ముహూర్తం ఫిక్స్... ఏపీలో మరో బిగ్ ఫైట్ !
ఏపీలో మళ్ళీ రాజకీయ సమరం మొదలవనుంది. అతి పెద్ద రాజకీయ యుద్ధానికి రంగం సిద్ధం అవుతోంది.
By: Satya P | 27 July 2026 9:29 PM ISTఏపీలో మళ్ళీ రాజకీయ సమరం మొదలవనుంది. అతి పెద్ద రాజకీయ యుద్ధానికి రంగం సిద్ధం అవుతోంది. 2024 మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల తరువాత దాదాపుగా రెండున్నరేళ్ల అనంతరం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. దీని కోసం ముహూర్తం ఫిక్స్ చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. అన్నీ అనుకూలిస్తే దీని మీద తొందరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని అంటున్నారు.
ముందు మునిసిపోల్స్ :
ఇక సెప్టెంబర్ రెండో వారంలో మునిసిపల్ ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది అని అంటున్నారు. ఆ తరువాత దశలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారని అంటున్నారు. ఈ మొత్తం స్థానిక ఎన్నికల వ్యవహారం అంతా నలభై రోజుల వ్యవధిలో పూర్తి చేసేందుకు కూడా ప్రభుత్వం రూట్ మ్యాప్ ని సిద్ధం చేసింది అని అంటున్నారు. దీని మీద ఎన్నికల షెడ్యూల్ తొందరలోనే వెలువడుతుందని అంటున్నారు.
వాటన్నింటికీ ఒకేసారి :
ఏపీలో మొత్తం 17 కార్పోరేషన్లు అలాగే 108 మునిసిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. సెప్టెంబర్ రెండవ వారంలో వీటిని నిర్వహిస్తారు. దీంతో పాటుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు అలాగే ఎన్నికలు ఉంటాయని అంటునారు. ఇలా పట్టణాలతో పాటుగా మండల జిల్లా పరిషత్తు ఎన్నికలు సమాంతరంగా సాగుతాయని చెబుతున్నారు. అలా మునిసిపాలిటీలు కార్పోరేషన్లకు జెడ్పీలకు మండల పరిషత్తులకు పాలక వర్గాలు ఏర్పాటు అయ్యాయి. వీటిని పూర్తి చేసిన తరువాత ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పంచాయతీ ఎన్నికలు కూడా పెడతారు అని అంటున్నారు.
పల్లెల్లో తీర్పు కోసం :
ఇక ఆ మీదట అక్టోబర్ రెండో వారంలో పంచాయతీ ఎన్నికలు ఉంటాయని చెబుతున్నారు. అంటే రాష్ట్రవ్యాప్తంగా వేలాదిగా ఉన్న పంచాయతీలకు సర్పంచులు వార్డు మెంబర్లకు ఎన్నికలు అన్న మాట. ఆ విధంగా మొత్తం ప్రక్రియను ముగించేయడం ద్వారా రాష్ట్రంలో విజయదశమి నాటికి స్థానిక పరిపాలన మొదలెట్టడం ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది ఆ విధంగా స్థానిక సంస్థలు అన్నీ కూడా కళకళలాడతాయని అంటున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. అన్ని ఎన్నికలను తొందరగానే నిర్వహించాలని సజావుగా సాగేలా చూడాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే సెప్టెంబర్ అక్టోబర్ నెలలు మంచి సీజన్ గా భావిస్తోంది. పైగా కూటమి ప్రభుత్వం పనితీరు మీద జనాభిప్రాయం కూడా ఈ విధంగా వెల్లది అవుతుందని కూడా అంచనా వేస్తోంది. మొత్తం మీద చూస్తే ఏపీలో స్థానిక ఎన్నికల నగరా మోగాలి కానీ ఆ సందడి వేరే లెవెల్ లో ఉంటుందని అంటున్నారు.
