Begin typing your search above and press return to search.

బ్యాలెట్‌ తోనే ఏపీ లోక‌ల్ వార్‌... నేత‌ల‌కు మేలు ఎంత‌...?

వ‌చ్చే రెండు మాసాల్లో రాష్ట్రంలో స్థానిక ఎన్నిక‌ల‌కు శ్రీకారం చుట్ట‌నున్నారు. ప్ర‌స్తుతానికి క్షేత్ర‌స్థాయిలో అన్నీ రెడీ చేసుకుంటున్నారు.

By:  Garuda Media   |   17 Aug 2026 7:00 AM IST
బ్యాలెట్‌ తోనే ఏపీ లోక‌ల్ వార్‌... నేత‌ల‌కు మేలు ఎంత‌...?
X

వ‌చ్చే రెండు మాసాల్లో రాష్ట్రంలో స్థానిక ఎన్నిక‌ల‌కు శ్రీకారం చుట్ట‌నున్నారు. ప్ర‌స్తుతానికి క్షేత్ర‌స్థాయిలో అన్నీ రెడీ చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా బ్యాలెట్ పేప‌ర్ విధానంలోనే స్థానిక ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ఎన్నిక‌ల సంఘం దాదాపు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చేసింది. తొలుత ఈవీఎంలు అనుకున్నా.. ఆ మేర‌కు ఈవీఎంలు సిద్ధంగా లేక‌పోవ‌డంతో బ్యాలెట్‌వైపు మొగ్గు చూపింది. ఇక‌, ఈవీఎంల‌కు, బ్యాలెట్‌కు మ‌ధ్య చాలానే తేడా ఉంటుంది. ఈవీఎంలు భాగోద్వేగాన్ని ఓటుగా మార్చుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ, బ్యాలెట్ అలాకాదు.

ఓట‌రు అన్నీ ఆచి తూచి ఓటేస్తాడు. సో.. ఇప్పుడు స్థానిక ఎన్నిక‌ల్లో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ మ‌ధ్య బ‌ల‌మైన పోటీ ఉన్న నేప‌థ్యంలో ఏ పార్టీకి మేలు జ‌రుగుతుంది? బ్యాలెట్ విధానాన్ని పాటించాల‌ని కోరుతున్న వైసీపీ ఏమేర‌కు ఈ విష యంలో స‌క్సెస్ అవుతుంద‌న్న‌ది ప్ర‌ధాన చ‌ర్చ‌గా మారింది. ఇక‌, పార్టీల‌ప‌రంగా చూసుకుంటే.. సంక్షేమాన్ని మాత్ర‌మే న‌మ్ముకున్న వైసీపీ ఒక‌వైపు ఉండ‌గా.. సంక్షేమంతోపాటు అభివృద్ధి, పెట్టుబ‌డులు, ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు అనేనాలుగు అంశాల‌ను టీడీపీ కూట‌మి పార్టీలు న‌మ్ముకున్నాయి.

ఈ నేప‌థ్యానికి తోడు గ్రామీణ ప్రాంతాల్లో జ‌రుగుతున్న అభివృద్ధి కూడా స్థానిక ఎన్నిక‌ల‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేయ‌నుంద‌న్న‌చ‌ర్చ సాగుతోంది. ఇలా.. అన్ని కోణాల‌ను ప‌రిశీలిస్తే.. బ్యాలెట్ ద్వారా ఎన్నిక‌లు జ‌రిగినా.. వైసీపీకి ఆశిస్తున్న విజ‌యం ద‌క్కే అవ‌కాశం లేక‌పోవ‌చ్చు. క్షేత్ర‌స్థాయి అభివృద్ధికి ప్ర‌జ‌లు మొగ్గు చూపుతార‌న్న చ‌ర్చ ఉంది. ఇక‌, కూట‌మి పార్టీల విష‌యానికి వ‌స్తే.. రెండున్న‌రేళ్ల పాల‌న ప్ర‌భావం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. దీనికితోడు బ‌ల‌మైన నాయ‌క‌త్వం కూడా కూట‌మికి ఉండ‌డం క‌లిసి వ‌స్తున్న అంశాలుగా ప్ర‌చారంలో ఉన్నాయి.

మ‌రీ ముఖ్యంగా చంద్ర‌బాబు నాయ‌క‌త్వం, డిప్యూటీ సీఎంగా ప‌వ‌న్ వేస్తున్న అడుగులు.. కూట‌మి పార్టీల మ‌ధ్య ఉన్నత స్థాయిలో క‌నిపిస్తున్న ఐక్య‌త వంటివి స్థానిక ఎన్నిక‌ల్లోనూ ప్ర‌తిబింబించే అవ‌కాశం ఉంద‌ని స్ప‌ష్ట‌మ‌వు తోంది. సో.. బ్యాలెట్ ద్వారా జ‌రిగినంత మాత్రాన వైసీపీకి పెద్ద‌గా ప్ర‌యోజ‌నం క‌నిపిస్తుంద‌న్న అంచ‌నాలు అయితే.. త‌క్కువ‌గానే ఉన్నాయి. అందుకే.. ఎన్నిక‌ల క‌మిష‌న్ ప్ర‌తిపాద‌న విష‌యంలోప్ర‌భుత్వం సైలెంట్ అయింది. త‌ద్వారా బ్యాలెట్ విజ‌యం త‌మ‌కు మ‌రింత బూస్ట్ ఇస్తుంద‌ని.. కూడా నాయ‌కులు అంచ‌నా వేస్తున్నారు.