కొత్త రూట్లలో ఏపీ రియల్ బూమ్ ...రిజల్ట్ అనూహ్యం
రియల్ ఎస్టేట్ రంగం ఎంత బాగా విస్తరిస్తే అంత పెద్ద ఎత్తున ఆదాయం పెరుగుతుంది. అది ఖజానాకు చేరి సంపన్న రాష్ట్రంగా ఒక స్టేట్ మారేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.
By: Satya P | 10 Nov 2025 9:53 AM ISTరియల్ ఎస్టేట్ రంగం ఎంత బాగా విస్తరిస్తే అంత పెద్ద ఎత్తున ఆదాయం పెరుగుతుంది. అది ఖజానాకు చేరి సంపన్న రాష్ట్రంగా ఒక స్టేట్ మారేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. అంతే కాదు నిర్మాణ రంగం ఎక్కడ ఊపు అందుకుంటుందో అక్కడ ఉపాధితో పాటు అనేక రంగాలు కూడా విస్తరిస్తాయి. ఇపుడు ఏపీలో రియల్ ఎస్టేట్ రంగం కొత్త దారుల వెంట పరుగులు తీస్తూ అనూహ్యంగా ముందుకు సాగుతోంది.
బలమైన అడుగులు :
విభజన తరువాత ఏపీ కొత్త రాష్ట్రం కిందనే లెక్క. ఎందుకంటే రాజధాని సైతం లేని స్థితిలో ఏపీ విడిపోయింది. ఒక్క మాటలో చెప్పాలీ అంటే ఏపీ మొదటి నుంచి తన ప్రయాణం ప్రారంభించింది అన్న మాట. ఈ నేపధ్యంలో ఒక్కో ఇటుకా పేర్చుకుంటూ ఏపీ నెమ్మదిగా అడుగులు వేస్తోంది. 2014 నుంచి 2019 దాకా ఏపీ ప్రణాళిక కాగితాల మీద ఉంది, కొంత నేల మీదకు వచ్చేలోగా సర్కార్ దిగిపోయింది. 2019 నుంచి 2024 మధ్య అది కొంత మందగించినా తిరిగి 2024 నుంచి గట్టిగా పుంజుకుంది. దానికి కారణం కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉండడమే కాదు, కేంద్రం నుంచి ఈసారి రాష్ట్రానికి సహకారం బాగానే అందుతోంది. అదే సమయంలో సరైన ప్లాన్స్ తో ఏపీలో కూటమి ప్రభుత్వం కూడా దానిని అందుకుంటూ మాస్టర్ ప్లాన్స్ ని డిజైన్ చేస్తోంది.
రియల్ ఎస్టేట్ రంగంలో :
ఇక ఏపీలో అమరావతి రాజధాని పెద్ద ఎత్తున నిర్మాణం సాగుతోంది. మరో వైపు ఆ రాజధానిని ఆనుకుని అనేక జాతీయ రహదారులు సైతం వస్తున్నాయి. కేంద్రం సైతం ఏపీకి మౌలిక సదుపాయాల కల్పనలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోనిద్. దాంతో మూలన ఒకప్పుడు ఉన్న ప్రాంతాలు ఇపుడు నడి మధ్యకు వస్తున్నాయి. అలా చూస్తే కనుక విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారి నిర్మాణం ఒక పెద్ద మలుపుగా అంతా చూస్తున్నారు. ఈ జాతీయ రహదారిని ఆరు వరసలుగా నిర్మించాలని ప్రభుత్వాలు భావించడంతో ఒక్కసారిగా ఈ ప్రాంతానికి మహర్దశ పట్టనుంది.
లాజిస్టిక్స్ హగ్ గా :
ఏపీలో కీలక ప్రాంతాలు అన్నింటినీ కలుపుతూ లాజిస్టి హబ్ గా మార్చే బృహత్తర ప్రయత్నం సాగుతోంది. ఏపీ నుంచి ఎక్కడికైనా అలాగే అనేక ప్రాంతాలు రాష్ట్రంలోని అనేక మూలల నుంచి ప్రధాన స్రవంతిలోకి వస్తున్నాయి. ఈ పరిణామ క్రమంలో కొత్త ప్రాంతాలలో రియల్ బూమ్ వికసితోంది. పెద్ద ఎత్తున దూకుడు చేస్తోంది. అలా చూస్తే కనుక విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారి విస్తరణ ఇపుడు మచిలీపట్నానికి కొత్త అదృష్టాలు తీసుకుని రాబోతోంది అని చెప్పక తప్పదు. ఈ పరిణామం వల్ల విజయవాడలోని శివారు ప్రాంతాలు అలాగే మారుమూల ప్రాంతాలు సైతం రియల్ ఎస్టేట్ దూకుడు చేయనున్నాయని అంచనా వేస్తున్నారు.
ఓవర్ నైట్ లోనే :
ముందు దారి ఏర్పడితే ఆనక వచ్చేవన్నీ అలా వరస క్రమంలో వచ్చేస్తాయి. అల పరిశ్రమలు వాణిజ్యం, వ్యాపారం అన్నీ క్యూ కడితే మారు మూల ప్రాంతాలే మెయిన్ స్ట్రీమ్ లోకి వచ్చి డెవలప్మెంట్ కి కొత్త అర్ధాలు చెబుతాయని అంటున్నారు. మౌలిక సదుపాయాల మీద ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని పెట్టడానికి సైతం కారణం ఇదే అని అంటున్నారు దీని వల్ల వాహనాల రాకపోకలు పెరుగుతాయి. ఫ్లోటింగ్ పాపులేషన్ వస్తుంది. ఆ మీద ఆకాశమే హద్దుగా బిజినెస్ మొదలవుతుంది. ఇలా రియల్ బూం ఎక్కడికో పోతుంది అన్నది అభివృద్ధి గురించి విశ్లేషించేవారి సరైన అంచనాగా ఉంది.
రాత మార్చేస్తుందా :
ఒక్క నేషనల్ రోడ్ ప్రాజెక్ట్ విజయవాడ శివారు ప్రాంతాలతో పాటు మచిలీపట్నంలోని కీలక ప్రాంతాల దశ మారుస్తుంది అని అంటున్నారు. ఇక్కడ రానున్న కాలంలో భారీ ఎత్తున అపార్ట్మెంట్స్ అలాగే నివాస ప్రాంతాలు అదే విధంగా విల్లాలు, వ్యాపార వాణిజ్య హబ్ లు అన్నీ వెలసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. వీటిని ముందే ఊహిస్తున్న వారు భూములను జాగ్రత్త పరచుకుంటున్నారు. ఎందుకంటే ఈ భూములకే అతి తక్కువ టైం లో రెక్కలు రాబోతున్నాయి. నిన్నటిదాకా మధ్యతరగతి వర్గాలుగా ఉండే వారు రానున్న కాలంలో అపర కోటీశ్వరులుగా మారే చాన్స్ అయితే కచ్చితంగా ఉంది అన్నది ఒక విశ్లేషణ.
