్ల సెలవులు వస్తూనే ఉన్నాయి.

By:  Priya Chowdhary Nuthalapti   |   30 Nov 2025 3:08 PM IST
రేపు అన్ని స్కూళ్లకు సెలవు.. ఆంధ్రప్రదేశ్ లో ఈ జిల్లాల్లో హాలిడే ప్రకటించిన ప్రభుత్వం..!
X

Schools holiday tomorrow

ఆగస్టు నెల నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఏదో ఒక కారణం వల్ల సెలవులు వస్తూనే ఉన్నాయి. ఆగస్టు నెల మొత్తం పండగల వల్ల సెలవులు రాగా.. సెప్టెంబర్ నెలలో వరదల వల్ల స్కూల్ పిల్లలకు ఎన్నో సెలవులు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ చలి కాలమైన నవంబర్, డిసెంబర్ నెలల్లో కూడా.. దిత్వా తుఫాన్ వల్ల మరిన్ని సెలవులు రానున్నాయి నైరుతి బంగాళాఖాతం నుంచి.. కొనసాగుతున్న దిత్వా తుపాను గడిచిన 6 గంటల్లో..1 గంటకు 10 కిమీ వేగంతో ఉత్తరం వైపుకు కదులుతుందని.. ఇప్పటికే విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ తుఫాను.. కారైకల్ కి 100 కిమీ, పుదుచ్చేరికి 2000 కిమీ, చెన్నైకి 300 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపారు.

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా పలు జిల్లాల్లో ఆదివారం, సోమవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడునున్నాయి. ఇందువల్ల కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్.. ప్రకటించడమే కాకుండా స్కూల్లకు కూడా సోమవారం సెలవులు ప్రకటించారు.

School holiday in Tirupati

ముఖ్యంగా చెన్నైకి అతి దగ్గరైన తిరుపతి జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు పడునున్న కారణంగా.. తిరుపతిలోని అన్ని స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించనుంది. అంతేకాకుండా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కూడా స్కూళ్లకు కాలేజీలకు సెలవులు ఉందనున్నాయి. ఈ మూడు జిల్లాలు కూడా చెన్నై అలానే పాండిచ్చేరికి అతి దగ్గర జిల్లాలు కావడంతో.. వీటిపై వరద ఎఫెక్ట్ ఎక్కువగా ఉండనుంది.

ఇక గాలులు కూడా ఎక్కువగా వీచే అవకాశం ఉండడంతో పిల్లల రక్షణ అలానే వారి ఆరోగ్యపట్ల శ్రద్ధ వల్ల.. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.