సామాన్యుల వెతలు: ఆ తప్పులే జరుగుతున్నాయా ..!
వైసీపీ పాలనలో జరిగిన తప్పులు సరిచేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అప్పటి తప్పులు ఇప్పుడు జరగకుండా చూస్తున్నామని వ్యాఖ్యానిస్తోంది.
By: Garuda Media | 19 Oct 2025 8:00 PM ISTవైసీపీ పాలనలో జరిగిన తప్పులు సరిచేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అప్పటి తప్పులు ఇప్పుడు జరగకుండా చూస్తున్నామని వ్యాఖ్యానిస్తోంది. ఈ విషయంలో సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నా రు. అంతేకాదు.. గత తప్పులు పునరావృతం కాకుండా కూడా చూస్తున్నామని అంటున్నారు. కానీ, ఏమాట కు ఆమాట చెప్పాల్సి వస్తే.. గత తప్పులే ఇప్పుడు కూడా జరుగుతున్నాయన్నది సామాన్యులు చెబుతు న్న మాట. ప్రజల నుంచి అనేక విషయాల్లో ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్న సర్కారుకు ఈ వ్యవహారం బోధపడాల్సిన అవసరం ఉంది.
ప్రధానంగా మూడు విషయాల్లో ప్రజలు ముఖ్యంగా సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
1) పోలీసులు అందుబాటలో ఉండకపోవడం: సాధారణంగానే పోలీసులు సామాన్యులకు అందుబాటులో ఉండరు. ఇది గత ప్రభుత్వంలోనూ తీవ్ర ఇబ్బందిగా మారింది. ఇక, ఇప్పుడు సిట్‌ల పేరుతో ప్రతి విషయంలోనూ ప్రత్యక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో సాధారణ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు పోలీసులకు సమయం చిక్కడం లేదు. దీంతో స్టేషన్లకు వెళ్లిన ప్రజలకు నిరాశే ఎదురవుతోంది. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది
2) సామాన్యులకు ప్రభుత్వ బాసట: గతంలో వలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు ప్రజలకు ఏ చిన్న అవసరం ఏర్పడినా.. వారు తమ సమస్యలను వలంటీర్లకు చెప్పుకొనేవారు. ఫలితంగా ప్రజలకు ప్రభుత్వం తమతో నే ఉందన్న బావన ఉంది. కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎమ్మెల్యేల కార్యాలయాలకు వెళ్తున్నా.. వారికి ఊరట లభించడం లేదు. పనులు కావడమూ లేదు. ఈ పరిస్థితిపై మానిటరింగ్ చేసేవారు కూడా కరువ య్యారు. దీంతో సామాన్యులు తమ సమస్యలు చెప్పుకొనేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
3) ప్రతి పనికీ..: ఔను! ఇది వాస్తవం. టీడీపీ సానుభూతిపరులు కూడా చేస్తున్న వ్యాఖ్య. ప్రతి పనికీ చేతు లు తడపాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఏ చిన్న పనికి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లినా.. ఏ చిన్న వ్యా పారం ప్రారంభించినా.. చేతులు తడపాల్సిన దుస్థితి ఏర్పడిందన్నది టీడీపీ నాయకులే చెబుతున్నారు. ఈ పరిస్థితిని సీఎం చంద్రబాబు సమీక్షించాలి. పరిస్థితిని చక్కదిద్దాలి. లేకపోతే.. మార్పు మాట ఏమో కానీ.. ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితి మాత్రం ఉండదని అంటున్నారు పరిశీలకులు. ఆ దిశగా సర్కారు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
