'అతి' మంచిదేనా? కూటమిలో చర్చ!
కట్ చేస్తే.. ఇప్పుడు నాటికి భిన్నంగా పాలసీని తీసుకువచ్చారు. నాసిరకం మద్యం లేదు. బ్రాండెడ్ మద్యం అమ్ముతున్నారు.
By: Garuda Media | 8 Aug 2025 7:56 PM ISTఏదైనా సరే.. అతిగా చేయడం మంచిది కాదు. ఒక విధానాన్ని తీసుకునేప్పుడు.. నలువైపులా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే.. అది అతిగా మారి.. చివరకు బ్యాడయ్యే పరిస్థితి వస్తుంది. ముందు ఇది చాలా బాగుందని అన్నవారే.. తర్వాత విమర్శలు గుప్పిస్తారు. ఈ విషయంలో ప్రభుత్వ అధినేతగా ఉన్న నాయకుడు జాగ్రత్త పడాలి. ప్రస్తుతం ఏపీలో అమలవుతున్న మద్యం విధానంపై పెద్ద ఎత్తున చర్చసాగుతోంది. గతంలో వైసీపీ హయాంలో ఒక విధమైన చర్చ సాగితే.. దీనికి పూర్తి భిన్నంగా ఇప్పుడు చర్చ ఉంది.
వైసీపీ హయాంలో నాసిరకం మద్యాన్ని భారీ రేట్లకు విక్రయించారు. పైగా పేరున్న బ్రాండ్లను ఎత్తేశారు. సామాన్యులకు దక్కకుండా చేశారు. దీంతో మందుబాబులు సహజంగానే వైసీపీపై అక్కసు పెంచుకున్నా రు. సర్కారును కూల్చేశారు. పైగా చాలా కుటుంబాల్లోని మందుబాబులు అనారోగ్యం పాలవడం కూడా.. అప్పట్లో వైసీపీకి మెరుపు వ్యతిరేకతను తీసుకువచ్చింది. దీని నుంచి పాఠాలు నేర్వని జగన్.. తనదైన మొండితనంతోనే ముందుకు సాగారు. ఫలితంగా సర్కారు కుప్పకూలింది.
కట్ చేస్తే.. ఇప్పుడు నాటికి భిన్నంగా పాలసీని తీసుకువచ్చారు. నాసిరకం మద్యం లేదు. బ్రాండెడ్ మ ద్యం అమ్ముతున్నారు. అదేసమయంలో ఒకప్పుడు ఎమ్మార్పీపై 10-50 వరకు వసూలు చేసేవారు. కానీ, ఇప్పుడు అది కూడా లేకుండా చేశారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, కొత్త మద్యం పాలసీ పేరుతో 57 వేల ఇళ్లకు ఒక బార్, రెండు వైన్ షాపులు.. ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడంపై మధ్యతర గతి వర్గాల్లో వ్యతిరేకతను పెంచేలా ఉంది. అంతేకాదు.. ప్రస్తుతం బార్లకు ఉన్న సమయాన్ని మరో రెండు గంటలు పెంచారు.
నిజం చెప్పాలంటే.. ప్రస్తుతం రాష్ట్రంలో వైన్సుకు, బార్లకు అధికారికంగా సమయం ఉన్నప్పటికీ.. అనధి కారికంగా మాత్రం అవి 24 గంటలూ పనిచేస్తున్నాయి. ఇది సాధారణ ప్రజల్లో కొంత వ్యతిరేకతను పెంచే అవకాశం ఉంది. వైసీపీ విధానాలను తీసేసి... మందు బాబులకు స్వేచ్ఛ ఇవ్వడం మంచిదేనని ప్రభు త్వం భావిస్తున్నా.. కొన్ని కోట్ల కుటుంబాలపై దీని ప్రభావం పడుతుంది. నిరంతరాయంగా మందు అందుబాటులో ఉండడం సమంజసం కాదన్నది నిపుణులు కూడా చెబుతున్నారు.
బార్లను ఉదయం ఒక గంట ముందే అంటే.. 9 గంటలకే తెరుచుకునేలా.. రాత్రికి 12 గంటల వరకు కూడా అధికారిక అనుమతి ఇవ్వడాన్ని వారు తప్పుబడుతున్నారు. వీటికి తోడు బెల్టు షాపులు కూడా పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఒకరకంగా చెప్పాలంటే.. తాగేందుకు నీరు దొరకని ప్రాంతాల్లో కూడా.. మందు దొరుకుతోందన్న కామెంట్లు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. ఇలా.. మద్యం విషయంలో అతిగా వ్యవహరిస్తుండడం సరికాదన్నది మెజారిటీ వర్గాల నుంచి వస్తున్న అభిప్రాయం.
