Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ నేత కాలేజీకి అమిత్ షా... తెలంగాణా రాజకీయాల్లో కొత్త చర్చ !

కేంద్ర మంత్రి బీజేపీకి అన్ని విధాలుగా మార్గదర్శకుడు అయిన అగ్ర నేత అమిత్ షా తాజాగా చేపట్టబోతున్న తెలంగాణా పర్యటన రాజాకీయ వర్గాలలో ఆసక్తిని పెంచుతోంది.

By:  Satya P   |   23 July 2026 9:18 AM IST
బీఆర్ఎస్  నేత కాలేజీకి అమిత్ షా... తెలంగాణా రాజకీయాల్లో కొత్త చర్చ !
X

కేంద్ర మంత్రి బీజేపీకి అన్ని విధాలుగా మార్గదర్శకుడు అయిన అగ్ర నేత అమిత్ షా తాజాగా చేపట్టబోతున్న తెలంగాణా పర్యటన రాజాకీయ వర్గాలలో ఆసక్తిని పెంచుతోంది. ఈ ఆదివారం అంటే 26వ తేదీన అమిత్ షా తెలనగణా పర్యటన పెట్టుకున్నారు. ఈ బీజేపీ అగ్రనేత పర్యటనలో భాగంగా ఒక బీఆర్ఎస్ నాయకుడి కళాశాలను సందర్శించడమే ఇపుడు హాట్ పొలిటికల్ టాపిక్ అయింది. దీంతో అనేక రకాలుగా రాజకీయ ఊహాగానాలకు ఈ పరిణామం తెర లేపింది అని అంటున్నారు. బీఆర్ఎస్ బీజేపీ రెండూ ఒక్కటే అని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేలా అమిత్ షా తాజా టూర్ ఉండబోతోందా అని కూడా ఆలోచిస్తున్నారు.

రజతోత్సవాలకు చీఫ్ గెస్ట్ గా :

ఇదిలా ఉంటే బీఆర్ఎస్ కి చెందిన కీలక నేత బోయినపల్లి శ్రీనివాసరావుకు ప్రతిమ మెడికల్ కాలేజీ ఉంది. ఈ కాలేజీకి రజతోత్సవ వేడుకలు జరుగుతున్న నేపధ్యంలో అమిత్ షా ముఖ్య అతిధిగా హాజరుకానున్నారని తెలుస్తోంది. ఇక అమిత్ షా పర్యటన చూస్తే కేవలం కాలేజ్ ఉత్సవాలకే హైదరాబాద్ వచ్చి మళ్ళీ అటునుంచి అటే ఢిల్లీకి వెళ్ళిపోతున్నారని అంటున్నారు. పైగా అదే కాలేజీలో అమిత్ షా మధ్యాహ్న భోజనం చేస్తారని అంటున్నారు. ఒక విధంగా అమిత్ షా వస్తున్నది బీఆర్ఎస్ నేత కార్యక్రమం వారి ఆతీధ్యం స్వీకరించడానికే కావడంతో తెలంగాణా రాజకీయాలు దీని మీదనే హీటెక్కిపోతున్నాయి.

మాజీ ఎంపీకి సోదరుడిగా :

ఇంతకీ ఈ బోయినపల్లి శ్రీనివాసరావు ఎవరు అంటే బీఆర్ఎస్ ఎంపీ బి. వినోద్ కుమార్ కి సోదరుడు అని చెబుతున్నారు అని చెబుతున్నారు. వినోద్ కుమార్ బీఆర్ఎస్ లో అతి ముఖ్య నేత. గతంలో ఎంపీగా పనిచేసిన నాయకుడు. దాంతో పాటు కేసీఅర్ కి సన్నిహిత నేత కావడ మరో విశేషం. మరి అంతటి నేత కుటుంబం నిర్వహించే వైద్య కళాశాల వేడుకకు అమిత్ షా వంటి బీజేపీ ఉద్దండుడు వస్తున్నారు అంటే రాజకీయ సమీకరణలు మలుపు తిప్పే సంఘటనగానే చూస్తున్నారు.

ఎన్ని చెప్పినా :

ఇక బీజేపీ బీఆర్ఎస్ కలవవు అని ఎన్ని చెప్పినా తెలంగాణా రాజకీయం చూస్తే అది అనివార్యం అనిపిస్తుంది అని రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉంది. విపక్షాలు రెండుగా చీలి 2028లో పోటీకి దిగితే కచ్చితంగా యాంటీ ఇంకెంబెన్సీ ఎంత ఉన్నా ఓట్లు అన్నీ అటూ ఇటుగా చీలిపోతాయి. అపుడు కాంగ్రెస్ కే లాభం అని అంటున్నారు. ఈ విషయం రాజకీయంగా ఢక్కామెక్కీలు తిన్న బీజేపీకి బీఆర్ఎస్ కి తెలియనిది కాదు కదా అని అంటున్నారు. మరో వైపు చూస్తే బీఆర్ ఎస్ కి ఈసారి ఎన్నికలు చావో రేవో అన్నట్లుగానే ఉంటాయని అంటున్నారు. రెండోసారి వరుసగా ఓటమి పాలు అయితే కనుక బీఆర్ఎస్ ఎన్నడూ లేనంతగా రాజకీయ సంక్షోభంలో పడుతుంది అని అంటున్నారు.

కాంగ్రెస్ కి బ్రేకులు వేసే వ్యూహాలు :

అది బీఆర్ఎస్ సమస్య అయితే బీజేపీకి చూస్తే కాంగ్రెస్ ఎక్కడా ఎదగకూడదు అన్నదే గట్టి సంకల్పం అని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ కనుక రాష్ట్రాలలో బలపడి ఎక్కువగా ఎంపీ సీట్లు సాధిస్తే అది జాతీయ స్థాయిలో బీజేపీ అధికారానికి ముప్పు అని అంటున్నారు. అందుకే తాము నేరుగా కట్టడి చేయాల్సిన చోట కట్టడి చేస్తూ లేని చోట్ల మాత్రం మిత్రులను వెతుక్కుని మరీ కాంగ్రెస్ కి బ్రేకులు వేసే వ్యూహాలు బీజేపీ అమలు చేస్తోంది. ఈ విధంగా రాజకీయ విశ్లేషణలు చూసినపుడు బీఆర్ ఎస్ బీజేపీ కలసి పోటీ చేయబోవని అనుకోవడానికి వీలు లేదని అంటున్నారు. అయితే రాజకీయాల్లో వ్యూహాలు అన్నీ సమయానుకూలంగా బయటకు వస్తాయని అంటున్నారు. మరో వైపు చూస్తే బీజేపీ మీద నేరుగా విమర్శలు చేయడాన్ని బీఆర్ఎస్ తగ్గించిందని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తం మీద అయితే తెలంగాణాలో అమిత్ షా టూర్ ఆసక్తిని పెంచేస్తోంది.