Begin typing your search above and press return to search.

నియోజ‌క‌వ‌ర్గాలు పెర‌గ‌క‌పోతే ఏపీలో వాట్ నెక్ట్స్‌.. ?

ఇటీవ‌ల రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ స‌హా వైసీపీ నాయ‌కులు సంబ‌రాలు చేసుకున్నారు.

By:  Garuda Media   |   7 May 2026 5:00 PM IST
నియోజ‌క‌వ‌ర్గాలు పెర‌గ‌క‌పోతే ఏపీలో వాట్ నెక్ట్స్‌.. ?
X

ఇటీవ‌ల రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ స‌హా వైసీపీ నాయ‌కులు సంబ‌రాలు చేసుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటి కి రాష్ట్రంలో నియోజ‌క‌వ‌ర్గాల పెంపు ఉంటుంద‌ని.. త‌ద్వారా త‌మ‌కు మేలు జ‌రుగుతుంద‌ని.. కొత్త నాయ కులు ఉవ్విళ్లూరారు. టీడీపీ కూడా.. పెద్ద ఎత్తున కొత్త నియోజ‌క‌వ‌ర్గాల‌పై ప్ర‌చారం చేసింది. ముఖ్యంగా మ‌హిళా రిజ‌ర్వేష‌న్ అంశం త‌మ‌కు క‌లిసి వ‌స్తుంద‌ని భావించింది. రాష్ట్రంలో 80 నియోజ‌క‌వ‌ర్గాల‌కు పైగా మ‌హిళ‌ల‌కు కేటాయించే అవ‌కాశం ఉంటుంద‌ని కూడా అంచ‌నా వేశారు.

అయితే.. అనూహ్యంగా ఈ బిల్లు పార్ల‌మెంటులో వీగిపోయింది. దీంతో ఇప్పుడు నెక్ట్స్ ఏంటి? అనే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌చ్చింది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పార్ల‌మెంటు ఈ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న బిల్లును ఆమోదించినా..ఆమోదించ‌క‌పోయినా.. ఏం చేయాల‌న్న ఆలోచ‌న‌లో పార్టీలు ఉన్నాయి. వాస్త‌వానికి వైసీపీ గ‌త ఎన్నిక‌ల్లోనే సాహ‌సం చేసి సీనియ‌ర్ల‌ను ప‌క్క‌న పెట్టి కొత్త వారికి అవ‌కాశం ఇచ్చింది. ఇక‌, కూట‌మి లోనూ ఈ ప్ర‌య‌త్నాలు, ప్ర‌యోగాలు చేశారు. కొన్ని చోట్ల స‌క్సెస్ కూడా అయ్యారు.

ఈ నేప‌థ్యంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రింత మంది ఎక్కువ నేత‌ల‌కు పెర‌గే నియోజ‌క‌వ‌ర్గాలు కేటాయించాల‌ని అంచ‌నాకు వ‌చ్చారు. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి యూట‌ర్న్ తీసుకుంది. అయిన‌ప్ప‌టికీ.. మెజారిటీ సీట్ల ను కొత్త వారికే కేటాయించాల‌ని పార్టీలు నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. టీడీపీలో ఈ విష‌యంపై పెద్ద ఎత్తున క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది. ఈ నెల‌లో జ‌ర‌గ‌నున్న పార్టీ మ‌హానాడు వేదిక‌పైనే 33 శాతం మ‌హిళ‌ల‌కు టికెట్ లు కేటాయించే ప్ర‌క‌ట‌న‌చేస్తుంద‌ని తెలుస్తోంది.

ఇక‌, వైసీపీలోనూ ఈ విష‌యంపై చ‌ర్చ జ‌రుగుతున్నా.. పాద‌యాత్ర త‌ర్వాతే దీనిపైనిర్ణ‌యం తీసుకుంటా మ‌ని ఇటీవ‌ల స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి చెప్పారు. వైసీపీలో కూడా కొత్త‌వారికి అవ‌కాశం ఇస్తున్నా.. ఈ ద‌ఫా గెలుపు గుర్రం ఎక్కాల‌ని నిర్ణ‌యించుకున్న ద‌రిమిలా.. పార్టీ ప‌రంగా యాక్టివ్‌గా ఉన్న‌వారిని మాత్ర‌మే కొత్త ముఖాలుగా ఎంపిక చేసుకునే అకవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. సో.. ఎలా చూసినా.. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగినా.. జ‌ర‌గ‌క‌పోయినా.. మార్పులు మాత్రం త‌థ్య‌మ‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.