అనపర్తి రాజకీయం అదరహో.. !
మరోవైపు సాంకేతికంగా రామకృష్ణారెడ్డి బీజేపీ ఎమ్మెల్యేగా కొనసాగుతుండగా, స్థానికంగా ఆయన కుమారుడు నల్లమిల్లి మనోజ్ రెడ్డి.. అనపర్తి టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు.
By: Garuda Media | 16 Sept 2026 5:00 AM ISTఅనపర్తి నియోజకవర్గంలో టీడీపీ - బీజేపీ రాజకీయం చాలా ఆసక్తికరంగా మారింది. అదేసమయంలో భిన్నమైన సమీకరణలతో ముందుకు సాగుతోంది. 2024 ఎన్నికల పొత్తులో భాగంగా ఈ స్థానం బీజేపీకి కేటాయించారు. కానీ, అప్పటి వరకు టీడీపీలో ఉన్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బీజేపీలో చేర్చి.. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆయన విజయం దక్కించుకున్నారు. ప్రస్తుతంబీజేపీ నాయకుడిగానే వ్యవహరిస్తున్నా.. రాజకీయం అంతా కూడా.. టీడీపీ వైపు నుంచే జరుగుతోందన్న టాక్ వినిపిస్తోంది.
మరోవైపు సాంకేతికంగా రామకృష్ణారెడ్డి బీజేపీ ఎమ్మెల్యేగా కొనసాగుతుండగా, స్థానికంగా ఆయన కుమారుడు నల్లమిల్లి మనోజ్ రెడ్డి.. అనపర్తి టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. దీంతో కూటమిలో కొత్త రాజకీయ సమీకరణం తెరపైకి వచ్చింది. తండ్రి బీజేపీ - కుమారుడు టీడీపీ అంటూ.. వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఇరు పార్టీల మధ్య సఖ్యత ఉన్న క్రమంలో ఈ విమర్శలను ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక, ఎమ్మెల్యే నల్లమిల్లి బీజేపీలో ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పట్టుకోసం తన కుమారుడు మనోజ్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.
కూటమిలో ఎలాంటి విభేదాలు రాకుండా, ఐక్యత దెబ్బతినకుండా తండ్రి తెరవెనుక ఉండి కుమారుడిని నడిపిస్తు న్నారన్న టాక్ వినిపిస్తోంది. యువతను ప్రోత్సహించేలా కుమారుడు పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే.. ఒకే కుటుంబంలో తండ్రి కమలం పార్టీ, కుమారుడు పచ్చ కండువాతో వ్యవహరిస్తుండడంపై రాజకీయ వర్గాల్లో విభిన్న విశ్లేషణలు వస్తున్నాయి. అయితే.. ఇది కూటమికి మేలు చేస్తుందే తప్ప.. మైనస్ కాదని అంటున్నారు. దీనికి ప్రధానంగా రెండు కారణాలు చెబుతున్నారు.
ప్రస్తుతం పలు నియోజకవర్గాల్లో బీజేపీ-టీడీపీ నేతల మధ్య అంతర్గత వివాదాలు ఉన్నాయి. దీంతో నియోజకవర్గం లో కూటమి పరుగు పెట్టే విషయంలో నాయకుల మధ్య సఖ్యత కొరవడిందనే వాదన ఉంది.కానీ, దీనికి భిన్నంగా అనపర్తిలో బీజేపీ-టీడీపీ నేతలు ఒకే ఇంటి వారు కావడంతో వివాదాలు లేని రాజకీయాలు ముందుకు సాగుతున్నా యి. రెండోది.. స్థానిక ఎన్నికలపై పట్టు విషయంలోనూ.. ఎమ్మెల్యే, ఆయన కుమారుడి వర్గాల మధ్య పోటీ తక్కువగానే ఉంది. ఎవరు నిలబడినా.. పరస్పర సహకారంతో ముందుకు సాగాలని నిర్ణయించారు. మొత్తంగా అనపర్తిలో నెలకొన్న రాజకీయాలు చిత్రంగా ఉన్నా.. కూటమికి ప్లస్‌గా మారాయి.
