హానీ ట్రాప్ లో బిగ్ ట్విస్ట్...పోలీసులకు ఉచ్చు
ఇక ఈ హానీ ట్రాప్ కేసులో అసలైన నిందితురాలు ప్రధాన సూత్రధారి అయిన చిన్ని అలియస్ రంగమ్మను ప్రత్యేక పోలీస్ విచారణ బృందం కస్టడీకి తీసుకుందని చెబుతున్నారు.
By: Satya P | 26 April 2026 1:43 PM ISTఅనంతపురం జిల్లాలో అతి పెద్ద సంచలనంగా హానీ ట్రాప్ కేసు ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఈ మొత్తం వ్యవహారంలో ఇపుడు బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో కొందరు పోలీసుల చుట్టూ గట్టిగా ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇద్దరు సీఐలు, ఏ ఎస్ ఐ ఒక హెడ్ కానిస్టేబుల్ అలాగే నలుగురు కానిస్టేబుళ్లను వీఆర్ కి పంపించినట్లుగా తెలుస్తోంది అయితే ఈ కేసులో లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటి అంటే రాప్తాడు సీఐ శీహర్ష డ్రైవర్ శ్రీనివాస్ ని కూడా వీఆర్ కు పంపించారు.
సీరియస్ గానే కేసు :
అనంతపురంలో హానీ ట్రాప్ కేసు మీద ఇపుడు పోలీసు ఉన్నత యంత్రాంగం సీరియస్ గానే ఫోకస్ పెట్టింది. దాంతో జిల్లా ఎస్పీ జగదీష్ పర్యవేక్షణలో తాడిపత్రి ఏఎస్ఐ తో పాటు ట్రైనీ ఐపీఎస్ అధికారులు విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. అంతే కాదు ఈ మొత్తం కేసులో పోలీసుల పాత్ర ఏ మేరకు ఉంది అన్నది కూడా విచరిస్తున్నారు. ఇక నిన్నటికి నిన్న కొందరు పోలీసులను పిలిపించి విచారించినట్లుగా తెలుస్తోంది. అలాగే మరో ముగ్గురు కీలక నిందితులను ఈ కేసులో అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నట్లుగా భోగట్టా.
అసలైన నిందితురాలు :
ఇక ఈ హానీ ట్రాప్ కేసులో అసలైన నిందితురాలు ప్రధాన సూత్రధారి అయిన చిన్ని అలియస్ రంగమ్మను ప్రత్యేక పోలీస్ విచారణ బృందం కస్టడీకి తీసుకుందని చెబుతున్నారు. దాంతో ఈ మొత్తం కేసు వెనక అసలు సూత్రధారులు పాత్రధారులు ఎవరు అన్నది కూడా పోలీసులు సీరియస్ గానే విచారిస్తున్నారు. ఇంకో వైపు చూస్తే ఈ కేసులో నిందితులుగా పోలీసులు భావిస్తున్న అయిదుగురిని ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించారు. మరో నలుగురు మాత్రం పరారీలో ఉన్నట్లుగా చెబుతున్నారు. వారి కోసం పెద్ద ఎత్తున పోలీసుల గాలింపు చర్యలు మొదలయ్యాయి. ఇక ఇదే కేసులో మరో ముగ్గురు నిందితులను లేటెస్ట్ గా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అని భోగట్టా.
కాల్ డేటాలో కీలక వ్యక్తులు :
హానీ ట్రాప్ కేసులో అదుపులోకి తీసుకున్న నిందితుల కాల్ డేటాని పరిశీలిస్తున్న పోలీసులకు కీలక వ్యక్తులు దీని వెనక ఉన్నారని తెలిసిందని అంటున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులతో ఈ కీలక నేతలు పలు మార్లు మొబైల్ ఫోన్ లో మాట్లాడినట్లుగా వాయిస్ రికార్డుల ఆధారంగా గుర్తించారని అంటున్నారు. అంతే కాదు ఇదే కేసులో మరిన్ని కొత్త ఆధారాలు బయటపడుతున్నాయని చెబుతున్నారు. దాంతో పోలీసులు ఈ కేసులో విచారణను మరింత ముమ్మరం చేశారు. అంతే కాదు ఈ హానీ ట్రాప్ కేసులో ప్రముఖులు రాజకీయాలతో సంబంధం ఉన్న వారి ప్రమేయం కూడా ఉందా అన్న కోణంలో చూస్తున్నారు.
లక్షల వసూలు :
హానీ ట్రాప్ పేరుతో ఇప్పటికే ముఠా లక్షల రూపాయల దాకా వసూలు చేసినతుగా చెబుతున్నారు. హానీ ట్రాప్ లో కేవలం అమాయకులను లక్ష్యంగా చేసుకున్నారని అంటున్నారు. బాగా డబ్బున్న వారికి వల వేసి మరీ ట్రాప్ చేసేవారు అని అంటున్నారు ఆ మీదట బాధితులు ఈ ముఠాకు లక్షలలో డబ్బులు అర్పించుకున్నారని అంటున్నారు. ఈ హానీ ట్రాప్ కేసులో నిందితుల వద్ద నుంచి ఏకంగా 13 లక్షల రూపాయల నగదు బయటపడింది. అదే విధంగా కొన్ని ప్రామిసరీ నోట్లు రెండు కత్తులు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని అంటున్నారు.
