మందుబాబులకు బిగ్ షాక్.....కిక్ దిగాల్సిందేనా !
సంక్రాంతి పండుగ అంటే మందు మాంసం ఆ మీదట పందేలూ వినోదం అన్నీ ఉంటాయి. ఇక తాగిన వాడికి తాగినంత అన్నట్లుగా పరిస్థితి ఉంటుంది.
By: Satya P | 13 Jan 2026 9:21 AM ISTసంక్రాంతి పండుగ అంటే మందు మాంసం ఆ మీదట పందేలూ వినోదం అన్నీ ఉంటాయి. ఇక తాగిన వాడికి తాగినంత అన్నట్లుగా పరిస్థితి ఉంటుంది. మందేసి చిందేస్తారు. ఫూటుగా పుచ్చుకుంటారు. అలాంటి వారికి ఏపీ ప్రభుత్వం ఒక బిగ్ షాక్ ఇచ్చేసింది. కొన్ని రకలైన మందు బాటిళ్ళ మీద ప్రభుత్వం అదనంగా పది రూపాయలు ఒక్కో బాటిల్ కి వంతున పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
వీటి రేట్లు పెరుగుతాయి :
ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల మేరకు చూస్తే కనుక అన్ని రకాల సైజులతో కూడిన మందు బాటిళ్ళ మీద పది రూపాయలు దాకా ఒక్కో దాని మీద రేట్లు పెరుగుతాయి అని చెబుతున్నారు. దీంతో తాగే మందు మీద ఒక్క బాటిల్ కి పది రూపాయలు అంటే అక్కడికి మందు కిక్కు దిగిపోయినట్లే అని అంటున్నారు. అయితే ఇందులో కూడా కొంత శాతం ఊరటను కలిగించేలా నిర్ణయం తీసుకుఇంది. 180 మిల్లీ లీటర్ల మందు బాటిల్ కి దీని నుంచి సడలింపు ఉంది. వీటి ధర 99 రూపాయలు అలాగే కొనసాగుతుంది. అదే విధంగా దేశంలో తయారు చేసే విఒదేశీ లిక్కర్ బాటిళ్ళ మీద బీరు, వైన్, ఆర్టీడీలకు కూడా ఈ రేట్లు వర్తించవు అని పేర్కొంది.
బార్ల విషయంలో :
అదే విధంగా ఏపీలో నిర్వహిస్తున్న బార్ల విషయంలోనూ ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వాటి మీద ఇప్పటిదాకా విధిస్తున్న అదనపు ఏఆర్ఈటీని తొలగిస్తూ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక రిటైలర్ మార్జిన్ ని అయితే దాదాపుగా ఒక శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు దానిని కూడా ఉత్తర్వులలో పేర్కొన్నారు. అయితే ఏపీలో మందు బాబులకు మాత్రం రేటు పెరగడం ఏ మాత్రం రుచించదు అని అంటున్నారు. కానీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనక అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.
ఆర్ధికంగా ఆదాయం :
ఈ పెంపు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా ప్రతీ ఏటా ఒక వేయి 391 కోట్ల రూపాయల దాకా ఆదాయం వస్తుందని చెబుతున్నారు. ఒక బార్ల విషయంలో తీసుకున్న నిర్ణయం వల్ల యూనీఫారం పాలసీ వస్తుందని దాంతో బార్లలో మద్యం షాపులలో కూడా లిక్కర్ బాటిల్ రేట్లు ఒకే విధంగా ఉంటాయని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. మొత్తానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మద్యం ప్రియులకే తప్ప ఎవరికీ ఇబ్బంది లేదని అంటున్నారు.
