గ్రహాంతర వాసుల నౌక...భూమిని ఢీ కొడుతుందా ?
సౌర వ్యవస్థలో చొరబడేలా గ్రహాంతర వాసులు ఉనికి చాటుకుంటున్నారా. వారు తమ ప్రస్థానానికి వేదికగా చేసుకుంటున్నరా అంటే అంతరిక్ష పరిశోధకులు దీని మీద సీరియస్ గానే అధ్యయనం చేస్తున్నారు.
By: Satya P | 21 Nov 2025 12:50 AM ISTసౌర వ్యవస్థలో చొరబడేలా గ్రహాంతర వాసులు ఉనికి చాటుకుంటున్నారా. వారు తమ ప్రస్థానానికి వేదికగా చేసుకుంటున్నరా అంటే అంతరిక్ష పరిశోధకులు దీని మీద సీరియస్ గానే అధ్యయనం చేస్తున్నారు. మన సౌర వ్యవస్థకు కడు దూరంగా ఉన్న ఒక నక్షత్ర మండలం నుంచి ఒక పురాతనమైన తోక చుక్క ప్రవేశించింది అని గుర్తించారు. దాని పేరు అయితే 3 వన్ అట్లాస్ గా చెబుతున్నారు. ఇక దీని విషయం తీసుకుంటే కోట్ల ఏళ్ళు కలిగిన మన భూమి కంటే కూడా ప్రాచీనమైనదిగా చెబుతున్నారు. అయితే ఇది తోక చుక్కనా లేక గ్రహాంతర వాసుల అంతరిక్ష నౌకనా అన్నదే ఇపుడు పెద్ద చర్చగా ఉంది.
విస్తృతంగా ప్రచారం :
దీని మీద వదంతులుగా విస్తృతమైన ప్రచారం అయితే సాగుతోంది. అయితే దీని మీద అమెరికా కాంగ్రెస్ మెంబర్ అలాగే హౌస్ సైన్స్ కమిటీకి చెందిన జాజి వైట్ సైడ్స్ ఒక స్పష్టమైన వివరణ ఇవ్వడం జరిగింది. ఇంతకీ అదేంటి అంటే అది గ్రహాంతరవాసుల అంతరిక్ష నౌక అనడానికి ఏ రకమైన ఆధారాలు అయితే లేవని ఆయన చెప్పారు.
తోక చుక్క వయసు ఎంతంటే :
ఇక పురాతనమైన తోక చుక్క వయస్సు ఎంత అన్నది కూడా అంచనా వేస్తున్నారు. దాని వయసు అయిదు వందల కోట్ల నుంచి 800 కోట్ల వయసుగా పేర్కొంటున్నారు. ఈ 3 వన్ అట్లాస్ తోకచుక్క మీద ప్రస్తుతం అంతా ఆసక్తిని చూపిస్తున్నారు. చర్చ కూడా దీని మీదనే సాగుతోంది. ఇక ఈ తోక చుక్క గురించి నాసా కూడా పరిశోధనలు మొదలెట్టింది. తోక చుక్క వ్యవహారం ఏంటో తెలుసుకోవడానికి నాసా 12 దాకా అంతరిక్ష నౌకలను అలాగే టెలిస్కోప్ లను రంగమోకి దించింది ఈ తోక చుక్కను అనేక రకాలైన కోణాలలో ఫోటోలను కూడా తీసింది. మన సౌర వ్యవస్థలో కూడా అనేక తోక చుక్కలు ఉన్నాయి. వాటితో ఈ 3 వన్ అట్లాస్ తోకచుక్క సరిపోతున్నదా లేదా అని అధ్యయనాలు నాసా చేస్తోంది. అంతే కాకుండా సౌర వ్యవస్థకు దూరంగా ఉన్న గ్రహాల గురించి కూడా ఇదే సమయంలో తెలుసుకునేందుకు కూడా నాసా శాస్త్రవేత్తలు ఆసత్కిని చూపిస్తున్నారు.
వింతలూ విశేషాలు :
ఇక ప్రస్తుతం అంతా చెప్పుకుంటున్న 3 వన్ అట్లాస్ తోకచుక్క గత ఏడాది అంగారకుడికి దాదాపుగా 3 కోట్ల 5 లక్షల 77 వేల 736 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించినట్లు నాసా గురించింది. ఇపుడు అంగారకుడి గ్రహం చుట్టూ నాసాకు చెందిన మార్స్ రికనైసెన్స్ ఆర్బిటర్ చాలా సమీపంలో నుంచి ఫోటోలు కూడా తీసి పంపించించిందని చెబుతున్నారు ఇదే పనిలో ఉన్న మరో ఆర్బిటర్ సైతం మావెన్ అతి నీల లోహిత డేటాను కూడా సేకరించింది అని చెబుతున్నారు ఇవన్నీ కూడా 3వన్ అట్లాస్ తోకచుక్క గురించి ఇంకా లోతైన అధ్యయనం చేయడానికి ఉపకరిస్తాయని అంటున్నారు.
తోక చుక్క రహస్యాలు :
ఇక 3 వన్ అట్లాస్ గా పేరు పెట్టిన ఈ తోకచుక్క వేగం చాలానే ఉంది అని అంటున్నారు. చిత్రమేంటి అంటే ఇది మన సౌర వ్యవస్థ నుంచి దూరంగా ప్రయాణం చేస్తున్నా గురుత్వాకర్షణ శక్తికి అయితే గురి కాలేదని అంటున్నారు. దాంతో ఇది ప్రత్యేకమైనదిగానే చూస్తున్నారు. ఇది ఏ కక్ష్య గుండా ప్రయాణిస్తోంది. దీని కూర్పు వేగం తదితర అంశాలు అన్నీ కూడా నాసా అధ్యయనం చేసేందుకు చూస్తోంది. ఈ అధ్యయనం కనుక జరిగితే కోట్లాది ఏళ్ళ క్రితం నాటి గ్రహాంతర నక్షత్ర వ్యవస్థ వాటి పరిస్థితులు అన్నీ అర్ధం అవుతాయని అంటున్నారు.
భూమిని ఢీ కొట్టే చాన్స్ :
అయితే ఈ తోక చుక్క సౌర వ్యవస్థ వైపుగా సాగి భూమిని ఢీ కొట్టే పరిస్థితులు ఉంటే ఎలా అన్నదే అమెరికన్ కాంగ్రెస్ మెంబర్ వైట్ సైడ్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి పరిస్థితి కనుక ఉత్పన్నం అయితే ఈ తోకచుక్కను అడ్డుకోవడానికి ఉపద్రవాన్ని ఎదుర్కోవడానికి కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉంది అని ఆయన అంటున్నారు. ఈ క్రమంలోనే నాసా నిరంతరాయంగా దీనిని సంబంధించిన డేటాను సేకరించే పనిలో ఉందని అంటున్నారు.
