Begin typing your search above and press return to search.

బడి గంట మోగింది...సెలవులు చాలంది !

బడి గంట గణగణ మోగింది. దాదాపుగా యాభై రోజులకు పైగా సెలవులతో ఎంజాయ్ చేసిన విద్యార్థినీ విధ్యార్ధులు ఇక బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని బడి వైపు వేగంగా పరుగులు తీయాల్సిన సమయం ఆసన్నమైంది.

By:  Satya P   |   12 Jun 2026 5:00 AM IST
బడి గంట మోగింది...సెలవులు చాలంది !
X

బడి గంట గణగణ మోగింది. దాదాపుగా యాభై రోజులకు పైగా సెలవులతో ఎంజాయ్ చేసిన విద్యార్థినీ విధ్యార్ధులు ఇక బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని బడి వైపు వేగంగా పరుగులు తీయాల్సిన సమయం ఆసన్నమైంది. ఒకటి నుంచి పదవ తరగతి విధ్యార్ధినీ విద్యార్థులు అంతా బడులకు రావాల్సిందే. జూన్ 12 నుంచి యధా ప్రకారం పాఠశాలలు మొదలవుతున్నాయి. ఏప్రిల్ 23 చివరి వర్కింగ్ డేగా గత విద్యా సంవత్సరం ముగిసింది. ఆనాటి నుంచి జూన్ 11 వరకూ సెలవులను రాష్ట్ర విద్యా శాఖ మంజూరు చేసింది. ఇక కొత్త ఏడాదికి శుభారంభం పలుకుతూ షెడ్యూల్ ని రిలీజ్ చేసింది.

మొత్తం 229 పని దినాలుగా :

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యా క్యాలెండర్‌ను తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం పాఠశాలల్లో 229 పనిదినాలు ఉంటాయి. అలాగే 87 ప్రభుత్వ సెలవులు ఉంటాయి. ఇక శనివారాలు తప్పనిసరిగా నో బ్యాగ్ డేస్ గా పరిగణించాల్సి ఉంటుందని విద్యా శాఖ పేర్కొంది. ఏపీలోని పాఠశాలలకు ముఖ్యమైన సెలవు దినాలుగా చూస్తే కనుక దసరా సెలవులు ఈసారి అక్టోబర్ 12 నుండి అక్టోబర్ 21 వరకూ ఉండబోతున్నాయి. అలాగే సంక్రాంతి సెలవులు 2027 జనవరి 11 నుండి జనవరి 17 వరకూ ఉంటాయి. ఎస్ ఏ వన్ పరీక్షలు నవంబర్ 9 నుండి నవంబర్ 20, 2026 వరకూ ఉంటే ఎస్ ఏ 2 పరీక్షలు ఒకటి నుంచి ఎనిమిది తరగతి విద్యార్ధులకు 2027 ఏప్రిల్ 3 నుండి ఏప్రిల్ 17, 2027 వరకూ ఉంటాయి. ఇక పదవ తరగతి బోర్డు పరీక్షలు 2027 మార్చి 15 నుండి మార్చి 31 వరకూ నిర్వహిస్తున్నారు.

ఎండలు ఉండగానే :

ఇదిలా ఉంటే ఏపీలో ఇంకా ఎండలు మండుతున్నాయి. వేసవి ధాటి తగ్గడం లేదు. నైరుతి రుతు పవనాలు కాస్తా ఆలస్యంగా ప్రవేశించినా ఇంకా పూర్తి స్థాయిలో విస్తరించుకోలేదు. దాంతో పాటుగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఏపీలో ఉన్నాయి. కురిస్తే భారీ వానలు లేకపోతే నెత్తి మండించే ఎండలుగా వాతావరణం ఉంది. దాంతో కాస్తా ఎండలు ఉండగానే బడికి పిల్లలు వెళ్ళడం అన్నది ఇబ్బందికరమే అయినా అకడమిక్ క్యాలెండర్ దెబ్బ తినకుండా షెడ్యూల్ ని రిలీజ్ చేశారు. తప్పనిసరిగా పాఠశాలలు తెరచుకుంటున్నాయి. విద్యార్ధులు అంతా వెళ్లాల్సిందే అని అంటున్నారు. బడికి వెళ్ళే పిల్లలతో ఇక మీదట బిజీ లైఫ్ కొత్త టర్న్ తీసుకోనుంది. అది ప్రతీ ఇంటి నుంచి మొదలు కానుంది. అదే సమయంలో కొత్త విద్యా సంత్సవరంలో మరింత ఎక్కువగా విద్యా ప్రమాణాల మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి పనిచేస్తోంది.