డామినేషన్ రూట్‌లో డమ్మీలవుతున్న మినిస్టర్లు!
వైసీపీ హయాంలో అయితే.. మంత్రి పోస్టు ఒక ముచ్చట మాత్రమే. దీనికి ప్రత్యేకంగా వాల్యూ ఎడిషన్ ఏమీ జోడించలేదు.
By: Garuda Media | 9 Aug 2025 6:00 AM IST''నేను మంత్రిని. నేను చెప్పిందే వేదం. మీరంతా నామాట వినాల్సిందే.''మంత్రిగారు వస్తున్నారు. అలెర్టుగా ఉండండి. ఏ చిన్న పొరపాటు జరిగినా.. తిప్పలు తప్పవు''- ఇదీ.. ఒకప్పుడు ఏపీలో వినిపించిన మాట. అంటే.. మంత్రులకు ఎంత గౌరవం ఉందో ఈ కామెంట్లు రుజువు చేస్తున్నాయి. సో.. మంత్రి అంటే.. ఓ రేంజ్, ఓ విధానం ఉండేది. అన్నగారు ఎన్టీఆర్ హయాంలో అయితే.. ఎవరైనా ఆయనను కలుసుకునేం దుకు వస్తే.. ''మీ మంత్రిగారిని కలిసి వచ్చారా?!'' అని ఎమ్మెల్యేలను ప్రశ్నించేవారు.
అంటే.. సదరు జిల్లాకు చెందిన మంత్రిని అన్నగారు హైలెట్ చేసేవారు. బాధ్యతగా ఉండాలని పరోక్షంగా చెప్పేవారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు మధ్య ఒక బాండింగును ఏర్పరిచేవారు. ఇది మంచి ఫలితాన్ని ఇచ్చింది. 'మంత్రి' పదవులకు ఒక సమున్నత గౌరవాన్ని, విలువను కూడా జోడించింది. అంతేకాదు.. మంత్రి పదవి కోసం పోటీ కూడా పెరిగేలా చేసింది. అయితే.. రాను రాను ఈ విధానం మారిపోయింది.. సెంటర్ పాలిటిక్స్(కేంద్రీకృత రాజకీయం) పెరిగిపోయింది. అంటే.. మంత్రులను డమ్మీ చేయడం.. ప్రారంభమైంది.
దీనికి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు.. ప్రాణం పోశారని అంటారు. మంత్రులను మించి.. కొందరు నా యకులను ఆయన తనకు పర్సనల్‌గా నియమించుకునేవారు. తద్వారా.. ఎమ్మెల్యేలు.. ఈ నేతల దృష్టికి తమ సమస్యలు తీసుకువస్తే.. చాలు .అనే ధోరణి పెరిగింది. ఇలా ఎదిగిన నాయకుడే కేవీపీ రామచంద్ర రావు. 'అన్నీ ఆయనే చూసుకునే వారు.' అనే మాట ఇప్పటికీ వినిపిస్తుంది. ఇక, ఆ తర్వాత.. చంద్రబాబు హయంలో మంత్రుల తీరు మరో ముచ్చటగా మారింది. అన్నీ సీఎంకే చెప్పాలి.. అనే ధోరణి వచ్చింది. మంత్రులు ఉన్నా.. వారి వారి శాఖలకు పరిమితమయ్యారు.
వైసీపీ హయాంలో అయితే.. మంత్రి పోస్టు ఒక ముచ్చట మాత్రమే. దీనికి ప్రత్యేకంగా వాల్యూ ఎడిషన్ ఏమీ జోడించలేదు. ''మా మంత్రికి చెప్పినా.. ఒక్కటే.. చెప్పక పోయినా ఒక్కటే'' అనే మాట పెరిగిపోయింది. దీనికి కారణం.. ఆధిపత్య రాజకీయం. మంత్రులుగా ఉన్న వారు.. కలివిడిపోయి.. ఆధిపత్యానికి తెరదీసిన ఫలితంగా.. అసలు ఎవరికీ అధికారం లేకుండా.. మొత్తానికే కత్తిరించేసిన పరిస్థితి అప్పట్లో కనిపించింది. ఇక, ఇప్పుడు పరిస్థితి మరింత భిన్నం.
అసలు మంత్రులను ఎమ్మెల్యేలు ఎవరూ లెక్క చేయడం లేదన్నది తెలుస్తూనే ఉంది. పైగా.. మంత్రుల తోనే విభేదించి.. వారి ముందే.. గొడవలు పడుతున్న నాయకులు కూడా పెరుగుతున్నారు. మంత్రైతే.. ఏంటి? అనే బెదిరింపు ధోరణి కూడా కనిపిస్తోంది. అయితే.. ఇది సరికాదన్నది అందరికీ తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు, ఇంచార్జ్‌లుగా ఉన్న జిల్లాల పరిస్థితిని ఆయన నిశితంగా గమనిస్తున్నారు. మంత్రులకు వాల్యూ పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. అయితే.. ఈ మార్పు రెండు పక్షాల నుంచి ప్రారంభం కావాల్సి ఉంది.
